Mon Dec 23 2024 14:21:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మైక్ పనిచేయకపోవడంతో పవన్ కళ్యాణ్ లేచి వెళ్లిపోయారన్న ప్రచారం నిజం లేదు
జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పటికే పొలిటికల్ పనులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. దశాబ్దానికి పైగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్.
Claim :
మైక్ పనిచేయకపోవడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నుంచి వెళ్లిపోయారుFact :
పవన్ కళ్యాణ్ మధ్యలో వెళ్లిపోలేదు.. మరో మైక్ ఉపయోగించి మాట్లాడేందుకు లేచారు
జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పటికే పొలిటికల్ పనులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. దశాబ్దానికి పైగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి గెలిచారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయంలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణపై ఆయన అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
మైక్ పని చేయక పోవడంతో తన సీటు నుండి లేచి.. మీటింగ్ నుండి వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “నాకు ఇంట్రెస్ట్ పోయింది.. మైక్ పనిచేయకపోవడంతో కోపంగా లేచి వెళ్ళిపోయిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్. #Pawanakalyan #janasenaparty #deputycm @PawanKalyan @JanaSenaParty” అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ సమావేశం నుంచి వెళ్లకుండా లేచి నిలబడి మైక్ లో ప్రసంగించారు.
వైరల్ వీడియో కింద కామెంట్లను మేము గమనించగా.. కొంతమంది వినియోగదారులు పవన్ కళ్యాణ్ కుర్చీలో నుండి లేచి నిలబడి మైక్ వద్దకు వెళ్లి సభను ఉద్దేశించి ప్రసంగించిన క్షణాలను పంచుకున్నట్లు మేము చూడగలిగాము.
దీన్ని క్యూగా తీసుకుని మేము కీవర్డ్ సెర్చ్ చేయగా.. Mango News ఛానల్ లో “మైక్ పనిచేయకపోవడంతో డిప్యూటీ CM చేసిన పని చూస్తే శభాష్ అంటారు | Pawan Kalyan | AP Govt | Janasena” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారని మేము గమనించాం. మరో నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో.. మీటింగ్ సమయంలో మైక్ పనిచేయకపోవడంతో పవన్ కళ్యాణ్ లేచి స్టాండ్-ఇన్ మైక్ వద్దకు వెళ్లి సభను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించడాన్ని మనం చూడవచ్చు.
అదే కార్యక్రమంను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మరో వీడియో మాకు కనిపించింది. ‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేస్ట్ రీసైక్లింగ్ గురించి మాట్లాడుతున్నారు’ అనే క్యాప్షన్తో వీడియోను షేర్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణపై సమావేశం జరిగిందని అందులో తెలిపారు.
హాన్స్ ఇండియాలోని ఒక కథనం ప్రకారం.. చెత్తను రోడ్లపైకి విసిరే పనులు మానుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ కవర్లు, సంచులు తిని పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలన్నారు. భీమవరంలోని ఇరిగేషన్ కెనాల్ పక్కనే ఉన్న భారీ చెత్తకుప్పను చూసి ఆ కాలువ, చుట్టుపక్కల పాఠశాల ఆవరణలు ఎలా కలుషితం అవుతున్నాయో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 54 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలతో కూడిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తెలిపారు.
కాబట్టి, వైరల్ వీడియో ప్రజలను తప్పుదారి పట్టించే వాదనతో ప్రచారం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైక్ పని చేయకపోవడంతో ఈవెంట్ నుండి వెళ్ళిపోలేదు. లేచి నిలబడి మరో మైక్ లో ప్రసంగించారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.
Claim : మైక్ పనిచేయకపోవడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నుంచి వెళ్లిపోయారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story