Mon Dec 23 2024 17:28:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే 20000 జరిమానా అని ప్రభుత్వం చెప్పలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవింగ్ చేసే సమయంలో హెడ్ ఫోన్స్ వాడుతూ చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో ప్రయాణం చేసే సమయంలో హెడ్ ఫోన్స్ ను వాడకూడదని.. వాడితే భారీగా జరిమానా విధించనున్నారు పోలీసులు. అయితే 20,000 రూపాయల జరిమానా అంటూ ప్రచారం సాగుతూ ఉంది.
Claim :
ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌ఫోన్స్ వాడితే వాహనదారులకు రూ.20,000 జరిమానా విధిస్తారు.Fact :
ఆంధ్రప్రదేశ్‌లో ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ ధరించి డ్రైవింగ్ చేస్తే జరిమానా రూ.1,500-రూ.2,000 మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవింగ్ చేసే సమయంలో హెడ్ ఫోన్స్ వాడుతూ చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో ప్రయాణం చేసే సమయంలో హెడ్ ఫోన్స్ ను వాడకూడదని.. వాడితే భారీగా జరిమానా విధించనున్నారు పోలీసులు. అయితే 20,000 రూపాయల జరిమానా అంటూ ప్రచారం సాగుతూ ఉంది.
“*ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్* *డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్న జరిమానా. ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుంటే *20,000* జరిమానా వేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి” అంటూ పలువురు పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఇయర్ఫోన్లు పెట్టుకుని వాహనం నడిపినందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ విధించే జరిమానా రూ.2000.
మేము కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా AP రవాణా కమిషనర్ ద్వారా వివరణను ప్రచురించిన అనేక కథనాలను మేము కనుగొన్నాము.
ap7am.com లో పబ్లిష్ చేసిన కథనం ప్రకారం. ఏపీలో హెడ్సెట్, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేసే వాహనదారులపై రూ.20 వేల జరిమానా వడ్డిస్తారన్న వార్త నిజం కాదని ఏపీ రవాణా శాఖ కమిషనర్ చెప్పారు. ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. పదేపదే ఇదే నేరం చేస్తే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు విధిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. ఈ రూల్స్ చాలా కాలంగానే అమల్లో ఉన్నాయని చెప్పారు. జరిమానా పెంపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఈ అసత్య కథనాలను నమ్మొద్దని సూచించారు.
www.indianherald.com ప్రకారం, ఈ నిబంధన ఇటీవల తీసుకుని రాలేదు. ఇది చాలా కాలంగా అమల్లో ఉంది. ఇయర్ఫోన్లు పెట్టుకుని వాహనాలు నడిపితే జరిమానాలు పెంచడం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.
డ్రైవింగ్ చేస్తూ.. ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ వాడితే రూ.20,000 జరిమానా విధిస్తారని జరుగుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఏపీలో ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 1,500 నుంచి 2,000 వరకు జరిమానా విధిస్తారు.
Claim : A penalty of Rs 20,000 will be imposed on motorists driving while wearing headphones or earphones in Andhra Pradesh.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story