Fri Mar 14 2025 23:16:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సంకెళ్లు, గొలుసులతో అమెరికా నుండి వలసదారుల్ని పంపుతున్న వీడియోకి భారత దేశానికి సంబంధం లేదు
అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిపై ట్రంప్ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అణిచివేత ధోరణిలో భాగంగా అమెరికా 104 మంది

Claim :
భారతీయ వలసదారులను సంకెళ్లు, గొలుసులతో అమెరికా నుండి బహిష్కరించినట్లు వైరల్ వీడియో చూపిస్తుందిFact :
వైరల్ వీడియోలో ఉన్నది భారత వలసదారుల బహిష్కరణ కాదు
అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిపై ట్రంప్ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా అమెరికా 104 మంది అక్రమ భారతీయ వలసదారులను సైనిక విమానంలో అమృత్సర్కు తరలించింది. మహిళలు, పిల్లలతో సహా పలువురు బహిష్కరణకు గురైన వారిలో ఉన్నారు. తాము ఈ ప్రయాణంలో ఎన్నో భయానక పరిస్థితుల్లో బతికామని, ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నామని తెలిపారు. బహిష్కరణకు గురైన వారు ప్రధానంగా పంజాబ్, హర్యానా, గుజరాత్, మరికొన్ని భారతీయ రాష్ట్రాలకు చెందినవారు. విమానాశ్రయంలో అవసరమైన లాంఛనాలు పూర్తి చేసి వారిని స్వగ్రామాలకి పంపించారు. ఈ ప్రయాణికుల్లో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు.
ఇలా తరలిస్తున్న కొంతమంది చేతులు, కాళ్ళను గొలుసులతో బంధించి, ముఖాలకు మాస్క్లు వేసి సైనిక విమానంలోకి తీసుకుని వెళుతున్నట్లు చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. X లో యునైటెడ్ స్టేట్స్ నుండి బహిష్కరించబడిన భారతీయ వలసదారులని ఇలా తీసుకువస్తున్నారు అంటూ షేర్ చేస్తున్నారు. “मुंह पर मास्क, हाथों में हथकड़ी और पैरों में बेड़ियां इतनी बेदर्दी भारतीयों को अमेरिका से निकाला जा रहा..!! यह दृश्य अमेरिका में भारतीयों के साथ हो रहे दुर्व्यवहार और अन्याय को दर्शाता है..!! यह महत्वपूर्ण है कि हम इस मुद्दे पर भारत सरकार ध्यान दे और आवश्यक कार्रवाई करें..!!” అంటూ హిందీలో పోస్టు వైరల్ అవుతూ ఉంది. “భారతీయులు ముఖాలకు ముసుగులు, చేతులకు సంకెళ్ళు, వారి కాళ్ళకు సంకెళ్ళతో ఎలాంటి కనికరం చూపించకుండా అమెరికా నుండి బహిష్కరించారు. అమెరికాలో భారతీయులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ దృశ్యం కళ్లకుకట్టినట్లు చూపిస్తోంది..!! ఈ సమస్యపై భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం..!!
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు. ఈ వీడియోలో ఉన్నది భారతీయ వలసదారులు కాదు. అమెరికా నుండి వారిని బహిష్కరిస్తున్నట్లు చూపించలేదు, గ్వాటెమాలా, మెక్సికోలకు చెందిన వలసదారుల బహిష్కరణకు సంబంధించింది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకొని గూగుల్ లో సేర్చ్ చేయగా, వీడియో కొన్ని రోజుల క్రితమే ఆన్లైన్ లో పబ్లిష్ అయినట్లు తెలుస్తోంది. కొలంబియా, గ్వాటెమాల వంటి దేశాలకు చెందిన అక్రమ వలసదారులను విమానంలో తమ తమ దేశాలకు పంపినట్టు గుర్తించాం. CNBC-e లో ‘Trump has begun sending illegal immigrants to countries like Colombia and Guatemala by plane’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు.
అమెరికన్ న్యూస్ ఛానెల్ WKYC ఛానెల్ నిడివి ఎక్కువ ఉన్న పొడవైన వెర్షన్ను షేర్ చేసింది “Immigrant deportation flights take off on military aircraft from Fort Bliss, Texas” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. వీడియో టైటిల్ ద్వారా అక్రమ వలసదారులకు సంబంధించిన విమానం బయలుదేరిందని తెలియజేసారు. జనవరి 23న టెక్సాస్లోని ఫోర్ట్ బ్లిస్లో C-17 గ్లోబ్మాస్టర్ IIIలో చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయుల సమూహానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. యునైటెడ్ స్టేట్స్లోని నగరాల్లో ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలు కొనసాగుతున్నందున ఆదివారం ఒక్క రోజులో దాదాపు 1,200 మందిని అరెస్టు చేశారు.
వైరల్ వీడియోలో సంకెళ్లతో బంధించిన వ్యక్తులు USA నుండి తరలిస్తున్న భారతీయ వలసదారులను చూపలేదు. ఇది గ్వాటెమాల, కొలంబియాకు వలసదారుల బహిష్కరణకు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : భారతీయ వలసదారులను సంకెళ్లు, గొలుసులతో అమెరికా నుండి బహిష్కరించినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story