Thu Nov 21 2024 20:50:13 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ట్యాంక్బండ్పై ఊరేగింపులో భాగంగా ప్రజలు పాకిస్థాన్ జెండాలు మోయడం లేదు
తెలంగాణలోని ముఖ్యమైన పార్లమెంట్ స్థానాల్లో హైదరాబాద్ ఒకటి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే సస్పెన్స్ జనంలో నెలకొంది. ఇది గత మూడు దశాబ్దాలుగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) కు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బలమైన కోటగా ఉంది.
Claim :
'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేస్తూ పాకిస్థాన్ జెండాలతో ట్యాంక్ బండ్పై ఊరేగింపు నిర్వహించారు.Fact :
వీడియోలో కనిపిస్తున్న జెండాలు పాకిస్థాన్ దేశానికి సంబంధించినవి కావు.. మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా తీసుకెళ్లిన ఇస్లామిక్ జెండాలు
తెలంగాణలోని ముఖ్యమైన పార్లమెంట్ స్థానాల్లో హైదరాబాద్ ఒకటి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే సస్పెన్స్ జనంలో నెలకొంది. ఇది గత మూడు దశాబ్దాలుగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లి
పాకిస్థానీ జెండాలు పట్టుకుని కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ పచ్చ రంగు జెండాలు పట్టుకుని బైక్లపై కొందరు వ్యక్తులు ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“హైదరాబాద్: 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన పాకిస్తాన్ జెండాలతో కేరింతలు.. ఇదెక్కడో పశ్చిమ బెంగాల్, కేరళ లోనో కాదు.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని సచివాలయానికి కూత వేటు దూరంలో ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ విచ్చల విడిగా పాకిస్తానీ జెండాలతో ఊరేగిన పాత బస్తీ మతోన్మాదులు..” అనే వాదనతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో ఇటీవలిది కాదని.. ప్రజలు పాకిస్తాన్ జెండాలను మోయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అవి ఇస్లామిక్ జెండాలని మేము గుర్తించాము.. సాధారణంగా మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సమయంలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. వీడియోలో కనిపించే జెండాలు పాకిస్తాన్ జెండాకు చాలా భిన్నంగా కనిపిస్తాయి. ఆ రెండింటి మధ్య పోలికలను మీరు గమనించవచ్చు.
మేము ఆన్లైన్లో మిలాద్-ఉన్-నబీ ఫ్లాగ్ల కోసం సెర్చ్ చేసినప్పుడు.. వైరల్ వీడియోలో చూసినట్లుగా ఇలాంటి ఫ్లాగ్లను విక్రయించే కొన్ని ఇ-కామర్స్ సైట్లను కూడా కనుగొన్నాము.
వైరల్ వీడియోలోని జెండాలను పాకిస్థాన్ జెండాతో పోల్చిన తర్వాత, అవి పూర్తిగా భిన్నమైనవని మేము నిర్ధారించాము. రెండు జెండాల మధ్య పోలికను మీరు గమనించవచ్చు.
మేము ఆన్లైన్లో మిలాద్-ఉన్-నబీ ఫ్లాగ్ల కోసం సెర్చ్ చేసినప్పుడు.. వైరల్ వీడియోలో చూసినట్లుగా ఇలాంటి ఫ్లాగ్లను విక్రయించే కొన్ని ఇ-కామర్స్ సైట్లను కూడా కనుగొన్నాము.
వైరల్ వీడియోలోని జెండాలను పాకిస్థాన్ జెండాతో పోల్చిన తర్వాత, అవి పూర్తిగా భిన్నమైనవని మేము నిర్ధారించాము. రెండు జెండాల మధ్య పోలికను మీరు గమనించవచ్చు.
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా భారతదేశంలో అమ్మకానికి పెట్టే జెండాలకు సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా తెలుగుపోస్ట్ కనుగొంది. అవి వైరల్ వీడియోలో కనిపించే జెండాలను పోలి ఉన్నాయి.
వైరల్ వీడియో గత సంవత్సరం మిలాద్-ఉన్-నబీ పండుగనాటిదని హైదరాబాద్ పోలీసులు వివరణ ఇచ్చారు. పోలీసులు తమ X (ట్విట్టర్) ఖాతాలో "ఇది మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంలోనిది. అది కూడా గత సంవత్సరం వీడియో. నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని మేము కోరుతున్నాము, లేకపోతే చర్యలు తీసుకుంటాము." అని మేము గమనించాం.
Siasat Daily లో కూడా దీనికి సంబంధించిన కథనాలను మేము గుర్తించాం.
వైరల్ వీడియో పాతది.. వీడియోలో కనిపిస్తున్న జెండాలు పాకిస్థాన్ జెండాలు కావు. సాధారణంగా మిలాద్-ఉన్-నబీ పండుగ ఊరేగింపులో కనిపించే ఇస్లామిక్ జెండాలు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ వీడియో పాతది.. వీడియోలో కనిపిస్తున్న జెండాలు పాకిస్థాన్ జెండాలు కావు. సాధారణంగా మిలాద్-ఉన్-నబీ పండుగ ఊరేగింపులో కనిపించే ఇస్లామిక్ జెండాలు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేస్తూ పాకిస్థాన్ జెండాలతో ట్యాంక్ బండ్పై ఊరేగింపు నిర్వహించారు.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story