Tue Dec 24 2024 00:23:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ డ్యాన్స్ చేసినట్లుగా వైరలవుతున్న పోస్టులు నిజం కాదు
ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన బౌలర్. ఆల్ టైమ్ అత్యుత్తమ శ్రీలంక క్రికెటర్లలో ఒకరు. టెస్ట్, వన్డే క్రికెట్లో అసాధారణమైన స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఎన్నో రికార్డులను ఆయన సాధించారు.
Claim :
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ హిందీ పాట ‘తౌబా తౌబా’కు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.Fact :
వైరల్ అవుతున్న వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ముత్తయ్య మురళీధరన్ కాదు, ముంబైకి చెందిన కొరియోగ్రాఫర్ కిరణ్ జోపాలే.
ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన బౌలర్. ఆల్ టైమ్ అత్యుత్తమ శ్రీలంక క్రికెటర్లలో ఒకరు. టెస్ట్, వన్డే క్రికెట్లో అసాధారణమైన స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఎన్నో రికార్డులను ఆయన సాధించారు.
హిందీ సినిమా “బ్యాడ్ న్యూస్”లోని ‘తౌబా తౌబా’ పాట భారీగా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాటకు ఒక వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు.. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అని పలువురు నెటిజన్లు చెబుతూ వస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ముత్తయ్య మురళీధరన్ కాదు. మేము వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.. జూలై 25, 2024న వీడియోని YouTube ఛానెల్లో షార్ట్స్ లో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.
యూట్యూబ్ ఛానల్ పేరు Mr. KiranJ లో వీడియోను అప్లోడ్ చేశారు. ఈ యూట్యూబ్ ఛానెల్ లో ఒకే వ్యక్తి డ్యాన్స్ చేసిన మరిన్ని వీడియోలు ఉన్నాయి.
“Repeat workshop announcement online @studio/local” అనే టైటిల్ తో ఆయన ఫేస్ బుక్ పేజీలో కూడా వీడియోను అప్లోడ్ చేశారు.
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, కొరియోగ్రాఫర్ కిరణ్ జోపాలే బాలీవుడ్ పాట 'తౌబా తౌబా'కు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో అతను ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయాడు. చాలా మంది అభిమానులు శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ లాగే కిరణ్ జోపలే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.
వీడియోలో కిరణ్ మంచి గ్రేస్ తో డ్యాన్స్ చేయడం మనం చూడవచ్చు. ఆయన డ్యాన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ, మురళీధరన్‌తో పోలిక పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. చాలా మంది నెటిజన్లు మొదట్లో ఈ వీడియోలో ఉన్నది ప్రముఖ క్రికెటర్ మురళీ ధరన్ అని విశ్వసించారు.. అయితే ఆయన కొరియోగ్రాఫర్ కిరణ్ జోపాలే.
అందువల్ల, వైరల్ వీడియోలో ఉన్నది శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కాదు.. ముంబైకి చెందిన కిరణ్ జోపాలే అనే కొరియోగ్రాఫర్. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ హిందీ పాట ‘తౌబా తౌబా’కు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story