Mon Nov 18 2024 08:48:17 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు చక్రం పంక్చర్ అయినట్లు వైరల్ అవుతున్న ఫోటోలో ఎటువంటి నిజం లేదు
అరిగిపోయినట్లుగా ఉన్న రైలు చక్రానికి సంబంధించిన చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది: "75 ఏళ్లలో మొదటిసారిగా రైలు చక్రం పంక్చర్ అయింది. మీరు ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తున్నారు తాతయ్యా?" (Sic). అంటూ కొందరు పోస్టులు పెట్టడం గమనించవచ్చు.
అరిగిపోయినట్లుగా ఉన్న రైలు చక్రానికి సంబంధించిన చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది: "75 ఏళ్లలో మొదటిసారిగా రైలు చక్రం పంక్చర్ అయింది. మీరు ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తున్నారు తాతయ్యా?" (Sic). అంటూ కొందరు పోస్టులు పెట్టడం గమనించవచ్చు.
ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లకు సంబంధించిన ఘటనలు వార్తల్లో నిలవగా.. కొందరు తప్పుడు కథనాలను షేర్ చేస్తూ వస్తున్నారు.
వందే భారత్ రైలు సిరీస్‌లో మొదటి రైలు న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రారంభించారు. రెండవ రైలు న్యూ ఢిల్లీ- మాతా వైష్ణో దేవి, కత్రా నుండి ప్రారంభించారు. మూడవ రైలు గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుండి అహ్మదాబాద్, సూరత్, వడోదర మీదుగా ముంబైకి వెళ్తుంది. ఈ రైలులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రైలు ప్రయాణీకులకు మెరుగైన, విమాన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని, ఇందులో ఆర్మర్ టెక్నాలజీతో పాటు ఆధునిక భద్రతా చర్యలు ఉన్నాయని రైల్వే తెలిపింది. స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన ఈ రైలులో యాంటీ-కొలిజన్ సిస్టమ్- కవాచ్‌తో సహా అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయని వెల్లడించింది.
శనివారం (అక్టోబర్ 8) ఉదయం ఢిల్లీ - వారణాసి మార్గంలో వెళ్తున్న ఈ రైలు.. చక్రం జామ్ అవ్వడం వల్ల పట్టాలపై నిలిచిపోయింది. బులంద్‌షహర్ సమీపంలోని వైర్ రైల్వే స్టేషన్లో సుమారు 6 గంటల పాటు ఆగిపోయింది. ఈ రైల్లోని ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్, ఇతర రైళ్లలో గమ్యస్థానానికి పంపించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ E3 కోచ్ రైలు చక్రం జామ్ అయినట్లు గ్రౌండ్ స్టాఫ్ ఒకరు గుర్తించి, ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రైలును వెంటనే నిలిపివేసి మరమ్మతు చర్యలు ప్రారంభించారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. వైరల్ పోస్ట్‌లోని చిత్రం స్వీడన్‌లోని చామర్స్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ థీసిస్ నుండి తీసుకున్నారు.
వందే భారత్ రైలు చక్రం పంక్చర్ అయినట్లు వార్తా కథనాల కోసం మేము ఇంటర్నెట్లో సెర్చ్ చేసాము. ది హిందూ నివేదికను కనుగొన్నాము. అందులో "Varanasi-bound Vande Bharat suffers jammed wheels, flat tyre" అని ఉంది. Further, it read, "The New Delhi-Varanasi Vande Bharat Express was taken out of operation on Saturday after it suffered a snag in a traction motor that jammed its wheels and damaged their perfect roundness, situation officials described as "flat tyre". "న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చక్రాలు జామ్ అయ్యాయి.. ట్రాక్షన్ మోటారులో స్నాగ్కు గురికావడం.. వాటి ఖచ్చితమైన గుండ్రనితనాన్ని దెబ్బతీసినందున ఆ పరిస్థితిని అధికారులు "ఫ్లాట్ టైర్"గా అభివర్ణించారు. అయితే దీన్ని వేరేగా ఆలోచించి.. విరిగిపోయినట్లుగా ఉన్న రైలు చక్రానికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తున్నారు. ఈ సంఘటన అక్టోబర్ 8, 2022 న జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన పలు ఆర్టికల్స్ ను మేము గుర్తించాం.
https://www.dnaindia.com/
https://www.deccanchronicle.
https://www.ndtv.com/india-
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాము. స్వీడన్‌లోని చామర్స్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ థీసిస్‌లో అదే చిత్రాన్ని కనుగొన్నాము. ఇది 2012లో ప్రచురించబడింది. ఈ చిత్రం చక్ర నష్టం - కాన్సెప్ట్, డ్యామేజ్ డిటెక్షన్(Chakra Damage – Concept and Damage Detection)లో భాగం. వీల్ డ్యామేజ్ కు సంబంధించినదని.. దానిని గుర్తించడం ఎలా జరుగుతుందో వివరించారు. స్వీడన్లో రెండు సాధారణ వీల్ డ్యామేజ్లు వీల్ ప్లేట్, రోలర్ కాంటాక్ట్ ఫెటీగ్ క్రాక్‌లు చోటు చేసుకుంటాయి. వీటిని క్రషింగ్ వేర్ అని కూడా అంటారు. కొన్ని కారణాల వల్ల చక్రం వదులైనప్పుడు వీల్ ప్లేట్ ఏర్పడవచ్చు. పట్టాలపై లాగినప్పుడు చక్రం భాగాలు ఫ్లాట్‌గా మారతాయి.
ఫోటో కింద క్యాప్షన్ A wheel with a wheel plate (Nielsen 2007) అని ఉంది. కాబట్టి ఈ ఫోటో 2007 లో తీసిందని మనం భావించవచ్చు.
కాబట్టి.. వైరల్ అవుతున్న దావా ప్రజలను తప్పుదారి పట్టించేది. పోస్ట్ కు వందే భారత్ రైలు పంక్చర్‌కు సంబంధం లేని చిత్రం తెలిపింది. వైరల్ పోస్ట్‌లోని చిత్రం స్వీడన్‌లోని చామర్స్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కోర్సును అభ్యసిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ థీసిస్ నుండి వచ్చింది.
Claim : Image of Vande Bharat Express flat tyre
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story