Mon Dec 23 2024 13:04:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పేరును పీఎం కేర్స్ ఫండ్ గా ప్రధాని మోదీ మార్చేశారా..?
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తిరిగి పేరు పెట్టి ప్రజల్లోకి వదిలిన పథకాలు, స్థలాలు, సంస్థలు, అవార్డులకు సంబంధించిన వివరాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
క్లెయిమ్: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పేరును పీఎం కేర్స్ ఫండ్ గా మార్చేశారా
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
తాము మొదలుపెట్టిన స్కీమ్ లనే భారతీయ జనతా పార్టీ పేరు మార్చి ప్రజలకు అందిస్తూ వస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలుమార్లు భారతీయ జనతా పార్టీపై ఆరోపణలు గుప్పించింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్నప్పుడు ప్రారంభించిన పథకాలకు పేరు మార్చడం, తిరిగి ప్రజల్లోకి తమవే పథకాలంటూ ప్రచారం చేసుకొంటోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ వెబ్సైట్ లో కూడా అటువంటి పథకాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది.
తాము మొదలుపెట్టిన స్కీమ్ లనే భారతీయ జనతా పార్టీ పేరు మార్చి ప్రజలకు అందిస్తూ వస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలుమార్లు భారతీయ జనతా పార్టీపై ఆరోపణలు గుప్పించింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్నప్పుడు ప్రారంభించిన పథకాలకు పేరు మార్చడం, తిరిగి ప్రజల్లోకి తమవే పథకాలంటూ ప్రచారం చేసుకొంటోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ వెబ్సైట్ లో కూడా అటువంటి పథకాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తిరిగి పేరు పెట్టి ప్రజల్లోకి వదిలిన పథకాలు, స్థలాలు, సంస్థలు, అవార్డులకు సంబంధించిన వివరాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెహ్రూ మ్యూజియం PM మ్యూజియంగా, ఇందిరా ఆవాస్ యోజనను ప్రధాన మంత్రి ఆవాస్ యోజనగా, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చబడింది, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ను PM కేర్స్ గా మార్చారంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అందుకు సంబంధించిన పోస్టులు మీరు ఇక్కడ చూడవచ్చు.
అందుకు సంబంధించిన పోస్టులు మీరు ఇక్కడ చూడవచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ ఫోటోలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని మా బృందం తెలుసుకుంది.రాజీవ్ గాంధీ ఫౌండేషన్, పీఎం కేర్ ఫండ్ మధ్య ఎలాంటి సంబంధం లేదు. రెండూ పూర్తిగా భిన్నమైనవి. ప్రస్తుతం ఈ రెండూ అమలులో ఉన్నాయి
ఈ వైరల్ క్లెయిమ్‌లను పరిశోధిస్తున్నప్పుడు, న్యూఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును కేంద్రం మార్చడం, ఇందిరా ఆవాస్ యోజన, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల గురించి అనేక మీడియా నివేదికలను మేము కనుగొన్నాము. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పేరును PM కేర్ ఫండ్‌గా మార్చినట్లు సూచించే నివేదికలు ఏవీ కనిపించలేదు.
PM కేర్స్ ఫండ్ యొక్క అధికారిక వెబ్సైట్ లో ఎన్నో కీలక విషయాలు ఉన్నాయి. వాటిలో ఎక్కడా కూడా పేరు మార్చినట్లుగా వివరాలు లేవు. ఈ ట్రస్ట్‌కు ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ మంత్రి, హోంశాఖ మంత్రి, ఆర్థిక మంత్రి దీనికి ఎక్స్ అఫీషియో ట్రస్టీలుగా వ్యవహరిస్తారు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వెబ్సైట్ ప్రకారం "భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విజన్ ని సాకారం చేయడానికి జూన్ 21, 1991న ఏర్పాటు చేయబడింది. 1991 నుండి 2009 వరకు, ఫౌండేషన్ అనేక సమస్యలపై పని చేసింది. 2010లో ఫౌండేషన్ విద్యా రంగంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది." రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తన కార్యకలాపాలను నిలిపివేసినట్లు లేదా సంస్థ పేరు మార్చినట్లు ప్రస్తావన లేదు. సోనియాగాంధీ ఛైర్మన్‌గా ఉన్నారని, మన్మోహన్ సింగ్, పి. చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో సహా కాంగ్రెస్ పార్టీకి తెలిసిన పలువురు ప్రముఖులు బోర్డు సభ్యులుగా ఉన్నారని వెబ్సైట్ పేర్కొంది.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ధృవీకరించబడిన Facebook పేజీని సందర్శించాము. ఈ పేజీ ఫౌండేషన్ కార్యకలాపాలపై రెగ్యులర్ అప్డేట్లను ఇస్తూనే ఉంది.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
క్లెయిమ్: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పేరును పీఎం కేర్స్ ఫండ్ గా ప్రధాని మోదీ మార్చేశారు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : In a series of moves that improved existing UPA-era schemes, the Rajiv Gandhi Foundation was transformed into the PM Cares fund by the Narendra Modi-led government.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story