ఫ్యాక్ట్ చెక్: మార్కెట్లో విక్రయించే అన్ని ప్రొటీన్ పౌడర్లను పురుగులను ఉపయోగించి తయారు చేయడం లేదు
మనిషి శరీరంలోని ఎముకలు, కండరాలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. హార్మోన్లు, ఎంజైమ్‌లు వంటి వాటిని ఉత్పత్తి చేయడానికి శరీరానికి
Claim :
మార్కెట్లో అమ్మే ప్రొటీన్ పౌడర్లను పురుగులను ఉపయోగించి తయారు చేస్తున్నారుFact :
మార్కెట్లో లభించే ప్రోటీన్ పౌడర్లలో ఎక్కువ భాగం పాల పదార్థాలతో తయారవుతాయి, పురుగులతో తయారు చేయరు
మనిషి శరీరంలోని ఎముకలు, కండరాలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. హార్మోన్లు, ఎంజైమ్‌లు వంటి వాటిని ఉత్పత్తి చేయడానికి శరీరానికి ప్రోటీన్లు అవసరం. అనేక మంది అథ్లెట్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు కండలను పెంచడానికి, ఫిట్‌గా ఉండటానికి ప్రోటీన్ సప్లిమెంట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జిమ్ లలో జాయిన్ అయితే చాలు ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలంటూ సలహాలు ఇస్తూ ఉంటారు. సాధారణంగా మనం తీసుకునే ఫుడ్ నుండి కావాల్సిన ప్రోటీన్ అందకపోతే ప్రోటీన్ పౌడర్లను వాడాలని చెబుతూ ఉంటారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు షేర్ చేసిన వీడియోలో మీల్‌వార్మ్‌లను ఉపయోగించి ప్రోటీన్ పౌడర్ తయారీ చేసినప్పటికీ, ఈ తరహా ప్రోటీన్ పౌడర్లు స్టోర్లలో ఎక్కువగా అందుబాటులో ఉండవు. స్టోర్లలో లభించే సాధారణ ప్రోటీన్ సప్లిమెంట్ వే ప్రోటీన్ అని భావించవచ్చు. దీన్ని ఆవు పాల నుండి సేకరిస్తారు. ఈ వైరల్ వీడియో మార్కెట్లో కనిపించే సాధారణ ప్రోటీన్ సప్లిమెంట్లను చూపుతుందనే వాదన తప్పుదారి పట్టిస్తోంది. మీల్‌వార్మ్స్ అనే కీటకాల నుండి ప్రోటీన్‌ను సేకరించేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేక ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.