ఫ్యాక్ట్ చెక్: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ నేమ్ ప్లేట్ రాహుల్ రాజీవ్ ఫిరోజ్ అని లేదు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిర్వహించిన “Learning to listen in the 21st Century” అనే సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిర్వహించిన “Learning to listen in the 21st Century” అనే సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
“వీడీ నిజ స్వరూపం...ఫిరోజ్ ఖాన్ పుత్ర రత్నం. కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు క్లారిటీగానే ఉన్నారు, మనమే పంటిత్ అని గాంధీ అని జోకుతున్నాం” అంటూ రాహుల్ గాంధీని విమర్శిస్తూ పోస్టు పెట్టారు.
https://www.facebook.com/
"ఇది వీడి నిజ స్వరూపం...ఫిరోజ్ ఖాన్ పుత్ర రత్నం. క్రేంబ్రిడ్జి యూనివర్సిటి వారు స్వష్టంగా ఉన్నారు. మన దేశపు అజ్ఞానపు మూర్ఖులు గాంధీ అని, హిందువు - పండిట్ అని భ్రమలో ఉన్నారు." అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.
https://www.facebook.com/
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారని కనుగొన్నాం.మేము వైరల్ ఇమేజ్ కు సంబంధించి Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వైరల్ పోస్టుల్లో ఉన్న ఫోటోని ప్రచురించిన కొన్ని వార్తా కథనాలను మేము కనుగొన్నాము. మార్చి 2023లో “Learning to listen in the 21st Century” అనే అంశంపై రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం గురించి ప్రస్తావిస్తూ ABP Live.comలో ప్రచురించిన నివేదికను చూశాం. అచ్చం వైరల్ వైరల్ ఇమేజ్ను కూడా చూశాం. కానీ నేమ్‌ప్లేట్‌పై ఏమీ రాయలేదని గుర్తించాం.
ట్విట్టర్ యూజర్ శామ్ పిటోడా కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఎక్కడా కూడా రాహుల్ గాంధీ పేరుకు.. వైరల్ ఇమేజీకి పోలిక లేదు. “Some pictures from @RahulGandhi’s great lecture at @CambridgeMBA during his visit to a fellow of @CambridgeJBS Cambridge University on “Learning to Listen in the 21st Century.” #BharatJodoYatra #RahulGandhiinCambridge” అంటూ పోస్టు పెట్టారు.
కాబట్టి, వైరల్ అవుతున్న చిత్రం మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. నేమ్‌ప్లేట్‌పై కనిపించిన పేరును ఎక్కడా ఉపయోగించలేదు. వార్తా నివేదికలలో అసలు చిత్రాన్ని చూశాం.. అందులో ఈ వైరల్ ఫోటోలు లేవు. కేంబ్రిడ్జ్ రాహుల్ గాంధీ పేరును ‘రాహుల్ రాజీవ్ ఫిరోజ్' అని చెప్పలేదు. వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.