Fri Nov 22 2024 14:40:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాజ్య సభ ఎంపీ సంజయ్ రౌత్ చెబుతున్నట్లుగా ఆ ర్యాలీ వీడియో ఇప్పటిది కాదు
డిసెంబర్ 17న ముంబైలో మహా వికాస్ అఘాడి "హల్లా బోల్" ర్యాలీని నిర్వహించింది. ఉద్ధవ్ సేన, కాంగ్రెస్, ఎన్‌సిపి వివిధ అంశాలపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని.. వందలాది మందితో ర్యాలీని నిర్వహించారు.
డిసెంబర్ 17న ముంబైలో మహా వికాస్ అఘాడి "హల్లా బోల్" ర్యాలీని నిర్వహించింది. ఉద్ధవ్ సేన, కాంగ్రెస్, ఎన్‌సిపి వివిధ అంశాలపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని.. వందలాది మందితో ర్యాలీని నిర్వహించారు.
వెంటనే, భారతీయ జనతా పార్టీ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ర్యాలీకి పెద్దగా జనం రాలేదని విమర్శిస్తూ పోస్టు పెట్టారు.
ఈ వ్యాఖ్యకు ప్రతిస్పందనగా, శివసేన (యుబిటి) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ర్యాలీకి హాజరైన వారి సంఖ్యను చూపించడానికి ట్విట్టర్లో ఒక వీడియోను షేర్ చేశారు. వీడియోలో పలువురు వ్యక్తులు ఫ్లైఓవర్‌పై నడుస్తూ వచ్చారు, "దీన్నే దేవేంద్ర ఫడ్నవీస్ నానో మోర్చా అని పిలుస్తున్నారు! మహారాష్ట్రలో ప్రజలు తమ గళాన్ని వినిపించారు. దేవేంద్ర జీ.. ఈ ప్రవర్తన మంచిది కాదు. జై మహారాష్ట్ర!" అంటూ పోస్టు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
సంజయ్ రౌత్ షేర్ చేసిన వీడియో "హల్లా బోల్" ర్యాలీకి సంబంధించినది కాదు.రివర్స్ సెర్చ్ చేయగా.. అదే వీడియో ఆగస్టు 2017లో Facebookలో షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో "మరాఠా క్రాంతి మోర్చా మహారాష్ట్ర" అనే Facebook గ్రూప్‌లో షేర్ చేశారు. "J J ఫ్లైఓవర్ ముంబై, మరాఠా సాగర్" అని క్యాప్షన్ ఉంది.
కీవర్డ్ సెర్చ్ చేయగా.. ముంబైలో ఆగస్టు 2017న మరాఠా క్రాంతి మోర్చాపై అనేక వార్తా నివేదికలను కనుగొన్నాము. టైమ్స్ ఆఫ్ ఇండియా ధృవీకరించబడిన ట్విట్టర్ ఖాతా, 2017లో అదే వీడియోను షేర్ చేసింది. ముంబయిలోని JJ ఫ్లైఓవర్‌పై జరిగిన "మరాఠా క్రాంతి మోర్చా" నుండి వీడియో అని క్యాప్షన్ పేర్కొంది. రెండు వీడియోలను పోల్చి చూస్తే, సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేసిన వీడియో పాతదేనని.. ఇటీవల నిర్వహించిన "హల్లా బోల్" ర్యాలీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమైంది.
మరాఠా కమ్యూనిటీకి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబైలో మరాఠా క్రాంతి మోర్చా ఈ నిరసన చేపట్టిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో పేర్కొంది. బైకుల్లాలోని జీజామాత ఉద్యానవనం వద్ద ప్రారంభమైన నిరసన ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముగిసింది. నిరసన ర్యాలీలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది మరాఠా సభ్యులు పాల్గొన్నారని ఫస్ట్ పోస్ట్ నివేదికలో తెలిపింది.
ఇటీవల నిర్వహించిన ర్యాలీకి ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. సంజయ్ రౌత్ పాత వీడియోను పోస్టు చేశారు.
ఇటీవల నిర్వహించిన ర్యాలీకి ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. సంజయ్ రౌత్ పాత వీడియోను పోస్టు చేశారు.
Claim : Video shows turnout at Halla Bol rally
Claimed By : Sanjay Raut
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Sanjay Raut
Fact Check : False
Next Story