Fri Nov 08 2024 03:11:26 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారత సైన్యానికి రతన్ టాటా బుల్లెట్-ప్రూఫ్ బస్సులను బహుమతిగా ఇవ్వలేదు
రతన్ టాటా ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. కొన్ని రోజుల క్రితమే ఆయనకు 86 ఏళ్లు నిండాయి. ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల కారణంగా ఆయన వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన దాతృత్వ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందారాయన.. ఇక భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో రెండు అవార్డులను కూడా అందుకున్నారు.
Claim :
రతన్ టాటా భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్, బాంబు ప్రూఫ్ బస్సులను అందించారుFact :
CRPFకి మిధానీ అందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సును ఫోటోలో చూపిస్తున్నారు
రతన్ టాటా ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. కొన్ని రోజుల క్రితమే ఆయనకు 86 ఏళ్లు నిండాయి. ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల కారణంగా ఆయన వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన దాతృత్వ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందారాయన.. ఇక భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో రెండు అవార్డులను కూడా అందుకున్నారు.
ఓ పెద్ద బస్సుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ బస్సును రతన్ టాటా ఇచ్చారని చెబుతున్నారు. “मशहूर उद्योगपति रतन टाटा ने भारतीय सेना को बुलेट प्रूफ और बम प्रूफ बसें उपलब्ध कराई है!” అంటూ హిందీలో పలువురు పోస్టులు పెట్టారు.
దానిని అనువదించగా "ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్, బాంబు ప్రూఫ్ బస్సులను అందించారు!" అని అర్థం.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
ఈ బస్సును రతన్ టాటా భారత సైన్యానికి అందించలేదు. దీనిని మిధానీ సంస్థ CRPF కోసం ప్రత్యేకంగా ఈ బస్సును తయారు చేసింది. మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించి చిత్రం కోసం సెర్చ్ చేయగా.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2017లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CRPF) యొక్క X (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా '‘Armored Bus and Bhabha Kavach, lightweight BP jacket manufactured under #makeinindia by Midhani handed over to DG CRPF today.' అనే శీర్షికతో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. మిధానీ సంస్థ తయారు చేసిన బస్సు DG CRPF కి అందజేశారని మేము గుర్తించాము.
మరింత సెర్చ్ చేయగా.. మిధాని వెబ్సైట్లో షేర్ చేసిన ఇలాంటి చిత్రాన్ని మేము కనుగొన్నాము.
ఏరోడైనమిక్స్ అనే X హ్యాండిల్ షేర్ చేసిన పోస్ట్లో హైదరాబాద్ ఆధారిత MIDHANI సంస్థ లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ (LBPVs), మీడియం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ (MBPVs)ని తయారు చేసిందని తెలియజేసింది. DefExpo2020 లో కూడా ఈ వాహనాలను చూపించారు. ఈ వాహనాలు సైన్యం మీద జరిగే బాంబు దాడులను సమర్థవంతంగా అడ్డుకోగలదు.
LBPV Bus protects against 7.62 x 39m MSC and the complete bus.’
ఆల్ ఇండియా రేడియో X (ట్విట్టర్) అకౌంట్ లో కూడా CRPFకి బస్సును బహూకరించిన చిత్రాలను కూడా చూడొచ్చు. “@nsitharaman hands over armored bus, ARGO avenger terrain vehicle to #CentralArmedPolice forces; HM @rajnathsingh also present.” అబుతూ పోస్టు చేశారు.
రక్షణ, హోం మంత్రుల సమక్షంలో బుల్లెట్ ప్రూఫ్ బస్సులను CRPF కి అంకితం చేసినట్లు NDTV కూడా నివేదించింది.
ఈ చిత్రం సెప్టెంబర్ 2017 నాటిది. CRPFకి మిధానీ సంస్థ అందించిన బుల్లెట్ ప్రూఫ్, బాంబు ప్రూఫ్ బస్సును చూపుతుంది. రతన్ టాటా భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్, బాంబు ప్రూఫ్ బస్సును విరాళంగా ఇచ్చారనే వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.
Claim : Ratan Tata provided bulletproof and bomb-proof buses to the Indian Army
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story