జీపు వరద నీటిలో కొట్టుకుపోతున్న వైరల్ వీడియో పాకిస్తాన్ కు చెందినది, జగిత్యాలలో జరిగింది కాదు
తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి, వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరదల కారణంగా రాష్ట్రంలోని పలు నీటి వనరులు నిండి రోడ్లపైకి వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి, వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరదల కారణంగా రాష్ట్రంలోని పలు నీటి వనరులు నిండి రోడ్లపైకి వస్తున్నాయి.
ఈ భారీ నీటి ప్రవాహం కారణంగా, గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోవడం, ప్రజలు తప్పిపోయిన సంఘటనలు చూడొచ్చు.
జగిత్యాలలో, గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రు (ద్వీపం)లో చిక్కుకుపోయిన తొమ్మిది మంది రైతు కూలీలను రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని కవర్ చేయడానికి వెళ్లిన స్థానిక టెలివిజన్ ఛానెల్ రిపోర్టర్ వరద నీటిలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది.
జగిత్యాలలో రిపోర్టర్ జమీర్ కారు వరదలో కొట్టుకుపోయినట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ను కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు షేర్ చేశాయి.
యోయో యూట్యూబ్ ఛానెల్ కూడా అదే వీడియోను 'షాకింగ్ వీడియో: జగిత్యాల్ వద్ద వరద నీటిలో కొట్టుకుపోయిన కారు | తెలంగాణలో భారీ వర్షాలు | YOYO TV Channel' అనే టైటిల్ తో షేర్ చేసింది.
వాట్సాప్‌లో కూడా ఈ వాదన వైరల్‌గా మారింది.
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియో పాతది, తెలంగాణాలోని జగిత్యాలకు చెందినది అనే క్లెయిం అబద్దం.
ముందుగా, వీడియోను జాగ్రత్తగా గమనిస్తే, ఆ వీడియోలో తెలుగు కాకుండా పాకిస్తానీ ఉర్దూ మాట్లాడటం మనకు వినబడుతుంది.
రెండవది, వీడియో నుండి తీసిన స్క్రీన్షాట్లను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, వాహనంపై ఉన్న సుజుకి గుర్తు కొట్టుకుపోవడాన్ని మనం చూడవచ్చు. జీప్ నంబర్ చూస్తే అది భరతీయ పద్దతిలో లేదని తెలుస్తోంది.
జీప్‌పై ఉన్న అదనపు టైర్‌పైన పొటోహర్ అని ఉంది, తనిఖీ చేసినప్పుడు అది పాకిస్తాన్లో విడుదల చేసిన సుజుకి జీప్ మోడల్ అని కనుగొన్నాము.
పాక్ సుజుకి సంస్థ 1982లో పాకిస్తాన్ ప్రభుత్వం మరియు సుజుకి మోటార్స్ జపాన్ మధ్య జాయింట్ వెంచర్‌గా ప్రారంభించబడింది. సుజుకి పొటోహార్ 1985లో పాకిస్థాన్‌లో ప్రారంభించబడింది.
https://www.pakwheels.com/new-cars/suzuki/potohar/
కాబట్టి వైరల్ వీడియోలో కనిపించే వాహనం పాకిస్తాన్ మోడల్ అంతే కానీ భారతదేశంలో కనిపించదు.
ఈ సూచనలను తీసుకొని, పాకిస్తాన్ వరదలలో కారు ప్రమాదాల కోసం వెతుకుతున్నప్పుడు, 'ఎక్స్ప్లోర్ వరల్డ్ విత్ హుజైఫా' అనే పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా సెప్టెంబర్ 2020లో 'పాకిస్తాన్లో వరదలో కారు పడిపోయింది' అనే టైటిల్ తో ప్రచురించబడిన వీడియోను కనుగొన్నాము.
ఒక మూలాన్ని మాత్రమే కనుగొనగలిగినప్పటికీ, వీడియోలో లభించిన ఆధారాలను బట్టి వైరల్ వీడియో పాకిస్తాన్‌కి చెందినదనీ, తెలంగాణాలోని జగిత్యాలలో జరిగిన సంఘటన కాదని నిర్ధారించబడింది.
అందుకే, జీపు కొట్టుకుపోతున్న వైరల్ వీడియో తెలంగాణలోని జగిత్యాలలో జరిగిందనే క్లెయిం అబద్ధం.