Sun Nov 17 2024 17:34:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కోలవెరి సాంగ్ ను టర్కిష్ అడ్వర్టైజ్మెంట్ నుండి కాపీ కొట్టారా..?
కోలవెరి డి' సాంగ్ గుర్తుంది కదా..! ప్రపంచాన్నే ఉర్రూతలూగించిన సాంగ్.. తమిళ నటుడు ధనుష్ పాడిన ఈ పాటను ఎంతో మంచి మెచ్చుకున్నారు. అయితే ఈ పాట ఒరిజినల్ కంపోజింగ్ చేసింది అనిరుధ్ కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు
క్లెయిమ్: కోలవెరి సాంగ్ ను టర్కిష్ అడ్వర్టైజ్మెంట్ నుండి కాపీ కొట్టారా
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
'కోలవెరి డి' సాంగ్ గుర్తుంది కదా..! ప్రపంచాన్నే ఉర్రూతలూగించిన సాంగ్.. తమిళ నటుడు ధనుష్ పాడిన ఈ పాటను ఎంతో మంచి మెచ్చుకున్నారు. అయితే ఈ పాట ఒరిజినల్ కంపోజింగ్ చేసింది అనిరుధ్ కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.
"కోకా-కోలా కోసం పాత టర్కిష్ ప్రకటన" నుండి నేరుగా కోలవెరి డి సాంగ్ ను కొట్టేశారు అనే వాదనతో పోస్టులు పెడుతున్నారు. టర్కిష్ భాషలో కోలవెరి డి ట్యూన్తో కోకా-కోలా వాణిజ్య ప్రకటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Facebook, Twitter లలో ఈ టర్కిష్ వాణిజ్య ప్రకటనను పోస్ట్ చేసి, "కోలవెరి డి పాటకు మూలం. కోకాకోలా కోసం పాత టర్కిష్ ప్రకటన నుండి 'కొలవెరి డి' పాట తీసుకోబడింది". అని చెబుతూ వస్తున్నారు. కొంతమంది వినియోగదారులు వైరల్ దావా ప్రామాణికత గురించి ప్రశ్నలను లేవనెత్తగా, కొందరు 'కోలవెరి డి' పాట టర్కిష్ వాణిజ్య ప్రకటనకు కాపీ అని నమ్ముతున్నారు. "The origin of Kolaveri. Old Turkish advertisement for Coca-Cola from which 'Kolaveri Di' song was picked up". అంటూ పోస్టులు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. 2011లో వైరల్ అయిన ఒరిజినల్ "కోలవెరి డి" పాట వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత టర్కిష్ వాణిజ్య ప్రకటన వచ్చింది. "Turkish Coca-Cola Kolaveri Di" అంటూ కీవర్డ్స్ సెర్చ్ చేయగా.. 2015 మేలో వచ్చిన న్యూస్ రిపోర్టులను మనం చూడవచ్చు.The Indian Express, BuzzFeed వంటి మీడియా సంస్థలు, Coca-Cola కొత్త యాడ్ ను టర్కీలో విడుదల చేసిందని.. "వై దిస్ కొలవెరి డి" పాటను టర్కీలో స్థానిక భాషలో ఉపయోగించారని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్, ప్రకటనలపై ఒక వెబ్సైట్ "అఫాక్స్".. "సోనీ మ్యూజిక్ 2011లో తీసుకుని వచ్చిన 'కోలవెరి డి' సాంగ్ ట్యూన్ ని కోకాకోలా టర్కీకి లైసెన్స్ ఇచ్చింది."
ప్రకటనలపై మరో వెబ్సైట్ "క్యాంపెయిన్ ఇండియా" 2015లో "కోకాకోలా టర్కీ యొక్క కొత్త TVC 2011 ఇండియన్ ట్రాక్, 'వై దిస్ కొలవెరి డి'కి రీమేక్ చేశారు. టర్కిష్ వెర్షన్లో గాయకులు స్లా జెన్కో, ఓజ్కాన్ డెనిజ్ పాటను రీ క్రియేట్ చేశారు." అని ఉంది. టర్కీలో కోకాకోలా వాణిజ్య ప్రకటనగా మీడియా సంస్థలు చెప్పిన వీడియో.. ఇప్పుడు కోకాకోలా యూట్యూబ్ పేజీలో పబ్లిక్గా అందుబాటులో లేదు.
కానీ టర్కిష్ కోకా-కోలా వాణిజ్య ప్రకటనను.. అనేక మంది వినియోగదారులు YouTube, Dailymotionలో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.
తమిళ నటుడు ధనుష్ 2011లో 'కోలవెరి డి' పాటతో సంచలనం సృష్టించాడు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటను సోనీ మ్యూజిక్ ఇండియా 2011లో తమ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసింది.
క్లెయిమ్: కోలవెరి సాంగ్ ను టర్కిష్ కోకా-కోలా అడ్వర్టైజ్మెంట్ నుండి కాపీ కొట్టారా
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : 'Kolaveri Di' song was a straight lift-up from this old Turkish advertisement for Coca-Cola.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story