Mon Dec 23 2024 11:58:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆలయ భూములు అమ్మి ముస్లింల కోసం నిధులను ఖర్చు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెప్పలేదు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు,
Claim :
ముస్లిం డిక్లరేషన్‌లోని లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆలయ భూములను అమ్మి నిధులు సేకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.Fact :
రేవంత్ రెడ్డి అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు.. వైరల్ ఇమేజ్ ను ఎడిట్ చేశారు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై ఆయన పోటీ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం డిక్లరేషన్‌కు మద్దతుగా ఆలయ భూములను వేలం వేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటన జారీ చేశారంటూ వే2 న్యూస్‌లో ప్రచురితమైన ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆలయాల భూములను కాపాడుకోవాలంటూ ప్రచారం సాగుతోంది.
“వక్ఫ్ భూములు అమ్మరు టా, దేవాలయ భూములమ్మి ముస్లిం లకీ పంచి పెడతారు టా ఈ కాంగ్రెసోళ్లు, ఎంత సిగ్గుమాలిన వెధవలు, వీళ్ళని నమ్మి ఇంకా ఓట్లు వేసే హిందువులను అనాలి”. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
“ముస్లిం డిక్లరేషన్ కు ఆలయాల భూములు వేలం : రేవంత్ రెడ్డి. ముస్లిం డిక్లరేషన్‌కు నిధుల సమీకరణ కోసం అవసరమైతే ఆలయాల భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో ముస్లింలను ఆదుకుంటామని టి-పీసీసీ అధ్యక్షులు అనుమల రేవంత్ రెడ్డి తెలిపారు. ముస్లిం డిక్లరేషన్ కు నిధులు ఎలా సమీకరిస్తారని ఒక న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి పై విధంగా బదులిచ్చారు.” అంటూ మరో పోస్టు కూడా వైరల్ అవుతూ ఉంది.
“వక్ఫ్ భూములు అమ్మరు టా, దేవాలయ భూములమ్మి ముస్లిం లకీ పంచి పెడతారు టా ఈ కాంగ్రెసోళ్లు, ఎంత సిగ్గుమాలిన వెధవలు, వీళ్ళని నమ్మి ఇంకా ఓట్లు వేసే హిందువులను అనాలి”. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
“ముస్లిం డిక్లరేషన్ కు ఆలయాల భూములు వేలం : రేవంత్ రెడ్డి. ముస్లిం డిక్లరేషన్‌కు నిధుల సమీకరణ కోసం అవసరమైతే ఆలయాల భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో ముస్లింలను ఆదుకుంటామని టి-పీసీసీ అధ్యక్షులు అనుమల రేవంత్ రెడ్డి తెలిపారు. ముస్లిం డిక్లరేషన్ కు నిధులు ఎలా సమీకరిస్తారని ఒక న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి పై విధంగా బదులిచ్చారు.” అంటూ మరో పోస్టు కూడా వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.అలాంటి ప్రకటన ఏదీ రేవంత్ రెడ్డి చేయలేదు. అంతేకాకుండా ఏ మీడియా ఛానెల్ ప్రచురించలేదు.
“ఆలయాల భూములు వేలం రేవంత్ రెడ్డి” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా అందుకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలను మేము గుర్తించలేకపోయాం. వైరల్ ఫోటోను జాగ్రత్తగా గమనించినప్పుడు, దానిపై వే2న్యూస్ స్టాంప్ చూడవచ్చు. way2news లో సెర్చ్ చేయగా.. వైరల్ ఫోటోలో ఉన్నది తమ స్టోరీ కాదని.. తాము అలాంటి కథనాన్ని ఏదీ ప్రచురించలేదని పేర్కొంటూ వే2న్యూస్ ప్రచురించిన ట్వీట్‌ని మేము కనుగొన్నాము.
“This is not a #Way2News story. Some miscreants are spreading misinformation using our logo and the 'attached post' has gone viral. We confirm that this has not been published by us.” అంటూ ట్వీట్ చేశారు.
రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలను కూడా మేము ఇటీవల గమనించాం. NTV లో కూడా రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూను చూడొచ్చు. ‘Revanth Reddy Exclusive Interview Live I Question Hour I Telangana Elections 2023 I NTV' అంటూ వీడియోను పోస్టు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూను నవంబర్ 10, 2023న పోస్టు చేశారు. ఆలయ భూముల అమ్మకానికి సంబంధించిన, ముస్లిం వక్ఫ్ బోర్డుకు సంబంధించి మేము ఎలాంటి ప్రశ్నలు లేదా సమాధానాలు కనుగొనలేదు.
మరో ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్‌కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఇక్కడ చూడవచ్చు.
ముస్లింల డిక్లరేషన్‌కు మద్దతుగా ఆలయ భూములను వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన అవాస్తవమని తేలింది. ఆయన అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు.
Claim : Telangana Congress president Revanth Reddy issued a statement that funds to realise the goals in Muslim Declaration would be raised by selling temple lands
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story