Sun Dec 22 2024 20:04:40 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కాంగ్రెస్ హామీలను ఎవరు నమ్మడం లేదని రేవంత్ రెడ్డి పబ్లిక్ గా ఒప్పుకోలేదు
ఎన్నికలకు రెండు మూడు రోజుల సమయం ఉండడంతో తెలంగాణలో వివిధ పార్టీల ప్రధాన అభ్యర్థులంతా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్), భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య ముక్కోణపు పోరు సాగుతోంది. మరోవైపు భారతదేశంలో వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.
Claim :
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాగ్దానాలను ఓటర్లు నమ్మడం లేదని, అందుకే ఓటుకు రూ.10వేలు, రెండు మద్యం సీసాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రకటించారు.Fact :
ఈ వీడియోను ఎడిట్ చేశారు. ఓటుకు 2 మద్యం బాటిళ్లతో పాటు రూ.10వేలు ఇవ్వాలని కేసీఆర్ తన బృందానికి అత్యవసర సమావేశంలో చెప్పారని రేవంత్ రెడ్డి చెప్పడం గమనించవచ్చు.
ఎన్నికలకు రెండు మూడు రోజుల సమయం ఉండడంతో తెలంగాణలో వివిధ పార్టీల ప్రధాన అభ్యర్థులంతా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్), భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య ముక్కోణపు పోరు సాగుతోంది. మరోవైపు భారతదేశంలో వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను ప్రజలు నమ్మకపోవడంతో ఓటుకు రూ.10 వేల మద్యం బాటిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
“కాంగ్రెస్ హామీలను ఎవరు నమ్మడం లేదని పబ్లిక్ గా ఒప్పుకున్న రేవంత్ రెడ్డి” అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు. మా హామీలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఓటుకు రూ.10వేలు, 2 మద్యం సీసాలు పంచాలని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం ఆ వీడియోలో చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోను ఎడిట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచబోతోందని రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు.
మేము వీడియో నుండి సేకరించిన చిత్రాలను సెర్చ్ చేయగా.. అసలు ప్రసంగం రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తిలో ఇచ్చినట్లు మేము కనుగొన్నాము. అనేక మీడియా ఛానెల్లు ఈ ఈవెంట్ను నవంబర్ 24, 2023న ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
నవంబర్ 24, 2023న ABN తెలుగు ప్రసారం చేసిన వీడియోను గమనించాం. మేము ప్రత్యక్ష ప్రసారంలో వైరల్ భాగాన్ని కనుగొన్నాము. రేవంత్రెడ్డి మాట్లాడుతూ, “నిన్న సాయంత్రం కేసీఆర్ ప్రగతి భవన్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు తమను నమ్మడం లేదని అక్కడున్న వారందరితో అన్నారు. ఎన్నికల్లో మా హామీలను ప్రజలు నమ్మలేదు. అందుకే ప్రతి ఓటుకు రూ.10వేలు ఇచ్చి ఓట్లు కొనాలని, రెండు ఫుల్ బాటిళ్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు." అని ఆయన ప్రసంగించారు.
ABN తెలుగు ప్రచురించిన లైవ్ స్ట్రీమ్ వీడియోలో 59.41 నిమిషాల వీడియోలోని ఈ వైరల్ భాగాన్ని చూపిస్తుంది.
ఈ వీడియో MIC TV YouTube ఛానెల్ ద్వారా కూడా ప్రసారం చేశారు. అదే ప్రకటనను 2 గంటల 34.50 నిమిషాలకు చూడవచ్చు.
ఇది Yoyo TV YouTube ఛానెల్ లో కూడా ప్రచురించారు.
అందుకే, వైరల్ వీడియోను ఎడిట్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేశారు. కాబట్టి.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : During a public meeting, Revanth Reddy publicly declares that voters are not believing in promises made by the Congress party and hence, the party decided to distribute Rs 10,000 and two liquor bottles per vote.
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story