Mon Dec 23 2024 04:25:36 GMT+0000 (Coordinated Universal Time)
మాచర్ల నుండి ఎర్రగొండ పాలెం రోడ్డులో పులి కనిపించిందంటూ ప్రచారం
ఈ వైరల్ వీడియో మధ్యప్రదేశ్ లోని పెంచ్ టైగర్ రిజర్వ్ కు సంబంధించినది.. 2022లో చోటు చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నుండి యర్రగొండపాలెం రోడ్డు మధ్య వీధుల్లో పులి కనిపించిందని నెటిజన్లు చెబుతున్నారు. రాత్రి సమయంలో పులి రోడ్డు దాటుతున్న వీడియో వాట్సాప్లో షేర్ చేస్తున్నారు.
Claim :
ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల-యర్రగొండపాలెం రోడ్డులో పులి సంచరిస్తోందిFact :
ఈ వైరల్ వీడియో మధ్యప్రదేశ్ లోని పెంచ్ టైగర్ రిజర్వ్ కు సంబంధించినది.. 2022లో చోటు చేసుకున్న ఘటన
ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నుండి యర్రగొండపాలెం రోడ్డు మధ్య వీధుల్లో పులి కనిపించిందని నెటిజన్లు చెబుతున్నారు. రాత్రి సమయంలో పులి రోడ్డు దాటుతున్న వీడియో వాట్సాప్లో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.పులి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు పిలుపును ఇస్తున్నారు. వాట్సాప్ లో షేర్ చేయడమే కాకుండా స్టేటస్ లుగా కూడా పెడుతున్నారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మొదటగా.. ఈ వైరల్ వీడియో ఒక సంవత్సరం నుండి ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంది. అదే వీడియోను గత సంవత్సరం నుండి అనేక ప్రాంతాలతో లింక్ చేస్తూ.. ఆన్లైన్లో వైరల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది వినియోగదారులు ఈ ప్రదేశాన్ని తెలంగాణలోని వాంకిడి మండలం అని కూడా చెప్పారు. మరికొందరు కర్ణాటకలోని దండేలి-ఖానాపూర్ రోడ్డు అని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేశారు.దీంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి పుకార్లను కొట్టిపారేశారు. వాంకిడి అనే ప్రచారంలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. వాంకిడి మండలంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంద, పెట్రోలింగ్ వింగ్ ఈ వీడియో వాంకిడి ప్రాంతానికి చెందినది కాదని స్పష్టం చేశారు. ఇక అధికారులు 'తెలంగాణ టుడే'తో మాట్లాడుతూ, “గతంలో దేశంలో ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో వైరల్ అయిన వీడియోలను కొంతమంది తీసుకుని, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి క్లిప్లను మళ్లీ ఇతర ప్రాంతాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు.”
పులికి సంబంధించిన వీడియో కర్ణాటక అని తప్పుడు క్లెయిమ్ చేయడంపై సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి వి.ఏడుకొండలు స్పందించారు. వైరల్ అవుతున్న వాదన అవాస్తవమని, తప్పుడు సమాచారం అందించిన వారిపై ఐటి చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.వైరల్ వీడియో భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రం, పెంచ్ టైగర్ రిజర్వ్ కు సంబంధించినదని స్పష్టంగా తెలిపింది. పెంచి టైగర్ రిజర్వ్ అధికారిక Facebook పేజీలో ఈ వీడియోను ఆగష్టు 2022లో అప్లోడ్ చేశారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఓ పులి రోడ్డు దాటుతున్న దృశ్యం వీడియోలో ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో పాతది. అంతేకాకుండా పోస్టుల్లో చెబుతున్న లొకేషన్ తో కూడా సంబంధం లేదు. ఈ ఘటన ఇటీవల ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నది కాదు. 2022లో మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్నది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Tiger roaming on the Macherla-Yerragondapalem Road in Andhra Pradesh
Claimed By : Whatsapp users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : WhatsApp
Fact Check : Misleading
Next Story