Tue Nov 05 2024 12:47:59 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నోట్ల మీద స్టార్ సింబల్ ఉంటే ఫేక్ నోట్లు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
నెటిజన్లు “these 500 notes with * symbols have started circulating in the market…This is a fake note. There has been an increase in the number of hawkers carrying fake notes in the market.” పోస్టులు పెడుతూ ఉన్నారు.
Claim :
నక్షత్రం గుర్తు ఉన్న రూ.500 కరెన్సీ నోట్లు నకిలీవిFact :
నక్షత్రం గుర్తు ఉన్న రూ.500 కరెన్సీ నోట్లు RBI జారీ చేసిన చట్టబద్ధమైన నోట్లు
సీరియల్ నంబర్లో నక్షత్రం గుర్తు ఉన్న రూ.500 కరెన్సీ నోట్లు నకిలీవి అని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.
నెటిజన్లు “these 500 notes with * symbols have started circulating in the market…This is a fake note. There has been an increase in the number of hawkers carrying fake notes in the market.” పోస్టులు పెడుతూ ఉన్నారు. * గుర్తులతో కూడిన ఈ 500 నోట్లు మార్కెట్లో చెలామణి కావడం ప్రారంభించాయి. ఇది నకిలీ నోటు. మార్కెట్లో నకిలీ నోట్లను మార్చే వ్యాపారుల సంఖ్య పెరిగిందని ప్రచారం చేస్తున్నారు. పలు భాషల్లో ఇదే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఆర్కైవ్ చేసిన పోస్టులను మీరు చూడవచ్చు
https://www.facebook.com/groups/339540540996171/posts/822387289378158/
ఆర్కైవ్ చేసిన పోస్టులను మీరు చూడవచ్చు
https://www.facebook.com/
ఫ్యాక్ట్ చెకింగ్:
స్టార్ (*) చిహ్నాలతో కూడిన కరెన్సీ నోట్లు ఇతర చట్టబద్దమైన నోటుతో సమానమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. * చిహ్నంతో ముద్రించిన నోట్లు లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్ల సెట్కు బదులుగా ముద్రించామని ఆర్బీఐ తెలిపింది. కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తు ఉన్న నోట్లు కూడా చట్టబద్ధమైనవేనని పేర్కొంది. సాధారణంగా కరెన్సీ నోట్లపై సీరియల్ నెంబర్ ను ముద్రిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల కొన్ని నోట్లపై ఈ సింబల్ ను ముద్రించినట్లు తెలిపింది. ప్రీఫిక్స్, సీరియల్ నెంబర్ మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుందని తెలిపింది. స్టార్ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు నకిలీవేమో అనే చర్చ ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని.. స్టార్ సింబల్ గుర్తు అంటే దానిని రీప్లేస్ చేసిన, పునర్ ముద్రించిన నోట్లు అని ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. వాటిని సులువుగా గుర్తించడానికి ఈ స్టార్ సింబల్ ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. 2016లో ఆర్బీఐ జారీ చేసిన 500 నోట్లపై కూడా స్టార్ సింబల్ ఉందని ఆర్బీఐ తెలిపింది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్ల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.RBI వెబ్సైట్ ప్రకారం, 2006లో బ్యాంక్ రీప్లేస్మెంట్ కోసం "STAR సిరీస్" నంబరింగ్ విధానాన్ని అవలంబించింది. స్టార్ సిరీస్ నోట్లు ఇతర నోట్లతో సమానంగా ఉంటాయి, అయితే నెంబర్ లో ఒక *(నక్షత్రం) అదనంగా ఉంటుంది.
2006లో, RBI ఒక పత్రికా ప్రకటనను షేర్ చేసింది. స్టార్ సిరీస్ కింద ఉన్న నోట్లు ప్రస్తుతమున్న నోట్ల మాదిరిగానే ఉంటాయి కానీ అదనపు అక్షరాన్ని కలిగి ఉంటాయని స్పష్టం చేసింది. స్టార్ సిరీస్ బ్యాంక్ నోట్లు చట్టబద్ధమైనవి. ప్రజలు ఈ నోట్లను స్వేచ్ఛగా అంగీకరించవచ్చు, ఉపయోగించవచ్చు.
ఈ పత్రికా ప్రకటనను రిజర్వ్ బ్యాంక్ ట్వీట్లో పంచుకుంది.
స్టార్ సింబల్ ఉన్న నోట్లు చెల్లవంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.
Claim : Currency notes with an asterisk symbol in its serial number are fake.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story