Sun Dec 22 2024 12:57:21 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాకిస్థాన్ ఒక శ్మశాన వాటిక అని అన్నారా..?
పుతిన్ పాకిస్థాన్‌ను స్మశానవాటికగా ఉపయోగించే భూమిగా అభివర్ణించాడన్నది వైరల్ పోస్టుల్లో ఉన్నది. పాకిస్తాన్‌లోని ధనవంతులు పాకిస్థాన్ భూభాగాన్ని స్మశానవాటికలా మాత్రమే ఎలా ఉపయోగించుకుంటున్నారనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.
క్లెయిమ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాకిస్థాన్ ఒక శ్మశాన వాటిక అని అన్నారు
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.. వీడియోను ఎడిట్ చేశారు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పినట్లుగా.. ఓ కోట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అది కూడా పాకిస్థాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా పోస్టుల ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. పుతిన్ పాకిస్థాన్‌ను స్మశానవాటికగా ఉపయోగించే భూమిగా అభివర్ణించాడన్నది వైరల్ పోస్టుల్లో ఉన్నది. పాకిస్తాన్‌లోని ధనవంతులు పాకిస్థాన్ భూభాగాన్ని స్మశానవాటికలా మాత్రమే ఎలా ఉపయోగించుకుంటున్నారనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాకిస్థాన్‌పై అలాంటి ప్రకటన ఏమైనా చేశారా లేదా అని తనిఖీ చేయడానికి మేము పలు సెర్చ్ ఇంజిన్స్ లో సమాచారం కోసం వెతికాము. వ్లాదిమిర్ పుతిన్ నుండి అటువంటి ఆన్-రికార్డ్ లేదా అధికారిక ప్రకటన మాకు కనిపించలేదు. వ్లాదిమిర్ పుతిన్ అటువంటి ప్రకటన చేసి ఉంటే, అనేక పాకిస్థానీ వార్తా వెబ్సైట్లు ఆ సమాచారాన్ని నివేదించే కథనాలను ప్రచురించి ఉండేవి. కానీ ఈ ఆరోపణల గురించి మేము ఒక్క వార్తా నివేదికను కనుగొనలేకపోయాము. పుతిన్ చేసినట్లుగా చెబుతున్న ఈ నకిలీ ప్రకటన 2018 నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
2018లో, 'అల్ జజీరా వెస్ట్ ఆఫ్రికా' పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీ పుతిన్‌కు ఆపాదిస్తూ అదే కోట్ యొక్క మరొక వెర్షన్‌ను పోస్ట్ చేసింది. ఈ ఇతర వెర్షన్ కోట్‌లోని టెక్స్ట్, "ఆఫ్రికా కేవలం ఆఫ్రికన్ల స్మశానవాటిక" అని ఉన్నట్లుగా తెలియజేయబడింది."Africa is just a cemetery of Africans" అనే కోట్ ఉంది.
2018లో, 'అల్ జజీరా వెస్ట్ ఆఫ్రికా' పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీ పుతిన్‌కు ఆపాదిస్తూ అదే కోట్ యొక్క మరొక వెర్షన్‌ను పోస్ట్ చేసింది. ఈ ఇతర వెర్షన్ కోట్‌లోని టెక్స్ట్, "ఆఫ్రికా కేవలం ఆఫ్రికన్ల స్మశానవాటిక" అని ఉన్నట్లుగా తెలియజేయబడింది."Africa is just a cemetery of Africans" అనే కోట్ ఉంది.
ఈ వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, ఘనా సమాచార మంత్రిత్వ శాఖ - 'అల్ జజీరా వెస్ట్ ఆఫ్రికా' పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీ నకిలీదని ధృవీకరిస్తూ వివరణ ఇచ్చింది. అనేక ఆఫ్రికన్ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు ఈ సమాచారాన్ని నివేదించే కథనాలను ప్రచురించాయి. పుతిన్ ఆ వ్యాఖ్యలు చేయలేదని ధృవీకరించాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాకిస్థాన్ ఆ దేశ పౌరులకు కేవలం శ్మశానవాటిక అని పిలవలేదు.
క్లెయిమ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాకిస్థాన్ ఆ దేశ పౌరులకు కేవలం శ్మశానవాటిక అని అన్నారు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Russian President Vladimir Putin called Pakistan a land just used as a cemetery for Pakistanis.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story