Wed Mar 26 2025 11:14:54 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తన కుమారుడు మిల్కీపూర్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోవడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ ఏడవలేదు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ (అయోధ్య) లోక్‌సభ స్థానంలో జరిగిన ఘోర పరాజయానికి ప్రతీకారంగా మిల్కీపూర్

Claim :
తన కుమారుడు మిల్కీపూర్ ఎమ్మెల్యే స్థానానికి ఓడిపోవడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారుFact :
వైరల్ వీడియో పాతది. అయోధ్యలోని మిల్కీపూర్‌లో దళిత మహిళపై అత్యాచారం కేసు గురించి సమాజ్‌వాదీ ఎంపీ విలేకరుల సమావేశంలో ఏడ్చారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ (అయోధ్య) లోక్‌సభ స్థానంలో జరిగిన ఘోర పరాజయానికి ప్రతీకారంగా మిల్కీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ని భారీ మెజార్టీతో ఓడించింది. బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ శ్ఫ్ అభ్యర్థి అజిత్ ప్రసాద్‌ను ఓడించారు. అజిత్ ప్రసాద్ తండ్రి అవధేష్ ప్రసాద్ లోక్ సభకు ఎంపీ గా ఎన్నికవ్వగా ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి 1.46 లక్షలకు పైగా ఓట్లు సాధించగా, ఎస్పీ అభ్యర్థికి 84,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో ఓటమి పాలైన తర్వాత, మిల్కీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత కొన్ని నెలలుగా పలు సందర్భాల్లో అయోధ్యను సందర్శించారు. సీనియర్ మంత్రులను అక్కడ శిబిరానికి తరలించారు. స్థానిక నేతలను బుజ్జగించారు. విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు.
ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఫిబ్రవరి 5, 2025న జరిగిన ఉప ఎన్నికలకు మిల్కీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజిత్ ప్రసాద్ ఓటమి తర్వాత SP ఎంపీ ఏడుస్తున్నారనే వాదనతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ ప్రెస్ ముందు ఆపుకోలేక ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. “అతని కుమారుడు మిల్కీపూర్ స్థానం నుంచి ఓడిపోతున్నాడు.. బీజేపీ అభ్యర్థి 17 వేలకు పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నాడు.. అయోధ్య కా రాజా” అనే క్యాప్షన్‌తో వీడియో వైరల్ అవుతూ ఉంది.
“इस बुड्ढे की ऑस्कर विनिंग एक्टिंग फेल हो गई मिल्कीपुर में 10 हजार वोटो से भाजपा आगे चल रही मिल्कीपुर में प्रचंड मतों से भगवा लहरा ने जा रहा जय श्री राम.” అంటూ మరొకరు హిందీలో పోస్టు చేశారు. బీజేపీ లీడింగ్ లో ఉంటే ఆస్కార్ విన్నింగ్ ప్రదర్శన చేస్తున్నారంటూ విమర్శించారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు.
సమాజ్ వాదీ పార్టీ మిల్కీపూర్ సీటును ఉప ఎన్నికల్లో కోల్పోయిన తర్వాత చోటు చేసుకున్న ఘటన కాదు. వైరల్ వీడియో ఇటీవలిది కాదు. మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వెతికాం. మేము వీడియో నుండి స్క్రీన్షాట్లను షేర్ చేసిన కొన్ని వార్తా కథనాలను కనుగొన్నాము.
Lokmattimes.comలో ప్రచురించిన కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని కాలువలో 22 ఏళ్ల దళిత మహిళ మృతదేహం కనుగొన్న తర్వాత అయోధ్య (ఫైజాబాద్) ఎంపీ అవధేష్ ప్రసాద్ విలేకరుల ముందు విలపిస్తూ కనిపించారు. మహిళ కనిపించకుండా పోయిందని, ఆమెను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం.. అయోధ్య జిల్లాలో 22 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై అనేక రాజకీయ పార్టీల నాయకుల నుండి తీవ్ర స్పందన వచ్చింది. సమాజ్ వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఫిబ్రవరి 2, 2025 న విలేకరుల సమావేశంలో, బాధిత కుటుంబానికి న్యాయం చేయలేకపోతే రాజీనామా చేస్తానని చెప్పారు. దళిత మహిళ హత్యపై ఎంపీ మీడియా ప్రతినిధుల ముందు విలపించారు. ఆమెను రక్షించడంలో నేను విఫలమయ్యానని వాపోయారు. నన్ను ఢిల్లీకి, లోక్‌సభకు వెళ్లనివ్వండి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ముందు లేవనెత్తుతాను. ఆ యువతికి న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తానని ఆ సందర్భంలో చెప్పారు.
“SP MP Awadhesh Prasad Crying Live:फूट-फूटकर रोने लगे Ayodhya सांसद अवधेश प्रसाद | Viral Video” అనే టైటిల్ తో వీడియోను లైవ్ స్ట్రీమ్ చేశారు. ఫిబ్రవరి 3, 2025న SP ఎంపీ ప్రెస్ ముందు ఏడుస్తున్న ప్రత్యక్ష ప్రసార వీడియో ఇక్కడ ఉంది.
సమాజ్‌వాదీ ఎంపీ ప్రెస్ ముందు ఏడుస్తున్న వీడియోను ఇండియా టుడే కథనంలో కూడా షేర్ చేశారు.
ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ ప్రెస్ ముందు కన్నీరుమున్నీరుగా విలపించిన వీడియో కొన్ని రోజుల కిందటిది, ఆ వీడియోకు మిల్కీపూర్ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : తన కుమారుడు మిల్కీపూర్ ఎమ్మెల్యే స్థానానికి ఓడిపోవడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story