Fri Nov 22 2024 20:32:46 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇంధన ధరల పెంపును ధనవంతులపై ప్రధాని మోదీ మాస్టర్‌స్ట్రోక్‌గా స్మృతి ఇరానీ ప్రశంసించారా?
మన ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన ధరలను పెంచడం ద్వారా పేదలకు సహాయం చేసారు. అదే సమయంలో ఇది ధనికులపై మాస్టర్ స్ట్రోక్
క్లెయిమ్: ఇంధన ధరల పెంపు ధనికులకు వ్యతిరేకంగా ఇచ్చిన మాస్టర్‌స్ట్రోక్ అని స్మృతి ఇరానీ
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.. వీడియోను ఎడిట్ చేశారు
గత రెండు వారాలుగా ఇంధన ధరలు భారతదేశంలో పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! గత రెండు వారాలుగా క్రమం తప్పకుండా ఇంధన ధరల పెరుగుదల, ఇతర వస్తువుల ధరల ద్రవ్యోల్బణం మధ్య, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి సంబంధించిన ఓ వీడియో.. షాకింగ్ వాదనలతో వైరల్ అయ్యింది.
ఇంధన ధరల పెంపుపై యూపీఏ ప్రభుత్వాన్ని క్రమం తప్పకుండా విమర్శించే ఇరానీ.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని అదే విధంగా ప్రశంసించారని వీడియోను షేర్ చేస్తున్న వారు పేర్కొన్నారు.
వైరల్ వీడియోలో.. ఇరానీ హిందీలో మాట్లాడుతూ "మన ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన ధరలను పెంచడం ద్వారా పేదలకు సహాయం చేసారు. అదే సమయంలో ఇది ధనికులపై మాస్టర్ స్ట్రోక్. ధనికులు తరచుగా కార్లు నడుపుతారు. కాబట్టి ఇది పేద ప్రజలకు ఎంతో సహాయ పడుతుంది" అని అన్నారు.
నిజ నిర్ధారణ:
వీడియోను ఎడిట్ చేసినందు వలన వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని గుర్తించబడింది. ఈ వీడియో ఏడాది కంటే పాతది కాగా.. అందులో ఇరానీ ఆంగ్లంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీని విమర్శించారు.వీడియోను నిశితంగా పరిశీలించిన తర్వాత.. ఇరానీ మాటలు, ఆమె పెదవుల కదలిక ఒకదానికొకటి సరిపోలడం లేదని మేము గమనించాము. వీడియోకు వాయిస్ జోడించినట్లు స్పష్టంగా గుర్తించాము.
ఇంధన ధరల పెంపును ఆమె సమర్థించిందా లేదా అని తనిఖీ చేయడానికి మేము వార్తా నివేదికల కోసం శోధించాము.. అందుకు సంబంధించి ఎలాంటి వార్తను కూడా మేము కనుగొనబడలేదు.
వీడియోలో ఆమె ముందు ఉంచిన మైక్రోఫోన్లో ANI లోగో కనిపించింది. మేము దానిని క్లూగా తీసుకుని Twitterలో అధునాతన కీవర్డ్ సెర్చ్ లను నిర్వహించాము. ఫిబ్రవరి 24, 2021న వార్తా సంస్థ ట్వీట్ చేసిన అసలైన వీడియో మాకు కనిపించింది. అమేథీ ప్రజలను, ఓటర్లను మాత్రమే కాకుండా ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న రాహుల్ గాంధీ ద్వేషపూరిత, ప్రతీకార రాజకీయాలను ప్రతి భారతీయ పౌరుడు ఖండించాలని ఆ ట్వీట్లో పేర్కొన్నారు స్మృతి ఇరానీ.

ANI వీడియోలో, ఇరానీ హిందీలో కాకుండా ఆంగ్లంలో మాట్లాడారు. దీంతో వైరల్ వీడియోలోని ఆడియో ను కావాలనే యాడ్ చేసినట్లు స్పష్టమైంది.
స్మృతి ఇరానీ వైరల్ క్లిప్ ఎడిట్ చేసిందని మేము నిర్ధారించాము. ఇంధన ధరల పెంపును ధనికులకు వ్యతిరేకంగా ఇచ్చిన మాస్టర్‌స్ట్రోక్ అని ఆమె ప్రశంసించలేదు.
క్లెయిమ్: ఇంధన ధరల పెంపును ధనికులకు వ్యతిరేకంగా ఇచ్చిన మాస్టర్‌స్ట్రోక్ అని స్మృతి ఇరానీ ప్రశంసించారా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Smriti Irani praised Narendra Modi over the fuel price hikes, calling it a masterstroke against the rich.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story