Mon Dec 23 2024 12:34:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారా..?
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పలు పోస్టులు వేయడాన్ని చూడవచ్చు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పలు పోస్టులు వేయడాన్ని చూడవచ్చు.
లాక్ డౌన్ లో ఎన్నో మంచి పనులు చేసి, చాలా మందికి సహాయపడిన 'సోనూ సూద్ కాంగ్రెస్లో చేరాడు' అనే టెక్స్ట్తో కూడిన ఫోటోలను పలువురు షేర్ చేయడాన్ని గమనించవచ్చు. పంజాబ్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్, "కాంగ్రెస్తో సోనూ సూద్! కోవిడ్ సమయంలో వేలాది మందికి సహాయం చేసాడు. భవిష్యత్తులోనూ సేవ చేస్తూనే ఉంటాడు" అనే శీర్షికతో ఫోటోను పోస్టు చేయడం గమనించవచ్చు.
యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శేష్ నారాయణ్ ఓజా, పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కూడా తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి ఇలాంటి దాన్నే పోస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కూడా ఒక చిన్నారితో పాటు సోనూ సూద్ ఉన్న ఫోటోను పోస్టు చేశారు. "సోనూ సూద్ తన రాజకీయ జీవితం కోసం కాంగ్రెస్లో చేరాడు, అతను ఇక్కడ కూడా విజయం సాధిస్తాడని ఆశిస్తున్నాము." అంటూ పోస్టులు పెట్టి ఉండడాన్ని గమనించవచ్చు.
దేశ వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా ఇది నిజమేనని భావించి పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ పోస్టుల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము. మాకు లభించిన సమాచారం ప్రకారం సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు కాంగ్రెస్లో చేరడం గురించి అనేక వార్తా నివేదికలను చూశాము. ఈ కార్యక్రమంలో సోనూ సూద్ కూడా పాల్గొన్నారు.జనవరి 10, 2022న ప్రచురించబడిన ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, మాళవికా సూద్ పంజాబ్ రాష్ట్ర పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మాళవికా సూద్ తన సోదరుడు, పలువురు కాంగ్రెస్ నాయకులతో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడాన్ని మా బృందం గుర్తించింది.
మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా పలు మీడియా సంస్థలు నివేదికలను ప్రచురించాయి. అయితే ఎక్కడా కూడా సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తా కథనాలు కనిపించలేదు. సోనూసూద్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎలాంటి వార్తలను మీడియా కథనాలు నివేదించలేదు. "తన సోదరి కాంగ్రెస్లో చేరినప్పుడు సోనూ సూద్ విలేకరుల సమావేశంలో లేడు" అని నివేదిక పేర్కొంది.
తన సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలియజేస్తూ సోనూ సూద్ ట్వీట్ చేశారు. సూద్ ట్వీట్లో "నా సోదరి మాళవికా సూద్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినందున, నేను ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమె జీవితంలోని ఈ కొత్త అధ్యాయంలో ఆమె ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. మాళవికకు శుభాకాంక్షలు! నటుడిగా మానవతావాదిగా నా స్వంత పని ఎలాంటి రాజకీయ అనుబంధాలు లేకుండా కొనసాగుతుంది." అని చెప్పుకొచ్చారు. తనకు, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని సోనూ సూద్ ఈ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చారు.
జనవరి 13, 2022న టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోనూ సూద్ తాను రాజకీయాలకు సంబంధించిన వరకూ దూరంగా ఉంటానని.. తన సోదరి కోసం కూడా ప్రచారం చేయనని తేల్చిచెప్పారు. "ఇది ఆమె ప్రయాణం, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను చేస్తున్న పనిని నేను చేస్తూనే ఉంటాను, నేను ఆమె కోసం ఎన్నికల్లో ప్రచారం చేయను. ఎందుకంటే నేను ఆమె కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాను. నాకు సంబంధించినంత వరకు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను." అని చెప్పుకొచ్చారు.
Claim : Bollywood actor Sonu Sood joined Congress.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story