Sun Mar 30 2025 02:10:31 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సుఖేష్ చంద్రశేఖర్ కేటీఆర్ కు ఇటీవలి కాలంలో ఎలాంటి లేఖ రాయలేదు
ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్ర శేఖర్ జైలులోనే ఉంటూ

Claim :
వెల్కమ్ టు తీహార్ జైల్ అంటూ కేటీఆర్ కు ఇటీవల సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారుFact :
అలాంటి లేఖ ఏదీ ఇటీవలి కాలంలో కేటీఆర్ కోసం సుఖేష్ రాయలేదు
ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్ర శేఖర్ జైలులోనే ఉంటూ తన లాయర్ల ద్వారా పలు లేఖలు విడుదల చేస్తూ వస్తున్నాడు. పలువురు ప్రముఖులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై కూడా లేఖలు విడుదల చేసినట్లుగా కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫార్ములా-ఇ రేస్ ఈవెంట్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్, హైదరాబాద్‌లో ఫార్ములా ఇ రేస్‌ను నిర్వహించడం మంత్రిగా తన అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి. జనవరి 7న ఈడీ ఎదుట హాజరుకావాలని కేటీఆర్‌కు గతంలో సమన్లు జారీ చేశారు. అయితే, ఆయన రెండు వారాల గడువు కోరగా, జనవరి 16న హాజరుకావాలని కొత్త తేదీని ఇవ్వగా ఈడీ ఎదుట హాజరయ్యారు.
2024లో నిర్వహించాల్సిన ఈవెంట్ కోసం గత BRS హయాంలో నిర్దేశించిన విధానాలను ఉల్లంఘించి విదేశీ కరెన్సీలో దాదాపు రూ. 55 కోట్ల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కేటీఆర్ మీద విచారణ మొదలైంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఇఒ)కి పారదర్శకమైన బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీ ద్వారా రూ.46 కోట్లు చెల్లించామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని, ప్రతి రూపాయికి లెక్కలు చెప్పామని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఫార్ములా-E రేసు ఫిబ్రవరి 2023లో హైదరాబాద్‌లో నిర్వహించారు. రేసును 2024లో కూడా ప్లాన్ చేసినప్పటికీ, 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాన్ని రద్దు చేశారు.
ఓ వైపు విచారణ జరుగుతూ ఉండగా "కేటీఆర్ అన్న వెల్కమ్ టు తిహార్ : సుఖేష్ చంద్రశేఖర్" అనే టైటిల్ తో ఉన్న way2news స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ ఉంది.
"200 కోట్ల రూపాయల మానీలాండరింగ్ కేసులో జైలు అనుభవస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మళ్లీ సంచలన లేఖ విడుదల చేశారు. లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వందల కోట్ల తరలించానని లేఖలు విడుదల చేసి సంచలనంగా మారిన సుఖేష్ ఇప్పుడు తిహార్ జైలుకు వస్తున్న కేటీఆర్ అన్నకు స్వాగతం అంటూ మరో లేఖను విడుదల చేశారు. జైలుకు వచ్చాక ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందామని సుఖేష్ రాసిన లేఖను సుఖేష్ లాయర్ మీడియాకు విడుదల చేశారు." అని అందులో ఉంది.
వైరల్ పోస్టులను ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కేటీఆర్ ను ఉద్దేశించి సుఖేష్ చంద్ర శేఖర్ ఇటీవలి కాలంలో ఏవైనా ప్రకటనలు చేశారా అని మేము గూగుల్ లో సెర్చ్ చేశాం. కానీ మాకు ఎలాంటి కథనాలు కూడా కనిపించలేదు.
సుఖేష్ చంద్రశేఖర్ గురించి "Sukesh Chandrasekhar wants to pay Rs 7,640 crore tax, writes to Nirmala Sitharaman" అనే టైటిల్ తో జనవరి 12న ఇండియా టుడేలో వచ్చిన కథనాన్ని మేము గమనించాం.
ఆర్థిక నేరం కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి తన విదేశీ ఆదాయాన్ని రూ. 22,410 కోట్లుగా ప్రకటిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తన న్యాయవాది ద్వారా విడుదల చేసిన లేఖలో భారతదేశానికి తన ఆదాయంలో రూ.7,640 కోట్ల పన్నులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పలు దేశాల్లో తనకు వ్యాపారాలు ఉన్నాయని అందులో వచ్చిన ఆదాయాన్ని పన్ను రూపంలో భారతదేశానికి చెల్లిస్తానని సుఖేష్ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
ఇదే విషయాన్ని పలు న్యూస్ అవుట్ లెట్లు ఇటీవల ప్రకటించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
సుఖేష్ చంద్రశేఖర్ ఇటీవలి కాలంలో కేటీఆర్ పై లేఖను విడుదల చేసి ఉంటే అది తప్పకుండా వార్తల్లో ప్రముఖంగా నిలిచి ఉండేది. అలాంటి ప్రకటనలు ఏవీ సుఖేష్ చంద్ర శేఖర్ నుండి రాలేదని మేము ధృవీకరించాం.
అయితే తీహార్ క్లబ్ కు స్వాగతం అంటూ గతంలో కల్వకుంట్ల కవితకు 2024, మార్చి నెలలో సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాసారని పలు మీడియా కథనాలు మాకు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ అవుతున్న కథనం ఫోటో మీద Way2News లోగో, లింక్ ఉన్నాయి. ఈ లింక్ ను మేం గూగుల్‌లో వెతికాం. అయితే Way2News కు సంబంధించిన కథనం ఏదీ మాకు లభించలేదు.

ఇలాంటి వైరల్ పోస్టులకు సంబంధించి Way2News వివరణ కూడా ఇచ్చింది. కొందరు Way2News తో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని వాటిని గుర్తించే పలు సూచనలు చేసింది.
"వే2న్యూస్ పేరుతో మీకు వచ్చే ఫార్వర్డ్ స్క్రీన్షాట్లను ఒక్క క్లిక్‌తోనే.. ఆ ఆర్టికల్ వే2న్యూస్ నుంచి పబ్లిష్ అయిందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. ఇది చాలా సులువు..
వే2న్యూస్‌లో పబ్లిష్ అయిన ప్రతి ఆర్టికల్‌కు ప్రత్యేక ఆల్ఫా న్యూమరిక్ (ఆంగ్ల అక్షరాలు మరియు అంకెలతో కూడిన) కోడ్ ఉంటుంది.
తర్వాత ఉండే ఆల్ఫా న్యూమరిక్ కోడ్‌ను (Ex; Way2.co/kart1rk) మీరు ఇక్కడ సెర్చ్ బార్లో ఎంటర్ చేయండి.
కోడ్ ఎంటర్ చేశాక Verifyపై క్లిక్ చేస్తే Fact Check టూల్ పరిశీలిస్తుంది.
మా ద్వారా ఆర్టికల్ పబ్లిష్ చేయబడితే ఆ కోడ్‌తో ఉన్న ఆర్టికల్ మీకు ఇక్కడ కన్పిస్తుంది.
ఒకవేళ ఆర్టికల్ కన్పించకపోయినా, ఆ కోడ్‌తో మీకు వేరే ఆర్టికల్‌ను Fact Check టూల్ చూపిస్తుందంటే.. మీకు ఫార్వర్డ్‌గా వచ్చిన వార్తా కథనాన్ని వే2న్యూస్ పబ్లిష్ చేయలేదని అర్థం. మా సంస్థతో సంబంధం లేని బయటి వ్యక్తులు అసత్య ప్రచారం కోసం ఆ వార్తను సృష్టించారని అర్థం" అంటూ వివరణ ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : అలాంటి లేఖ ఏదీ ఇటీవలి కాలంలో కేటీఆర్ కోసం సుఖేష్ రాయలేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story