Mon Dec 23 2024 08:36:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. వైసీపీ క్యాంపెయిన్ సాంగ్ ను పాడలేదు
మే 13, 2024న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. APలో 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు డూ ఆర్ డై అంటూ పోరాడుతూ ఉన్నారు
Claim :
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఒక కార్యక్రమంలో జగన్ సాంగ్ ను పాడుతూ కనిపించారుFact :
ఆడియోను ఎడిట్ చేశారు, బాలకృష్ణ పాడిన పాట సీఎం జగన్ కు సంబంధించిన పాట కాదు
మే 13, 2024న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. APలో 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు డూ ఆర్ డై అంటూ పోరాడుతూ ఉన్నారు. మంచి చేశాం.. ప్రజలే గెలిపిస్తారని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని రావాలంటే బాబు సీఎం అవ్వాలని కూటమి నాయకులు చెబుతూ ఉన్నారు. ఇక వైఎస్సార్సీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో సంక్షేమ పింఛను రూ.3000 నుంచి రూ.3500కు పెంచుతామని, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి సహా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెబుతున్నారు.
హిందూపూర్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ వేదికపై పాడుతున్న వీడియోను చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచార పాటను పాడుతున్నారనే వాదనతో పంచుకున్నారు.
తెలుగు ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురితో కలిసి బాలకృష్ణ పాడడం వీడియోలో చూడవచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బ్యానర్లను మనం చూడవచ్చు. గాయకుల వెనుక ఒకదానిపై ‘లేపాక్షి’ అని ఉండడం కూడా మనం చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. నందమూరి బాలకృష్ణ స్టేజీ మీద వైసీపీకి చెందిన పాటను పాడలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార గీతాన్ని బాలకృష్ణ పాడడం లేదు. వీడియో పాతది.
మేము వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించాము. కీవర్డ్లతో సెర్చ్ చేయగా.. బాలకృష్ణ ఒక ఈవెంట్లో పాడిన ఎన్నో విజువల్స్ ను మేము గుర్తించాం. మాకు చాలా యూట్యూబ్ వీడియోలు ఒకే విజువల్స్ చూపించాయి.. కానీ వేరే పాట అందులో ఉంది.
filmibeats.com ప్రకారం, బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపూర్లో 2016లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించారు. ఈవెంట్కు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన చూసుకోవడమే కాకుండా ప్రత్యక్షంగా ప్రేక్షకులను అలరించారు. ఈ ఫంక్షన్లో సింగర్ గీతా మాధురితో కలిసి బాలయ్య ఒక పాటను లైవ్ లో పాడి వినిపించాడు.
‘Balakrishna Singing on Stage for his fans at Lepakshi Utsav 2016 at Hindupur Day 2’ అనే టైటిల్ తో యూట్యూబ్ లో వీడియోను అప్లోడ్ చేశారు. ఫిబ్రవరి 29, 2016న ‘నందమూరి బాలకృష్ణ’ ఛానెల్లో ఒరిజినల్ వీడియోని అప్లోడ్ చేశారు.
ఈ లింక్ మీద కూడా క్లిక్ చేసి చూడొచ్చు
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ప్రమోట్ చేస్తున్న ఎజెండా పాట ఒరిజినల్ వీడియో ఇక్కడ ఉంది. ఈ వీడియోలోని పాటను వైరల్ వీడియోలోని ఒరిజినల్ ఆడియో స్థానంలో ఉంచారు.
అందుకే, వైరల్ వీడియోలో వినిపించిన ఎజెండా పాట ఆడియోకు బాలకృష్ణకు ఎలాంటి సంబంధం లేదు. బాలయ్య బాబు వేదికపై వేరే పాట పాడారు. వేదికపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేస్తూ బాలకృష్ణ పాట పాడారన్న వాదన అవాస్తవం.
Claim : టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఒక కార్యక్రమంలో జగన్ సాంగ్ ను పాడుతూ కనిపించారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story