Mon Dec 23 2024 05:33:35 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: చిత్తోర్ లో ఆలయాన్ని మసీదులా మార్చేశారా..?
ఇటీవల భారతదేశంలో హిందూ దేవాలయాలను మసీదులుగా మార్చారంటూ తీవ్ర చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎన్నో సుప్రసిద్ధ మసీదులు ఒకప్పుడు హిందూ దేవాలయాలు అంటూ పలువురు రాజకీయ నాయకులు, మత సంఘాల నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు.
క్లెయిమ్: చిత్తోర్ లో ఆలయాన్ని మసీదులా మార్చేశారా..?
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
ఇటీవల భారతదేశంలో హిందూ దేవాలయాలను మసీదులుగా మార్చారంటూ తీవ్ర చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎన్నో సుప్రసిద్ధ మసీదులు ఒకప్పుడు హిందూ దేవాలయాలు అంటూ పలువురు రాజకీయ నాయకులు, మత సంఘాల నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. తాజ్ మహల్ విషయంలో కూడా ఇలాంటి కథనాలే ప్రచారం అయిన సంగతి తెలిసిందే..!
ఇటీవల భారతదేశంలో హిందూ దేవాలయాలను మసీదులుగా మార్చారంటూ తీవ్ర చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎన్నో సుప్రసిద్ధ మసీదులు ఒకప్పుడు హిందూ దేవాలయాలు అంటూ పలువురు రాజకీయ నాయకులు, మత సంఘాల నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. తాజ్ మహల్ విషయంలో కూడా ఇలాంటి కథనాలే ప్రచారం అయిన సంగతి తెలిసిందే..!
ప్రస్తుతం దేవాలయంగా కనిపించే ఒక నిర్మాణం యొక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పటి ఆలయాన్ని మసీదులా మార్చారంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. మసీదుగా మార్చబడిన ఆలయం అని సూచించే వివిధ శీర్షికలతో ఫోటో వైరల్ అవుతోంది.
బీజేపీకి చెందిన సురేంద్ర పూనియా ఫోటోను హిందీలో ఒక శీర్షికతో పంచుకున్నారు, "మొఘలులు, మిగిలిన ఆక్రమణదారుల వాస్తుశిల్పం చాలా ప్రత్యేకమైనది, వారు ఏది నిర్మించినా.. ఎల్లప్పుడూ దాని నేలమాళిగలో ఒక ఆలయాన్ని ఉంచారు." అంటూ ప్రస్తావించారు. తాజ్మహల్లోని బేస్మెంట్లో 22 తాళం వేసిన గదులు హిందూ విగ్రహాలను ఉంచారంటూ పునియా ట్వీట్లో ప్రస్తావించారు.
@SujinEswar1 @Chetankumar_111యూజర్లు చిత్తోర్ లో హిందూ ఆలయాన్ని మొఘలులు మసీదులా మార్చారంటూ ప్రచారం చేస్తున్నారు.
ఈ నిర్మాణం యొక్క ఫోటో 2020లో.. అదే దావాతో ట్విట్టర్లో వైరల్ అవుతోంది. ఫేస్బుక్లో కూడా ప్రచారంలో ఉంది.
మేము ఫోటో ను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. 2011 సంవత్సరానికి చెందిన ఒక ఫోరమ్‌ని చూశాము. సుదీప్తో రే కోల్‌కతా నుండి రాజస్థాన్ వరకు తన సెల్ఫ్ డ్రైవింగ్ ట్రిప్ ఫోటోలను ప్రచురించారు. తన పోస్ట్‌లలో, సుదీప్తో వైరల్ ఇమేజ్‌ని "ఒక ఆలయం, మసీదుగా మార్చబడింది" అనే శీర్షికతో పంచుకున్నారు. అది స్పష్టంగా తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు. "An obvious temple, converted into a mosque" అంటూ ఫోటోను పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటోను మా బృందం ఫ్యాక్ట్ చెక్ చేసింది.మేము ఫోటో ను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. 2011 సంవత్సరానికి చెందిన ఒక ఫోరమ్‌ని చూశాము. సుదీప్తో రే కోల్‌కతా నుండి రాజస్థాన్ వరకు తన సెల్ఫ్ డ్రైవింగ్ ట్రిప్ ఫోటోలను ప్రచురించారు. తన పోస్ట్‌లలో, సుదీప్తో వైరల్ ఇమేజ్‌ని "ఒక ఆలయం, మసీదుగా మార్చబడింది" అనే శీర్షికతో పంచుకున్నారు. అది స్పష్టంగా తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు. "An obvious temple, converted into a mosque" అంటూ ఫోటోను పోస్టు చేశారు.
వైరల్ ఇమేజ్ కంటే ముందు ఇంటర్నెట్ లో ఉన్న ఫోటోలు కూడా ఇది చిత్తోర్లో ఉన్నట్లు సూచించాయి. దీన్ని క్లూగా తీసుకుని, మేము Googleలో కీవర్డ్ సెర్చ్ చేసాము. Alamy వెబ్ సైట్ లో అదే నిర్మాణాన్ని చూశాము. ఈ నిర్మాణం రాజస్థాన్‌లోని చిత్తోర్ఘర్ కోటలోని రత్తన్ సింగ్ ప్యాలెస్‌లోని పురాతన ఆలయం అని చెప్పుకొచ్చారు.
Using Google Earth Pro, we geolocated the temple at these coordinates 24°53'33.06″N, 74°38'40.47″E. Both the front and the back of the temple are visible on street view.
Google Earth ప్రోని ఉపయోగించి, మేము ఈ కోఆర్డినేట్లు 24°53'33.06″N, 74°38'40.47″E వద్ద ఆలయాన్ని జియోలొకేషన్ ద్వారా చూశాము. ఆలయం ముందు, వెనుక భాగాలు రెండూ కనిపిస్తాయి.
మేము ASI జోధ్‌పూర్ సర్కిల్ వెబ్సైట్లో శృంగార్ చౌరీ ఆలయ ఫోటోను కూడా కనుగొన్నాము.
ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (IGNCA) వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ASI అధికారిక వివరణ ప్రకారం.. శృంగార్ చౌరీని 1448లో మహారాణా కుంభ కోశాధికారి అయిన కోలా కుమారుడు వెలక నిర్మించిన జైన దేవాలయంగా వర్ణించారు.
"Archaeological Survey of India: Report of a Tour in the Panjab and Rajputana in 1883-84, Vol. XXIII", అనే బుక్ లో కూడా కన్నింగ్‌హామ్ "మ్యాగజైన్ మరియు బురుజు మధ్యలో ఉన్న రాతితో చెక్కిన దేవాలయంను ఇప్పుడు శృంగర్-చౌరి అని పిలువబడుతుంది...జైన కోశాధికారి రాణా కుంభ దీనిని నిర్మించారు". ఈ ఆలయాన్ని స్థానికులు వేరే పేరుతో పిలిచేవారని ఇది సూచిస్తుంది.
ఈ ప్రాంతంలో అనేక దేవాలయాల పైన గుండ్రని గోపురాలు ఉన్నాయని కూడా గమనించాలి.
శోబాలాల్ శాస్త్రి రాయగా.. 1928లో ప్రచురించబడిన 'చిత్తోర్ఘర్' పుస్తకాన్ని పరిశీలించాం. ఈ పుస్తకంలో శృంగర్ చౌరీకి సంబంధించిన అధ్యాయం ఉంది. ఈ ఆలయాన్ని మొదట 1277లో రతన్ సింగ్ రాజు నిర్మించాడని సూచిస్తుంది, చిత్తోర్ మొదటి ముట్టడిలో (1303) ధ్వంసమైందని. 1448లో కోశాధికారి వెలక చేత తిరిగి ప్రతిష్టించబడిందని సూచిస్తుంది. దీన్ని మసీదుగా మార్చారని ఎలాంటి ప్రస్తావన లేదు.
శృంగర్ చౌరీ ఆలయాన్ని మసీదుగా మార్చారనే వాదన నిరాధారమైనది.
క్లెయిమ్: శృంగర్ చౌరీ ఆలయాన్ని మసీదుగా మార్చారా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, రాజకీయ నాయకులు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : temple in Chittor was converted into a mosque
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story