Mon Dec 23 2024 10:48:32 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: TSPSC గ్రూప్ II, గ్రూప్ III పరీక్షలను వాయిదా వేయలేదు.. చెలామణిలో ఉన్న సర్క్యులర్ నకిలీది
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 2024లో తెలంగాణ రాష్ట్రంలో TGPSC గ్రూప్ 1, TGPSC గ్రూప్ 2, TGPSC గ్రూప్ 3 సర్వీసెస్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది.
Claim :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ II, గ్రూప్ III పరీక్షలను నవంబర్ 2024కి వాయిదా వేసిందిFact :
గ్రూప్ II, గ్రూప్ III పరీక్షలను వాయిదా వేయబోమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 2024లో తెలంగాణ రాష్ట్రంలో TGPSC గ్రూప్ 1, TGPSC గ్రూప్ 2, TGPSC గ్రూప్ 3 సర్వీసెస్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. అసలు నోటీసు ప్రకారం.. TGPSC గ్రూప్ II సర్వీసెస్ పరీక్ష ఆగస్ట్ 7- 8 తేదీల్లో జరుగుతుంది. TGPSC గ్రూప్ I సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 21, 2024 నుండి ప్రారంభం కానుంది, గ్రూప్ III సర్వీసెస్ పరీక్ష నవంబర్ 17, 18 న నిర్వహించనున్నారు.
టీఎస్పీఎస్సీ గ్రూప్ II, గ్రూప్ III పరీక్షలను వాయిదా వేస్తున్నారంటూ.. ఓ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రూప్ II పరీక్షను నవంబర్ 2024కి రీషెడ్యూల్ చేసినట్లు ఆ పోస్టుల్లో ఉంది. వాట్సాప్ లో వైరల్ అవుతున్న పోస్టును ఇక్కడ మీరు చూడొచ్చు.
ఒక X వినియోగదారు ఈ సమాచారంలో నిజం ఎంత ఉందో చెప్పాలని కోరుతూ ఈ నోట్ ను మాకు షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2, గ్రూప్ III పరీక్షలను వాయిదా వేస్తున్నారనే వాదన అవాస్తవం. TSPSC అటువంటి ప్రకటన చేయలేదు.
మేము సంబంధిత కీవర్డ్‌లతో సెర్చ్ చేసినప్పుడు.. మేము X లో సర్క్యులేషన్లో ఉన్న వార్తలు ఫేక్ అని చెబుతూ ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. “ఫేక్ న్యూస్ అలెర్ట్ TGPSC గ్రూప్ 2 & గ్రూప్ 3 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నకిలీ వెబ్ నోట్‌ను అభ్యర్థులు నమ్మవద్దు. TGPSC పరీక్షల వాయిదాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.” అంటూ కొన్ని పేజీలలో పోస్టులను చూశాం.
V6telugu.comలో ప్రచురించిన కథనం ప్రకారం, గ్రూప్ II, గ్రూప్ III పరీక్షల వాయిదాపై జరుగుతున్న ప్రచారం ఫేక్ అని TGPSC ప్రకటించింది. అలాంటి ప్రెస్ నోట్ ఏదీ కమిషన్ విడుదల చేయలేదు. సంబంధిత అధికారులు కూడా అలాంటి ప్రకటన చేయలేదు.
తెలంగాణ టుడే కథనం ప్రకారం, "కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో నకిలీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కమిషన్ ఎలాంటి ప్రెస్ నోట్‌ను విడుదల చేయలేదు’’ అని తెలిపింది. కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, గ్రూప్ II రిక్రూట్మెంట్ పరీక్ష ఆగస్టు 7, 8 తేదీలలో.. గ్రూప్ III సర్వీసెస్ పరీక్ష నవంబర్ 17, 18 తేదీలలో ఉంటుంది.
టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ II, గ్రూప్ III పరీక్షలను వాయిదా వేస్తున్నారనే వాదన అవాస్తవం. కమిషన్ అటువంటి ప్రకటన చేయలేదు. TGSPC ద్వారా గ్రూప్ II కోసం ఆగస్టు 7, 8 న.. గ్రూప్ III కోసం నవంబర్ 17, 18 తేదీలలో పరీక్షలు షెడ్యూల్ చేశారు. ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు.
Claim : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ II, గ్రూప్ III పరీక్షలను నవంబర్ 2024కి వాయిదా వేసింది
Claimed By : Whatsapp Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Whatsapp
Fact Check : False
Next Story