నిజ నిర్ధారణ: జాతీయ రంగులతో ప్రకాశించే ఫ్లై-ఓవర్ హైదరాబాద్ కు చెందినది కాదు, జైపూర్‌లోని ఎలివేటెడ్ రహదారి
భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. ఈ నేపధ్యంలో, భారత ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. ఈ నేపధ్యంలో, భారత ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని లో భాగంగా, దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, వివిధ స్మారక చిహ్నాలు, రహదారులు ప్రకాశవంతంగా మారాయి. ప్రతి ఒక్కరూ ఇంటిపై జెండాను ఎగురవేస్తున్నారు, ప్రజలు స్వచ్ఛందంగా తమ సోషల్ మీడియాలో ప్రొఫైల్ చిత్రాన్ని భారతీయ జెండాగా మారుస్తున్నారు.
ముంబై, హైదరాబాద్, కోల్కత్తా మొదలైన వివిధ నగరాలకు చెందినదిగా పేర్కొంటూ త్రివర్ణ రంగుల లైట్లతో వెలిగించిన ఫ్లైఓవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో బోరివిల్లి, ముంబై కి చెందినది అని పలువురు ప్రచారం చేయగా, కొందరు హైదరాబాద్‌ను చూపుతోందని షేర్ చేస్తున్నారు, మరికొందరు అది కొల్కత్తా నగరం అని క్లెయిమ్ చేస్తున్నారు.
కొన్ని దావాలు:
నిజ నిర్ధారణ:
వైరల్ వీడియోకు సంబంధించిన దావాలు అబద్దం. త్రివర్ణ పతాక వర్ణాలతో మెరుస్తున్న ఫ్లైఓవర్ జైపూర్లోనిది.
వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాం. జైపూర్‌లోని సోడాలా ఎలివేటెడ్ రహదారి పై డైనమిక్ లైటింగ్ అమర్చబడిందని, ఎలివేటెడ్ రోద్ పైన ఇది మొదటి ప్రయత్నం అని అని ఈ వీడియో వివరిస్తుంది.
లైటింగ్ రిమోట్‌గా నియంత్రించబడుతుంది, జాతీయ పండుగలు, ఇతర సందర్భాల ఆధారంగా వివిధ థీమ్‌లను ప్రదర్శించవచ్చు. థీమ్‌లతో, లైట్లు రంగులను మారుస్తాయి.
ఇక్కడ షేర్ చేయబడిన వీడియోను వైరల్ వీడియోతో పోల్చగా అది ఒకటే స్థలాన్ని చూపుతున్నాయని తెలుస్తోంది.
ఇక్కడ కూడా అదే వీడియో ను చూడవచ్చు.
https://bioscope.rajasthan.gov.in/EventDetails?id=1663
ఫర్స్ట్ ఇండియా న్యూస్ కథనం ప్రకారం, ఎలివేటెడ్ రోడ్డుపైన ఒకవైపు 2.8 కి.మీ, మరో వైపు 1.8 కి.మీ పొడవునా లైటింగ్ చేసారు. జాతీయ పండుగలు, ఇతర సందర్భాల ఆధారంగా లైటింగ్ సిస్టమ్ విభిన్న థీమ్‌లను కలిగి ఉంటుంది.
థీమ్‌లతో, లైట్లు రంగులను మారుస్తాయి. ప్రతి రోజు థీమ్ భిన్నంగా ఉంటుంది. ఇంతకు ముందు ముంబై, అమృత్సర్, అహ్మదాబాద్ మరియు బెంగుళూరులో కూడా ఇటువంటి లైటింగ్ జరిగింది, అయితే ఇంత పొడవైన ఎత్తైన రహదారిపై లైటింగ్ చేయడం దేశంలో ఇదే మొదటిసారి.
firsrindianews.co.in తన యూట్యూబ్ ఛానెల్లో ఆగస్ట్ 4, 2022న ప్రచురించిన మరో కధనం లో, 75 సంవత్సరాల స్వాతంత్ర్య సందర్భాన్ని పురస్కరించుకుని సోడాలా ఎలివేటెడ్ రోడ్‌ను వెలుగులతో నింపేసారని పేర్కొంది.
ఈ క్లెయిం ను ఇండియా టుడే కూడా అబద్దం గా తెలిపింది .
కాబట్టి, వైరల్ దావా అవాస్తవం. వీడియోలో కనిపిస్తున్నది ముంబై లేదా హైదరాబాద్, కోల్కత్తా కు చెందిన ప్రకాశవంతమైన వెలుగులతో నిండిన ఫ్లైఓవర్ కాదు. జైపూర్ లోని ఎత్తైన రహదారి.