Fri Apr 04 2025 02:23:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రముఖ సంస్థ. దీనిని 1955లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది.

Claim :
ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన SBI బ్యాంక్ లోగో అహ్మదాబాద్‌లోని కంకరియా సరస్సు నుండి తీసుకున్నారు.Fact :
SBI లోగో కీహోల్‌ను సూచిస్తుంది, దీనికి అహ్మదాబాద్‌లోని కంకరియా సరస్సుతో సంబంధం లేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రముఖ సంస్థ. దీనిని 1955లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది. భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వేలాది శాఖలను SBI నిర్వహిస్తోంది. SBI 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా ప్రారంభించిన భారతదేశంలోని పురాతన వాణిజ్య బ్యాంకు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చారు. బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ కూడా అందులో భాగమే. ఈ బ్యాంకులు ప్రభుత్వం ప్రైవేట్ చందాదారుల యాజమాన్యంలో ఉండేవి. 1921లో, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ప్రెసిడెన్సీ బ్యాంకులు విలీనం అయ్యాయి. 1955లో భారత ప్రభుత్వం విలీనం చేసుకుంది. దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు.
1955లో బంగారు నాణెం విడుదలైనప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో కూడా ప్రవేశపెట్టారు. నాణెం మధ్యలో ఒక చెట్టుకు సంబంధించిన వివరణాత్మక చిత్రాన్ని చూడొచ్చు. దానిపై 1955 అని కూడా గుర్తులో ఉంది. 1970లో, SBI లోగో పూర్తిగా రీడిజైన్ చేశారు. ఆ తర్వాత 2017లో కూడా మార్చారు. ఈ లోగో బ్యాంక్ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఇటీవల, అహ్మదాబాద్‌లోని కంకరియా సరస్సు ఏరియల్ వ్యూ నుండి SBI లోగో ప్రేరణ పొందారని, SBI బ్యాంక్ లోగోతో సరస్సు ఉపగ్రహ చిత్రం ఉంచి ప్రచారంలో ఉంచారు.
క్లెయిం స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. SBI లోగో రూపకల్పన కీహోల్‌ను సూచిస్తుంది, దీనికి అహ్మదాబాద్‌లోని కంకరియా సరస్సుతో సంబంధం లేదు.
SBI డిజైన్ వివరాల కోసం వెతికినప్పుడు 1971లో రూపొందించిన లోగోను సీల్ ఆఫ్ ట్రస్ట్ అని పిలుస్తారు. దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కు చెందిన శేఖర్ కామత్ అనే డిజైనర్ రూపొందించారని మేము కనుగొన్నాము. మేము శేఖర్ కామత్, SBI డిజైన్ గురించి మరింత సమాచారం కోసం శోధించినప్పుడు, ఈ అంశంపై ప్రచురించిన కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను మేము కనుగొన్నాము.
ఇండియన్ డిజైన్ ఆర్కైవ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో” అని పేర్కొంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. డిజైన్డ్ బై: శేఖర్ కామత్, 1971 అని అందులో ఉంది.
@sheknroll అనే ఇన్‌స్టా ఖాతాను జత పరుస్తూ, "నేను ఈ లోగోను 1970లో NIDలో డిజైన్ చేశాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు, ఇప్పుడు కూడా భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్, అందువల్ల గ్రామీణ భారతదేశంలో అనేక శాఖలను కలిగి ఉంది. ఒక సాధారణ లోగోను రూపొందించాలనేది నా ఆలోచన. ఆ రోజుల్లో బ్యాంకు కౌంటర్లకు రంధ్రాలతో కూడిన రౌండ్ టోకెన్లు ఉండేవి. కాబట్టి టోకెన్లా సింపుల్‌గా లోగోను రూపొందించాలనే ఆలోచన వచ్చింది. గుండ్రని నీలం రంగు మీ సంపదను రక్షించే శక్తిని సూచిస్తుంది. ఖచ్చితంగా కంకరియా సరస్సు నుండి ప్రేరణ తీసుకోలేదు. అలా అనుకున్న వారికి నిరాశ కలిగించినందుకు క్షమించండి." - అని శేఖర్ కామత్” చెప్పారంటూ ఆ పోస్ట్ లో ఉంది
ఆజ్ తక్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఇది భద్రతకు చిహ్నం అని శేఖర్ కామత్ అన్నారు. లోగో అహ్మదాబాద్‌లోని కంకరియా సరస్సుకి సంబంధించినదనే వాదనను కూడా ఆయన తిరస్కరించారు. లోగోపై పని చేస్తున్నప్పుడు కంకారియా సరస్సుకి కూడా వెళ్లలేదని శేఖర్ చెప్పారు. బ్యాంకులో టోకెన్ ఆకారాన్ని చూసి ఈ లోగోను తయారు చేసినట్లు ఆయన తెలిపారు.
కాబట్టి, SBI లోగో అహ్మదాబాద్‌లోని కంకరియా సరస్సు ఏరియల్ వ్యూ నుండి ప్రేరణ పొందిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన SBI బ్యాంక్ లోగో అహ్మదాబాద్‌లోని కంకరియా సరస్సు నుండి తీసుకున్నారు.
Claimed By : Instagram Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Instagram
Fact Check : False
Next Story