Mon Dec 23 2024 06:28:43 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఉక్రెయిన్ బాలిక రష్యా సైనికుడిని కొడుతోందా..?
ఓ అమ్మాయి సైనికుడిని అడ్డుకుంటున్న వీడియోను సోషల్ మీడియా యూజర్లు పోస్టు చేస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆమె ఒక రష్యన్ సైనికుడి
క్లెయిమ్: తన దేశం మీదకు దండెత్తి వచ్చిన రష్యా సైనికుడిని కొడుతున్న బాలిక
ఫ్యాక్ట్: వైరల్ వీడియోకు ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితికి ఎటువంటి సంబంధం లేదు.
ఓ అమ్మాయి సైనికుడిని అడ్డుకుంటున్న వీడియోను సోషల్ మీడియా యూజర్లు పోస్టు చేస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆమె ఒక రష్యన్ సైనికుడి ముందు నిలబడి, అతనిని ఎదుర్కొంటున్నట్లు వీడియోను పోస్టు చేసిన వారు చెబుతూ ఉన్నారు.
ఎన్డిటివి, రిపబ్లిక్ భారత్‌తో సహా అనేక మీడియా సంస్థలు ఈ వీడియోకు సంబంధించి కథనాలను రాశారు. అందులో బాలిక రష్యన్ సైనికుడిని అడ్డుకుంటున్నట్లు తెలిపారు. ఎన్డిటివి హెడ్ లైన్ లో ఇలా ఉంది," अपने देश के लिए फौजी को मारने को तैयार हो गई छोटी बच्ची, वीडियो देख लोग कर रहे हैं सलाम" (తన దేశం కోసం సైనికుడిని కూడా ఎదుర్కోడానికి సిద్ధపడిన చిన్న బాలిక, వీడియోను చూసిన ప్రజలు ఆమె తెగువను ప్రశంసిస్తూ ఉన్నారు)
ఆమె ధైర్యసాహసాలకు చూసి వార్తా సంస్థలు ఆమెను ప్రశంసించాయి. బాలికకు ఆరు నుంచి ఏడేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా, రష్యా సైనిక కార్యకలాపాలపై ఉక్రెయిన్ ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని బాలిక రూపంలో ప్రపంచానికి తెలిసింది అంటూ కథనాలను ప్రసారం చేశారు.
వైరల్ వీడియోలోని గ్రాఫిక్ టెక్స్ట్ హిందీలో ఒక టెక్స్ట్‌లో " ఒక రష్యన్ సైనికుడిని కొడతానని అమ్మాయి బెదిరించింది. ఆ అమ్మాయి రష్యన్ సైనికుడికి ఎదురుగా నిలబడింది" అని ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు అబద్ధం. ఈ వీడియో 2017 లో పోస్ట్ చేయబడింది. పాలస్తీనాకు చెందిన వీడియో ఇది.వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకోవడం జరిగింది. ఇన్విడ్ టూల్ ను, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించాం. సెర్చ్ రిజల్ట్స్ లో భాగంగా డిసెంబర్ 19, 2017న పోస్టు చేసిన ట్వీట్ లో ఓ వీడియోను మేము చూసాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో లాగే ఇది కూడా ఉంది. "ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైనికులను చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ కావడంతో ఇజ్రాయెల్ దళాలు 16 ఏళ్ల అహెద్ తమీమీని అరెస్టు చేశాయి. పాలస్తీనా యువతి తన సోదరుడిని అరెస్టు చేసిన ఇజ్రాయెల్ దళాలను ఎదురుగా నిలబడినందుకు 2012లో పాపులారిటీని పొందింది." దాని ప్రకారం వైరల్ వీడియో పాలస్తీనాకు చెందినది.
ఈ ట్వీట్ ను హింట్ గా తీసుకొని, మేము ఓపెన్ కీవర్డ్ సెర్చ్ చేసాము. వైరల్ వీడియో స్టిల్స్ కు సంబంధించి అనేక మీడియా నివేదికలను కనుగొన్నాము. 13 ఫిబ్రవరి 2018 నాటి BBC నివేదిక ప్రకారం, ఆ అమ్మాయిని పాలస్తీనా నివాసి అహెద్ తమీమిగా గుర్తించారు. సంఘటన జరిగినప్పుడు ఆమె వయస్సు 11 సంవత్సరాలు. తన సోదరుడిని ఇజ్రాయెల్ సైనికుడు అరెస్టు చేసినందుకు తమీమికి కోపం వచ్చింది. అలాగే 16 సంవత్సరాల వయస్సులో, ఆమె ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను చెంపదెబ్బ కొట్టిన వీడియో మళ్లీ వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు, ఆమె తల్లికీ 8 నెలల జైలు శిక్ష విధించారు.
మరింత వెతకగా.. 2018లో అహెద్ తమీమీపై అల్ జజీరా ఒక ఫీచర్ వీడియోను కూడా చేసిందని మేము కనుగొన్నాము. ఇందులో వైరల్ వీడియోను ఉపయోగించారు.
వైరల్ వీడియో 2012 నాటిదని.. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పాలస్తీనాకు చెందినదని మా పరిశోధనలో స్పష్టమైంది. ఆమె పేరు అహెద్ తమీమీ. భారతీయ మీడియా క్లెయిమ్ చేస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి, దీనికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి, వైరల్ క్లెయిమ్ తప్పు.
క్లెయిమ్: ఉక్రెయిన్ బాలిక రష్యా సైనికుడిని కొడుతోంది
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, మీడియా సంస్థలు
ఫ్యాక్ట్: వైరల్ వీడియోల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Video shows Ukrainian girl threatening a Russian soldier amid Ukraine-Russia war.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story