Wed Oct 30 2024 09:24:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో హల్దీరామ్స్ కు చెందిన స్వీట్ షాప్ కాదు
దీపావళి చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. దీపావళి సంప్రదాయాలలో భాగంగా ఇళ్లను శుభ్రపరచడం,
Claim :
పండుగ సీజన్లో హల్దీరామ్ స్వీట్ షాపుల్లో ఉన్న మిఠాయిల్లో పురుగులు కనిపించాయిFact :
వైరల్ వీడియో ఇటీవలిది కాదు. హల్దీ రామ్స్ స్టోర్ కి సంబంధించింది కాదు
దీపావళి చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. దీపావళి సంప్రదాయాలలో భాగంగా ఇళ్లను శుభ్రపరచడం, దీపాలను వెలిగించడం, అందమైన రంగోలిలను వేయడం, మిఠాయిలు తయారు చేసి సన్నిహితులు, ప్రియమైన వారితో పంచుకోవడం జరుపుతూ ఉంటారు. ఆనందం, శ్రేయస్సును ప్రసాదించమని లక్ష్మీ దేవిని ప్రార్థించడం హిందూ సంప్రదాయంలో భాగం. దీపావళి రోజున ప్రజలు వారి కుటుంబాలు, స్నేహితుల ఇళ్లను బహుమతులు, స్వీట్లు ఇచ్చిపుచ్చుకోవడం ఆచారం. ఈ బహుమతులలో ఎక్కువగా స్వీట్ బాక్స్‌లు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి ఉంటాయి. జనాదరణ పొందిన స్వీట్ షాపులు ఈ సమయంలో ఎంతో బిజీ బిజీగా ఉంటాయి. ప్రత్యేకంగా స్వీట్ల బాక్స్‌లను కొనుగోలు చేసే కస్టమర్లతో నిండి ఉంటాయి. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు స్వీట్ బాక్స్‌లను బహుమతిగా ఇస్తాయి.
ఈ పండుగ హడావుడి మధ్య హల్దీరామ్స్ దుకాణంలో విక్రయించే మిఠాయిల్లో పురుగులు ఉన్నాయంటూ ఓ స్వీట్ షాపులో చిత్రీకరించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియో షూట్ చేస్తున్న వ్యక్తి స్వీట్లు చెడిపోయాయంటూ, దుకాణంలోని కార్మికులతో వాదించడం వినవచ్చు. వీడియోపై క్యాప్షన్ “హల్దీరామ్ స్వీట్స్.. కొనుగోలు చేసే ముందు స్వీట్స్ ని చెక్ చేయండి. ఇలాంటి వాటిని అమ్ముతున్న వారిని ఉరి తీయాలి. పండుగల సీజన్లో ఎక్కడి నుండి స్వీట్లు కొనకండి, ఎందుకంటే, ప్రతిచోటా ఇదే కథ.” అంటూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వీడియో ఇటీవలిది కాదు.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేశాం. సెప్టెంబర్ 5, 2023న అదే వీడియోను షేర్ చేసిన Instagram పోస్ట్‌ని మేము కనుగొన్నాము. వైరల్ వీడియోను నాగ్‌పూర్ లో జరిగిన ఘటన అంటూ పోస్టు చేశారని అది నిజం కాదని వివరించారు.
“నాగ్‌పూర్‌లోని హల్దీరామ్ అవుట్‌లెట్‌లో స్వీట్లపై కీటకాలు ఉన్నట్లు వైరల్ వీడియోలో ఆరోపించారు. నాగ్‌పూర్ న్యూస్ చేసిన పరిశోధనలో అది నాగ్‌పూర్ లో చోటు చేసుకున్న ఘటన కాదని, ఉత్తర భారతదేశానికి చెందినదని తేలింది."
సెప్టెంబర్ 6, 2023న Zee news Odia వెబ్సైట్లో కూడా వీడియోను షేర్ చేశారు.
మేము మరింత సెర్చ్ చేసినప్పుడు, హల్దీరామ్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ వైరల్ వాదనను ఖండిస్తున్నట్లు మేము కనుగొన్నాము. "హల్దీరామ్ ఉత్పత్తి బాగోలేదని తప్పుదోవ పట్టించే వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్లు మేము గుర్తించాం. వీడియోలో చూపిన ఉత్పత్తి, స్టోర్ కు హల్దీరామ్‌తో సంబంధం లేదని చెబుతున్నాం." అంటూ కంపెనీ వివరణ ఇచ్చింది. విశ్వసనీయ బ్రాండ్‌గా, మేము మా ఉత్పత్తులు, స్టోర్ లలో నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాము. కఠినమైన నాణ్యత నియంత్రణతో సురక్షితమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడానికి హల్దీరామ్ సంస్థ కట్టుబడి ఉందని అధికారిక ప్రకటనలో తెలిపారు. ధృవీకరించని సమాచారాన్ని విశ్వసించవద్దని మా కస్టమర్లను కోరుతున్నాము. ఇలాంటి నకిలీ వీడియోలు పేరున్న బ్రాండ్లకు హాని చేయడానికి ప్రచారం చేస్తున్నారు. మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, దయచేసి నేరుగా మా కస్టమర్ కేర్ ను సంప్రదించండి. మీ నమ్మకం, మద్దతుకు ధన్యవాదాలని హల్దీరామ్స్ సంస్థ తెలిపింది.
వారి ఫేస్బుక్ పేజీలో కూడా అదే అధికారిక ప్రకటనను ఆంగ్లం, హిందీలో ఉంది.
స్వీట్లలో పురుగులున్నాయని ఓ కస్టమర్ స్వీట్ షాపు కార్మికులతో వాగ్వాదానికి దిగిన వైరల్ వీడియో ఇటీవలి వీడియో కాదు. ఇది దీపావళి రద్దీ సమయంలో హల్దీరామ్ స్వీట్స్ విషయంలో జరుగుతున్నది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : పండుగ సీజన్లో హల్దీరామ్ స్వీట్ షాపుల్లో ఉన్న మిఠాయిల్లో పురుగులు కనిపించాయి
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story