రాహుల్ గాంధీ తో పార్టీలో ఉన్న మహిళ చైనా దౌత్యవేత్త కాదు
రాహుల్ గాంధీ కాఠ్మండు లోని నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్నారంటూ రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, దీనికి కాంగ్రెస్ లీడర్లు 'రాహుల్ తన స్నేహితురాలి పెళ్లిలో పాల్గొనడానికి వెళ్లారంటూ, అందులో తప్పేముందంటూ స్పందించారు.
రాహుల్ గాంధీ కాఠ్మండు లోని నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్నారంటూ రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, దీనికి కాంగ్రెస్ లీడర్లు 'రాహుల్ తన స్నేహితురాలి పెళ్లిలో పాల్గొనడానికి వెళ్లారంటూ, అందులో తప్పేముందంటూ స్పందించారు.
కానీ, పబ్ లో రాహుల్ తో కనబడిన మహిళ నేపాల్ లోని చైనా దౌత్యవేత్త అంటూ ఈ వీడియోలను సోషల్ మీడియాని చాలామంది పంచుకుంటున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్ట్ లలో నిజం లేదు. వీడియో నిజమే అయినా తప్పుడు సమాచారాన్ని జోడించి షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోలలో ఉన్న మహిళ చైనా కు చెందిన దౌత్యవేత్త అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.
న్యూస్ రిపోర్ట్ ల అనుసారం, కాంగ్రేస్ నేత రాహుల్ గాంధీ ఖాట్మండూ లో తన స్నేహితురాలు, సి.ఎన్.ఎన్ జర్నలిస్ట్, సుమ్నిమ ఉదాస్ పెళ్లి లో పాల్గొనడానికి వెళ్లారు. పెళ్లి మే 3వ తారీఖున జరుగగా, రిసెప్షన్ మే 5న జరుగనుంది.
https://kathmandupost.com/
ఇండియా టుడే కధనం ప్రకారం, ఈ వీడియోలలో కనిపిస్తున్న పబ్ 'లార్డ్ ఒఫ్ ద డ్రింక్శ్ అనబడా ఒక నైట్ క్లబ్. మీడియా పబ్ యజమాని రాబిన్ ష్రేష్టా ని సంప్రదించినప్పుడు, రాహుల్ గాంధీ తో పాటు చైనీస్ ఎంబసీ నుంచి ఎవరూ రాలేదని నిర్ధారించారు. రాహుల్ అక్కడ ఒకటిన్నర గంటలు ఉన్నారనీ, అది ఆయన వ్యక్తిగత ట్రిప్ అని చెప్పారు. ఆయనతో ఉన్న మహిళ వధువు స్నేహితురాలనీ, చైనీస్ అంబాసడర్ కాదనీ నిర్ధారించారు.
ఖాట్మండు పోస్ట్ సినియర్ జర్నలిస్ట్ అనిల్ గిరి 'వధువరులతో పాటు రాహుల్ పబ్ కి వెళ్లారనీ, ఆయనతో ఉన ఆవిడ వధువు స్నేహితురాలైన నెపాలీ మహిళ అనీ, ఖచ్చితంగా చైన అంబాసడర్ కాదనీ తెలిపారు.
https://www.opindia.com/2022/
దీంతో మనకు తెలుస్తోంది ఏమిటంటే, వైరల్ వీడియోలో రాహుల్ గాంధీ తో కనపడుతున్న మహిళ చైనీస్ అంబాసడర్ హౌ యాంకీ కాదనీ, వధువు నేపాలీ స్నేహితురాలు అనీ తెలుస్తోంది