Mon Nov 25 2024 23:44:07 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: టైమ్ మ్యాగజైన్ కవర్ పై ప్రధాని నరేంద్ర మోదీని హిట్లర్‌తో పోల్చలేదు..!
ప్రధాని నరేంద్ర మోదీని అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటోలో పోస్టు చేసినట్లుగా ఫోటో వైరల్‌గా మారింది. ఈ చిత్రం నకిలీదని మేము కనుగొన్నాము. TIME మ్యాగజైన్ కవర్ ఫోటో మార్ఫింగ్ వెర్షన్ అని తెలిసింది.
క్లెయిమ్: టైమ్ మ్యాగజైన్ కవర్ పై ప్రధాని నరేంద్ర మోదీని హిట్లర్‌తో పోల్చారా..?
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
ప్రధాని నరేంద్ర మోదీని అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటోలో పోస్టు చేసినట్లుగా ఫోటో వైరల్‌గా మారింది. ఈ చిత్రం నకిలీదని మేము కనుగొన్నాము. TIME మ్యాగజైన్ కవర్ ఫోటో మార్ఫింగ్ వెర్షన్ అని తెలిసింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హిట్లర్‌తో పోల్చిన ఇలాంటి చిత్రాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సమయంలో కూడా వైరల్‌గా మారాయని మా బృందం గుర్తించింది.
ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి షేర్ చేశారు. "Modi is a PM with no vision, no intellect & absolutely no desire to uplift the needy of the nation. All he has is, hunger to power! #ByeByeModi" అంటూ పోస్టు పెట్టారు.
టీఆర్ఎస్ మద్దతుదారులు ఫేస్బుక్, ట్విట్టర్లో #ByeByeModi హ్యాష్‌ట్యాగ్‌తో అదే చిత్రాన్ని షేర్ చేశారు.
మేము పాత కవర్ పేజీలు ఉండే ఆర్కైవ్ చేసిన పేజీ హోస్ట్ చేసే TIME వాల్ట్‌ని చూశాము. కవర్లు ఏవీ ఆన్లైన్లో వైరల్ అవుతున్న వాటితో సరిపోలలేదు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మా బృందం TIME Vault ను పరిశీలించింది. అందులో ప్రధాని నరేంద్ర మోదీని హిట్లర్ తో పోలుస్తూ ఎటువంటి మేగజైన్ కవర్ కూడా చూపించలేదు.మేము పాత కవర్ పేజీలు ఉండే ఆర్కైవ్ చేసిన పేజీ హోస్ట్ చేసే TIME వాల్ట్‌ని చూశాము. కవర్లు ఏవీ ఆన్లైన్లో వైరల్ అవుతున్న వాటితో సరిపోలలేదు.
మేము వైరల్ పోస్టులోని సంచిక పేరు, పేర్కొన్న తేదీలో టైమ్ మేగజైన్ పబ్లిష్ చేయలేదని గమనించాము.
వెల్ష్ డిజైనర్ పాట్రిక్ ముల్డర్, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముఖంపై అడాల్ఫ్ హిట్లర్ ముఖాన్ని చూపించే లాగా చేసిన ఆర్ట్‌వర్క్‌ను పంచుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు సహాయం చేయడానికి ముల్డర్ టైమ్ మ్యాగజైన్ స్పూఫ్ కవర్లను సృష్టించారు. టైమ్ మీడియా లోగోను ఉపయోగించి అటువంటిది క్రియేట్ చేసినట్లు వివరణాత్మక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
"I wanted to create something that added to the conversation around the invasion of Ukraine and captured the public mood" and added that it was intended to be a TIME cover but he felt 'a powerful image deserved a powerful frame.' అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
ఈ చిత్రాలను ట్విట్టర్ "మానిప్యులేటెడ్ మీడియా"గా గుర్తించింది.
టైమ్ మ్యాగజైన్ కవర్లో ప్రధాని మోదీని హిట్లర్‌తో పోలుస్తూ ఉన్న చిత్రం మార్ఫింగ్ చేయబడిందని మా బృందం గుర్తించింది.
క్లెయిమ్: టైమ్ మ్యాగజైన్ కవర్లో ప్రధాని మోదీని హిట్లర్‌తో పోలుస్తూ ప్రచురణ చేశారా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Time Magazine cover showing Hitler’s face juxtaposed over Modi’s picture
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story