Sun Dec 22 2024 22:55:02 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: డోనాల్డ్ ట్రంప్‌ను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా చూపుతున్న టైమ్ మ్యాగజైన్ కవర్ నిజమైనది కాదు
టైమ్ మ్యాగజైన్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. ఆ నెలలో ప్రభావవంతమైన వ్యక్తిని చూపించే ప్రత్యేకమైన కవర్ పేజీతో వచ్చే మాస పత్రిక. 1927 నుండి, టైమ్ మ్యాగజైన్ 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' ను ఎంపిక చేస్తోంది
Claim :
హత్యాయత్నంలో గాయపడిన డొనాల్డ్ ట్రంప్ ను టైమ్ మ్యాగజైన్ కవర్ పై 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' గా తెలిపారుFact :
వైరల్ ఇమేజ్ ను ఎడిట్ చేశారు. ఇలా నకిలీ టైమ్ మ్యాగజైన్ కవర్‌ను సృష్టించడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు
టైమ్ మ్యాగజైన్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. ఆ నెలలో ప్రభావవంతమైన వ్యక్తిని చూపించే ప్రత్యేకమైన కవర్ పేజీతో వచ్చే మాస పత్రిక. 1927 నుండి, టైమ్ మ్యాగజైన్ 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' ను ఎంపిక చేస్తోంది. గత 12 నెలల్లో ఎవరైతే వార్తల్లో ఎక్కువగా నిలిచి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా నిలుస్తారో ఆ వ్యక్తికి మ్యాగజైన్ 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఇస్తుంది.
ఇదిలా ఉంటే, టైమ్ మ్యాగజైన్ కవర్‌పై ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అనే క్యాప్షన్‌తో ఉన్న టైమ్ మ్యాగజైన్ కవర్‌పై చెవికి కట్టు కట్టుకుని ఉన్న ట్రంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీలో మాట్లాడుతుండగా హత్యాయత్నానికి గురై అతని చెవి పైభాగంలో బుల్లెట్ దూసుకుపోవడంతో ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని శోభా డేతో సహా పలువురు వ్యక్తులు "బ్రిలియంట్" అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. టైమ్ మ్యాగజైన్ ఇలాంటి వైరల్ చిత్రాన్ని ప్రచురించలేదు.
ముందుగా.. వైరల్ ఇమేజ్‌పై తేదీ ప్రచురించబడలేదు. మేము టైమ్ మ్యాగజైన్ వాల్ట్‌లో.. టైమ్ మ్యాగజైన్ కవర్ల కోసం సెర్చ్ చేశాం.. మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌ను కలిగి ఉన్న జూలై 15 కవర్‌ను మేము కనుగొన్నాము.
1927 సంవత్సరం నుండి ప్రచురించబడిన అన్ని టైమ్ మ్యాగజైన్ కవర్లకు సంబంధించిన లింక్ ఇందులో ఉంది.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి సంబంధించిన సంఘటన ఆగస్ట్ 5, 2024న ప్రచురించబడే టైమ్ కవర్ పేజీలో ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే, ఈ కవర్ చిత్రం వైరల్ చిత్రంతో సరిపోలడం లేదు. మేము మ్యాన్ ఆఫ్ ది ఇయర్ లేదా పర్సన్ ఆఫ్ ది ఇయర్ కోసం సెర్చ్ చేసినప్పుడు.. పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2023 గా టేలర్ స్విఫ్ట్ ఎంపికైందని మేము కనుగొన్నాము. 2024 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని ఇంకా ప్రకటించలేదు.
టైమ్ ప్రచురించిన కథనం ప్రకారం.. చాలా నకిలీ కవర్ల లోగోలను తప్పుగా ఎడిట్ చేస్తూ వస్తున్నారు. వైరల్ ఇమేజ్ లో చాలా నిలువుగా ఉంది. లోగో పూర్తిగా వేరే ఫాంట్లో ఉంది. చాలా నకిలీ కవర్లలో ఎరుపు రంగు అంచు ఉంటుంది, అయితే వైరల్ చిత్రంలో ఎరుపును వేరు చేసే సన్నని తెల్లటి అంచు కనిపించలేదు.
మేము నకిలీ టైమ్ మ్యాగజైన్ కవర్లను సృష్టించే కప్వింగ్ అనే ఆన్లైన్ సాధనాన్ని కూడా కనుగొన్నాము. ఈ టెంప్లేట్లో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరినైనా చూపించవచ్చు.
టైమ్ ప్రచురించిన కథనం ప్రకారం.. చాలా నకిలీ కవర్ల లోగోలను తప్పుగా ఎడిట్ చేస్తూ వస్తున్నారు. వైరల్ ఇమేజ్ లో చాలా నిలువుగా ఉంది. లోగో పూర్తిగా వేరే ఫాంట్లో ఉంది. చాలా నకిలీ కవర్లలో ఎరుపు రంగు అంచు ఉంటుంది, అయితే వైరల్ చిత్రంలో ఎరుపును వేరు చేసే సన్నని తెల్లటి అంచు కనిపించలేదు.
మేము నకిలీ టైమ్ మ్యాగజైన్ కవర్లను సృష్టించే కప్వింగ్ అనే ఆన్లైన్ సాధనాన్ని కూడా కనుగొన్నాము. ఈ టెంప్లేట్లో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరినైనా చూపించవచ్చు.
డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత టైమ్ మ్యాగజైన్ కవర్‌తో వైరల్ అవుతున్న చిత్రం ఎడిట్ చేసింది. ఇది Kapwing అనే సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి రూపొందించారు. ఈ టెంప్లేట్‌ని ఉపయోగించి.. ఎవరైనా టైమ్ కవర్ మ్యాగజైన్‌ని ఎవరినైనా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పేర్కొనవచ్చు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : హత్యాయత్నంలో గాయపడిన డొనాల్డ్ ట్రంప్ ను టైమ్ మ్యాగజైన్ కవర్ పై 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' గా తెలిపారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story