Sat Nov 23 2024 08:31:27 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల ఆలయానికి భక్తులు విరాళాలు ఇవ్వకూడదని టీటీడీ ప్రధాన అర్చకులు కోరారా..?
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు ఇటీవల భక్తులను ఆలయ హుండీలకు విరాళాలు ఇవ్వవద్దని కోరినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది.
క్లెయిమ్: తిరుమల ఆలయానికి భక్తులు విరాళాలు ఇవ్వకూడదని టీటీడీ ప్రధాన అర్చకులు కోరారా
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు ఇటీవల భక్తులను ఆలయ హుండీలకు విరాళాలు ఇవ్వవద్దని కోరినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల ఆలయ ఆదాయాన్ని రాష్ట్రంలోని క్రైస్తవ, ముస్లిం వర్గాల సంక్షేమం కోసం దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాన అర్చకుడు ఆరోపించినట్లు ఈ పోస్ట్ లో ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు ఇటీవల భక్తులను ఆలయ హుండీలకు విరాళాలు ఇవ్వవద్దని కోరినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల ఆలయ ఆదాయాన్ని రాష్ట్రంలోని క్రైస్తవ, ముస్లిం వర్గాల సంక్షేమం కోసం దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాన అర్చకుడు ఆరోపించినట్లు ఈ పోస్ట్ లో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఫోటోలో కనిపిస్తున్న ఆయన.. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు. తిరుమల ఆలయ హుండీ ఆదాయం వినియోగంపై రమణ దీక్షితులు ఇలాంటి ప్రకటనలు ఏమైనా చేశారా అని మీడియాలో వెతికాము.. తిరుమల ఆలయ హుండీ ఆదాయం వినియోగంపై రమణ దీక్షితులు మార్చి 2019లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు తెలిసింది. ఆలయ ఆదాయాన్ని వినియోగించుకోవడంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆలయ హుండీ ఆదాయంలో 95% ప్రభుత్వమే వినియోగిస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు.హుండీ ఆదాయంలో ఒక్క రూపాయి కూడా వెంకటేశ్వర స్వామి సేవకు వినియోగించడం లేదని ఆరోపించడమే కాకుండా.. తిరుమల ఆలయ హుండీకి భక్తులు డబ్బులు ఇవ్వవద్దని రమణ దీక్షితులు ఇంటర్వ్యూలో కోరారు. రమణ దీక్షితులు మాట్లాడుతూ.. ''ఏ ఆలయ హుండీలో కూడా ఒక్క రూపాయి కూడా విరాళంగా ఇవ్వవద్దని భక్తులందరినీ కోరుతున్నాను. తిరుమల దేవస్థానానికి ప్రతిరోజూ దాదాపు 2.5 నుంచి 3 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, అయితే శ్రీవారి సేవకు ఒక్క రూపాయి కూడా వినియోగించలేదన్నారు. స్వామివారి సేవకు అవసరమైన అన్ని సరుకులు దాతలచే అందించబడతాయి. ఆలయ హుండీ ఆదాయాన్ని ఉద్యోగుల జీతాలకు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కు, ఇంజినీరింగ్ విభాగానికి, కాంట్రాక్టర్లకు ఆదాయాన్ని సమకూర్చేందుకు వినియోగిస్తుంటారు. కాబట్టి, ఆలయ హుండీకి డబ్బు ఇవ్వవద్దని భక్తులందరినీ కోరుతున్నాను. భక్తులు ప్రత్యక్ష సేవలో పాల్గొనాలని, తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలకు డబ్బును విరాళంగా ఇవ్వాలని కోరారు. అలా చేయడం ద్వారా పేద అర్చకుల జీతాలు, ఆలయానికి అవసరమైన వస్తువులను ఉపయోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు.. 2019 మార్చిలో రమణ దీక్షితులు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2021లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా తిరిగి ఎన్నికయ్యే ముందు రమణ దీక్షితులు తిరుమల ఆలయ అధికారులపై అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల, 'ది క్వింట్' ఫ్యాక్ట్-చెక్ టీమ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వైరల్ సందేశానికి సంబంధించి స్పష్టత కోసం రమణ దీక్షితులుని సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ, "విరాళం డబ్బు సద్వినియోగం అయ్యేలా చూడడం ప్రధాన అర్చకుడిగా నా బాధ్యత. నా అభిప్రాయం ప్రకారం, జీతాల పంపిణీ, కమిటీల ఏర్పాటు లేదా నిర్మాణం మంచి ఉపయోగం కాదు. అందుకే భక్తులను డబ్బు విరాళం ఇవ్వవద్దని కోరాను. ఆ డబ్బును ముస్లింలకు, క్రైస్తవులకు లేదా మరెవరికీ ఉపయోగిస్తున్నారని నేను ఎప్పుడూ చెప్పలేదు. నా ప్రకటనను తప్పుగా చిత్రీకరిస్తున్నారు". అని క్లారిటీ ఇచ్చారు రమణ దీక్షితులు. రమణ దీక్షితులకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. అందులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎలాంటి ఆరోపణలు కూడా చేయలేదు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించేవే..!
క్లెయిమ్: తిరుమల ఆలయానికి భక్తులు విరాళాలు ఇవ్వకూడదని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కోరారు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, కొన్ని మీడియా సంస్థలు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Tirumala Temple Chief Priest accused YS Jagan Mohan Reddy of utilising the temple income for the welfare of Christian and Muslim communities in the state.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story