Tue Jan 07 2025 04:07:24 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: టాలీవుడ్ నటీనటులు 2024 ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీలకు మద్ధతు ఇవ్వలేదు
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తీ అయింది. సీఈవో ముఖేష్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్ నమోదైందనీ, ఇందులో ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదుకాగా,
Claim :
తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులు, దర్శకులు వైఎస్సార్సీపీకి మద్దతు పలికారుFact :
అలాంటి ప్రకటనలు ఏ నటీనటులు చేయలేదు. వైరల్ చిత్రాలు ఎడిట్ చేసినవి.. మోసం చేసే ఉద్దేశ్యంతో సృష్టించారు
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తీ అయింది. సీఈవో ముఖేష్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్ నమోదైందనీ, ఇందులో ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదుకాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతంగా ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నంలో అత్యల్పంగా 68.63 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శిలో 90.91 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32 శాతం నమోదైందని ముఖేష్ కుమార్ తెలిపారు.
ఎన్నికల కౌంటింగ్ కు ముందు ఎన్నో ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సూర్య, ప్రభాస్ మొదలైన టాలీవుడ్ హీరోల చిత్రాలతో వైసీపీకి మద్దతు ఇచ్చే విభిన్న సందేశాలతో పోస్టులు షేర్ చేశారు.
VOTE FOR FAN
"నేను గుంటూరు కారం సినిమా కోసం గుంటూరు మిర్చి రైతులను చాలాసార్లు కలిశాను. వారంతా సంక్షేమ పథకాల వల్ల చాలా ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాం అని చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. కానీ రాజకీయంగా ఒక్క వ్యక్తిని ఓడించాలని టీడీపీ వారు బీజేపీతో కలిసి రైతులకు సమయానికి అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఆపించేసారని తెలిసింది. రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది, అందరూ వైఎస్సార్సీపీకే ఓటు వేయండి మరియు మన రైతన్నలను కాపాడుకోండి.”-MAHESH BABU – ACTOR
జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద కూడా పోస్టు వైరల్ అయింది. “మా నాన్నగారి మరణానతరం నేను రాజకీయాలకు దూరంగా వుంటున్నాను. కానీ, సొంత రాజకీయ లబ్ధి కోసం ఆర్థికంగా వెనకబడి వున్న ముస్లిం మైనారిటీల 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామంటున్న బీజేపీతో కలసి ముస్లిం మైనారిటీలకు ద్రోహం చేయడం సరికాదు. దీనివల్ల ఎస్సా్ర్‌సీపీ గెలుపు అనేది దాదాపు ఖాయం అయినట్టే”
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అయిన పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రాలను ఎడిట్ చేశారు. సినీ ప్రముఖులు వైసీపీని సమర్థిస్తూ ఎలాంటి ప్రకటనలను పంచుకోలేదు.
ఈ ప్రకటనల గురించి ఆన్లైన్లో నివేదికల కోసం శోధించగా.. వైరల్ పోస్టులలోని సమాచారాన్ని ప్రామాణీకరించే వార్తల నివేదికలు ఏవీ మాకు కనిపించలేదు. ప్రభాస్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా.. ఆయన ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు మాకు ఎటువంటి పోస్ట్‌లు కనుగొనలేకపోయాము.
ఆయన సోషల్ మీడియా ఖాతాలలోని పోస్టులను మీరు కూడా గమనించవచ్చు.
నటుడు సూర్య ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎలాంటి పొలిటికల్ పోస్ట్ కూడా కనిపించలేదు. ఆయన పోస్ట్ చేసిన తాజా ఫోటో తన కొత్త సినిమా పోస్టర్ మాత్రమే.
జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను సెర్చ్ చేయగా.. అలాంటి స్టేట్మెంట్లు మాకు కనిపించలేదు.
టాలీవుడ్ హీరో మహేష్ బాబు సోషల్ మీడియా ఖాతాలను కూడా తనిఖీ చేయగా.. ఏ రాజకీయ పార్టీకి కూడా మద్దతు ఇస్తున్నట్లు ఎలాంటి పోస్ట్‌లు కనిపించలేదు. ఒక ఇన్స్టాగ్రాం పోస్ట్ లో, ఆయన బూటకపు ఇన్వెస్ట్ మెంట్ స్కీముల బారిన పడకుండా జాగ్రత్త పడమంటూ చెప్పడం మనం గమనించవచ్చు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పలువురు సినీ ప్రముఖులు వైసీపీకి మద్దతు ఇచ్చారనే వాదన అబద్ధం. వైరల్ చేసిన చిత్రాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశించినవి.
Claim : తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులు, దర్శకులు వైఎస్సార్సీపీకి మద్దతు పలికారు
Claimed By : Instagram User
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Instagram
Fact Check : False
Next Story