Fri Nov 22 2024 23:05:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: చెన్నైలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఫోటోను డిస్ప్లే చేయడం లేదు
చెన్నై నగరం అంతటా 30 స్పీడ్ రాడార్ గన్లను ఇటీవల అమర్చారు. అయితే ట్రాఫిక్ ఉల్లంఘలనకు పాల్పడే ముఖాలు చూపిస్తాయంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
చెన్నై నగరం అంతటా 30 స్పీడ్ రాడార్ గన్లను ఇటీవల అమర్చారు. అయితే ట్రాఫిక్ ఉల్లంఘలనకు పాల్పడే ముఖాలు చూపిస్తాయంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి ముఖాలను ప్రదర్శించే స్క్రీన్‌ను ట్రాఫిక్ సిగ్నల్‌కు ఉంచారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
ఈ వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ వినియోగదారులు “మీరు చెన్నైలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా చెల్లించడం మాత్రమే కాకుండా.. మీ ముఖాన్ని కూడా బహిరంగంగా చూపెడతారు. చెన్నైలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీరు తప్పకుండా అవమానభారం మోయాల్సి ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.
ట్విటర్లో మరో వినియోగదారుడు, “చెన్నైలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చేసిన వ్యక్తుల ముఖాలను పబ్లిక్‌గా ప్రదర్శిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినవారు తాము చేసిన తప్పులకు తప్పకుండా సిగ్గుపడతారు.” అంటూ పోస్టు పెట్టారు.
ట్విటర్లో మరో వినియోగదారుడు, “చెన్నైలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చేసిన వ్యక్తుల ముఖాలను పబ్లిక్‌గా ప్రదర్శిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినవారు తాము చేసిన తప్పులకు తప్పకుండా సిగ్గుపడతారు.” అంటూ పోస్టు పెట్టారు.
“Curly Tales” అనే వెబ్ సైట్ కూడా ఇందుకు సంబంధించి ఓ ఆర్టికల్ ను కూడా రాసింది. ఇది నిజంగా చోటు చేసుకుందంటూ కథనాలు రాశారు. ఒక వ్యక్తిని మోహరించడానికి బదులుగా, వాహనాల కదలికను ట్రాక్ చేయడానికి కెమెరాలు, స్పీడ్ సెన్సార్లను ఉపయోగించడాన్ని చెన్నై ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించలేదని చెప్పడానికి వీడియో ప్రూఫ్ కూడా ఉండడంతో ఫైన్ కూడా వేయడానికి సాధ్యపడుతుంది. ఎంత జరిమానా విధించారు, వాహనాల వివరాలు, ఉల్లంఘనకు పాల్పడ్డ వ్యక్తుల ముఖం కూడా పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శిస్తారని అందులో తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము వైరల్ వీడియోకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ట్విట్టర్లో ఈ నెల ప్రారంభంలో పోస్ట్ చేసిన వీడియోని కనుగొన్నాము. ఈ వీడియో కంప్యూటర్-జెనరేటెడ్ ఇమేజ్ (CGI) కాన్సెప్ట్ అని క్యాప్షన్ ద్వారా తెలుసుకున్నాం. ఇన్స్టాగ్రామ్ ఖాతా “Riggedindian” నుండి తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు.దీన్ని హింట్ గా తీసుకుని ఇంస్టాగ్రామ్ లో “Riggedindian” అకౌంట్ ను వెతికాం. అందులో ఈ వీడియో ఉంది. ఈ వీడియో కింద సీజీఐ తో సృష్టించామని స్పష్టంగా తెలిపారు. “This video is a concept video. Signal tracker in Chennai to avoid traffic rules violations. This is a cgi concept video.” ఈ వీడియోను సీజీఐ ద్వారా రూపొందించారని స్పష్టంగా తెలిపారు.
ఈ అకౌంట్ లో అనేక సీజీఐ వీడియోలను మేము గుర్తించాం. మెరీనా బీచ్ సమీపంలో ఆకాశంలో తేలుతున్న హాట్ ఎయిర్ బెలూన్ల వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియో కూడా CGIని ఉపయోగించి సృష్టించామని పేర్కొన్నారు.
మరొక CGI వీడియోలో విద్యుత్ సరఫరా కోసం మెరీనా బీచ్‌లో ఏర్పాటు చేయబడిన విండ్మిల్లను చూపిస్తుంది.
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి ముఖాలు సిగ్నల్ వద్ద స్క్రీన్‌పై ప్రదర్శింస్తారని చెబుతున్న వీడియోలు ఒరిజినల్ కావు.. ఈ వీడియోలు CGI ద్వారా సృష్టించారు. సోషల్ మీడియాలో తప్పుడు వాదనతో షేర్ చేసినట్లు తెలుస్తోంది.
Claim : Greater Chennai Traffic Police has attached a screen to the traffic signal that would display the faces of those violating traffic rules.
Claimed By : Twitter Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Twitter
Fact Check : False
Next Story