ఒమన్ బీచ్ ప్రమాదానికి సంబంధించిన విషాద వీడియో ముంబై బీచ్ లో జరిగినట్టు షేర్ చేయబడుతోంది
సొషల్ మీడియా లో వైరల్ గా మారిన వీడియో అబద్దపు ప్రచారం తో షేర్ చేయబడుతోంది. ముంబయి బాంద్రా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటూ అశ్రద్దగా ఉన్న ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారని వైరల్ వీడియో తో షేర్ అవుతున్న క్లెయిమ్ పేర్కొంది.
సొషల్ మీడియా లో వైరల్ గా మారిన వీడియో అబద్దపు ప్రచారం తో షేర్ చేయబడుతోంది. ముంబయి బాంద్రా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటూ అశ్రద్దగా ఉన్న ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారని వైరల్ వీడియో తో షేర్ అవుతున్న క్లెయిమ్ పేర్కొంది.
హిందీ లో ఉన్న క్లెయిం ఇలా ఉంది" मुंबई में बांद्रा समुद्र तट पर लहरों के साथ खिलवाड़ पर करना पड़ा दो महिलाओं को भारी ऊंची लहरें बहा ले गई 2 महिलाओं को लहरों की ताकत को कम आंकना लील गया जिंदगी*
सावधान:-- कभी भी कहीं भी हवा, पानी, और आग से खिलवाड़ नहीं करना चाहिये"
తర్జుమా చేయగా – "ముంబైలోని బాంద్రా బీచ్‌లో ఇద్దరు మహిళలు సెల్ఫీ మోజులో పడి అలలను పట్టించుకోకుండా నీటిలో కొట్టుకుపోయారు. జీవితం తరంగాల శక్తిని తక్కువగా అంచనా వేసారు వారు* జాగ్రత్త :-- గాలి, నీరు మరియు అగ్నితో ఎక్కడా చెలగాటాలు ఆడకండి"
https://www.facebook.com/GrameenNewsIndia/videos/1255919218478611
"అలీబాగ్. ముంబైకి సమీపంలో. సెల్ఫీ మోజు లో.. నీళ్ల వైపు వెన్ను చూపుతూ.. ఈ అమ్మాయిలు. నీటి పట్ల జాగ్రత్తగా ఉండండి, ప్రవాహాలు, చిన్న నీటి కుంటలు కూడా మీ ప్రాణాలను తీయవచ్చు. ఈ వీడియో ను పంచుకోండి, ముఖ్యంగా యువకులతో.. పిక్నిక్ల సమయంలో చాలా మంది స్నేహితులు మునిగిపోయారు. " అంటూ ఇంగ్లీషులో కూడా ఈ క్లెయిం షేర్ చేసారు.
https://www.facebook.com/suds10/videos/433141495186827
నిజ నిర్ధారణ:
ముంబైలోని బాంద్రా బీచ్‌లో జరిగిన సంఘటనను వైరల్ వీడియో చూపిస్తోందన్న వాదన అవాస్తవం. ఈ వీడియో ఒమన్ లోని అల్ ముగ్‌సైల్ బీచ్‌లో జరిగిన దుర్ఘటన ను చూపుతోంది.
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లతో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, వైరల్ వీడియోలో కనిపించే సంఘటన ఒమన్‌కు చెందినదని తెలుస్తోంది.
గల్ఫ్ న్యూస్.కాం ప్రకారం, ఒమన్‌లోని ధోఫర్ గవర్నరేట్‌లోని అల్ ముగ్‌సైల్ ప్రాంతంలో ఎనిమిది మంది సభ్యుల కుటుంబం బలమైన అలల వల్ల కొట్టుకుపోయింది. వారిలో ముగ్గురిని మాత్రమే రక్షించగలిగామని, మిగిలిన ఐదుగురి కోసం వెతుకుతున్నామని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది.
ధోఫర్ గవర్నరేట్‌లోని అల్ ముగ్‌సైల్ బీచ్‌లో కుటుంబం సరదాగా గడుపుతున్న సమయంలో బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయారని ఆయన సిడిఎఎ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అలల కారణంగా కుటుంబం కొట్టుకుపోతున్న ఘడియలు ఈ విడియో చూపిస్తుంది. అల్ ముగ్‌సైల్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు కుటుంబ సభ్యుల కోసం కూడా వెతుకుతున్నట్లు రాయల్ ఒమానీ పోలీసులు తెలిపారు.
మరొక నివేదిక ప్రకారం, ఈ సంఘటన జూలై 10, 2022న జరిగింది. అదే రోజున, ముగ్గురు బాధితులను రక్షించారు. మరో 2 మృతదేహాలు లభ్యం కాగా, మిగిలిన వారు ఇంకా లభ్యం కాలేదు.
https://www.perild.com/2022/07/13/in-oman-eight-people-were-washed-away-by-a-wave-into-the-sea/
గల్ఫ్ డైలీ న్యూస్ తన ట్విట్టర్ ఖాతాలో వైరల్ వీడియోను ట్వీట్ చేసింది "రాయల్ ఒమన్ పోలీసులు బలమైన ప్రవాహాల కారణంగా సముద్రంలో కొట్టుకుపోయిన ఎనిమిది మంది కుటుంబానికి చెందిన ముగ్గురు తప్పిపోయిన సభ్యుల కోసం మంగళవారం వెతకడం కొనసాగించారు. https://bit.ly/3P0E1Gu, #Oman #GCC #GulfNews #GDNNews #GDNOnline"
"సురక్షిత లైన్ దాటి అలల తాకిడికి అల్-ముగ్సైల్లో ఆసియా కుటుంబం మునిగిపోయిన ప్రమాదం!" అనే శీర్షికతో వైరల్ వీడియోను షేర్ చేస్తూ వెదర్ ఒమన్ పేరుతో ట్విట్టర్ హ్యాండిల్ చేసిన మరో ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.
ముంబైలోని బాంద్రా బీచ్‌లో జరిగిన సంఘటనను చూపుతోంది అంటూ వైరల్ అయిన వీడియో వాస్తవానికి ఒమన్‌కు చెందినది, అక్కడ ఎత్తైన అలల కారణంగా 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కొట్టుకుపోయారు. అందువల్ల, ఈ క్లెయిం అవాస్తవం.