Mon Dec 23 2024 08:14:23 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సీనియర్ సిటిజన్లకు టీటీడీ ఒక్కరోజులో 2 దర్శన స్లాట్లను ప్రకటించలేదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.
Claim :
తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు ఒక రోజులో 2 ప్రత్యేక స్లాట్లను అందించనుంది.Fact :
ప్రస్తుతం, టీటీడీ సీనియర్ సిటిజన్లకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు 1 స్లాట్‌ను మాత్రమే అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల స్లాట్లను సవరించే ఉద్దేశం తమకు లేదని అధికారులు స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుపతి-తిరుమల పాలనను ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ట్రస్టులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, తిరుమలలోని సీనియర్ సిటిజన్ల కోసం TTD దర్శనం కోసం 2 ప్రత్యేక స్లాట్లను తీసుకుని వచ్చినట్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక సందేశం వైరల్ అవుతోంది. యాత్రికులకు ఉచితంగా సాంబార్, పెరుగు అన్నం కూడా అందిస్తారని సందేశం పేర్కొంది. రెండు లడ్డూలను 20 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఎక్కువ లడ్డూలు అవసరమైతే ఒక్కోదానికి 25 రూపాయలు అదనంగా చెల్లించాలని వైరల్ పోస్టుల్లో తెలిపారు.
‘సీనియర్ సిటిజన్లకు TTD నుంచి మంచి శుభ వార్త.
వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు,మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. మీరు ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్లో సమర్పించాలి. వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడి వైపు గోడకు రోడ్డు దాటుతుంది. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులో ఉంది. మీరు లోపల కూర్చున్నప్పుడు - వేడి సాంబార్ అన్నం మరియు పెరుగు అన్నం మరియు వేడి పాలు అందించ బడతాయి. ప్రతిదీ ఉచితం. మీరు రూ20/- చెల్లించి రెండు లడ్డూలను పొందుతారు. మరిన్ని లడ్డూల కోసం మీరు రూ. 25/- ప్రతి లడ్డూకి.టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి, కౌంటర్ కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది. దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయబడతాయి, ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ దర్శనం మాత్రమే అనుమతించ బడుతుంది. భగవంతుని దర్శనం తర్వాత మీరు 30 నిమిషాల్లోపు దర్శనం నుండి బయటకు రావచ్చు. హెల్ప్‌డెస్క్ తిరుమల 08772277777 ని సంప్రదించండి సమాచార వివరాలు: TTD.’
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాడినా ప్రజలను తప్పుదారి పట్టించేది. తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి ప్రకటన చేయలేదు.
మేము వైరల్ సందేశం నుండి పదాలను తీసుకుని Googleలో సెర్చ్ చేశాము.. సెప్టెంబర్ 2022లో వైరల్ పోస్టులోని పదాలతో TV9 వెబ్సైట్లో ప్రచురించబడిన కథనాన్ని మేము కనుగొన్నాము.
మరింత వెతకగా.. మాకు టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ లో కథనం కనిపించింది. అక్కడ సీనియర్ సిటిజన్లతో పాటు దివ్యాంగులు.. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం చేసుకోవచ్చని సూచించారు. కొన్ని మెడికల్ కేసెస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్లకు కూడా దర్శనం కల్పిస్తారు.
వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు దర్శన సౌకర్యాలకు సంబంధించి తప్పుడు, తప్పుదోవ పట్టించే వార్తలు వైరల్ అవుతున్నాయని.. వాటిని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తి చేసింది. మూడు నెలల ముందుగానే భక్తులకు టిక్కెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ప్రతిరోజూ దాదాపు 1,000 దర్శన టిక్కెట్లు జారీ చేయనున్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా పుకార్లను నమ్మవద్దని, సరైన సమాచారం కోసం TTD అధికారిక వెబ్సైట్ www.tirumala.org లేదా https://ttdevastanms.ap.gov లోకి లాగిన్ అవ్వాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
ది హిందూ కథనం ప్రకారం, టీటీడీ సీనియర్ సిటిజన్లకు ఆన్లైన్లో మాత్రమే టిక్కెట్లను జారీ చేస్తుంది. ప్రస్తుత బుకింగ్ కోటా లేదు. భక్తుల సౌకర్యార్థం, ఆన్లైన్ టిక్కెట్లను క్రమం తప్పకుండా ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తన వెబ్సైట్లో విడుదల చేస్తారు. ఆగస్టు వరకు ఈ కోటా అయిపోయింది.
సీనియర్ సిటిజన్లకు వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రెండు ప్రత్యేక స్లాట్లను తీసుకుని వచ్చారనే వాదన తప్పుదారి పట్టిస్తోంది. అధికారులు అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
Claim : తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు ఒక రోజులో 2 ప్రత్యేక స్లాట్లను అందించనుంది.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story