Thu Dec 26 2024 03:16:07 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వందే భారత్ ట్రైన్ దారి తప్పిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
మొదటి వందే భారత్ సెమీ హై-స్పీడ్ రైలు, ఢిల్లీ నుండి వారణాసికి 2019లో ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలో అత్యంత ప్రజాదరణ
Claim :
గోవాకు వెళ్లాల్సిన వందేభారత్ రైలు దారి తప్పి ముంబైలోని కళ్యాణ్ జంక్షన్‌కు చేరుకుందిFact :
సాంకేతిక సమస్య కారణంగా అధికారులు రైలును మరో ట్రాక్ పైకి మళ్లించారు.
మొదటి వందే భారత్ సెమీ హై-స్పీడ్ రైలు, ఢిల్లీ నుండి వారణాసికి 2019లో ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది. భారతదేశంలోని ఇతర రైళ్ల కంటే వేగంగా వెళుతుంది ఈ రైలు. ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ప్రయాణాన్ని మెరుగుపరుస్తుంది. రైలులో Wifi కనెక్టివిటీ, 32-అంగుళాల ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు, భారీ గాజు కిటికీలు మొదలైన అనేక సౌకర్యాలు, ఫీచర్లు ఉన్నాయి.
‘మేక్ ఇన్ ఇండియా’ విజయగాథకు ఇదొక గొప్ప ఉదాహరణ. ఇది ఆధునిక, సమర్థవంతమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం కోసం తీర్చిదిద్దారు. బ్రాడ్ గేజ్ (B.G.) విద్యుదీకరించిన నెట్వర్క్ ఉన్న రాష్ట్రాలను కలుపుతూ భారతీయ రైల్వేల మీదుగా మొత్తం 102 వందే భారత్ రైలు సేవలు (51 రైళ్లు) నడుస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్లలో ప్రయాణించడానికి సుమారు 31.84 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఈ కాలంలో వందే భారత్ రైళ్ల మొత్తం ఆక్యుపెన్సీ 96.62% గా ఉంది.
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ దారి తప్పిపోయిందని పేర్కొంటూ పోస్ట్‌లను పంచుకోవడం ప్రారంభించారు. గోవాకు కాకుండా కళ్యాణ్ జంక్షన్ కు చేరుకుందని ప్రచారం చేస్తున్నారు.
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ దారి తప్పిపోయిందని పేర్కొంటూ పోస్ట్‌లను పంచుకోవడం ప్రారంభించారు. గోవాకు కాకుండా కళ్యాణ్ జంక్షన్ కు చేరుకుందని ప్రచారం చేస్తున్నారు.
క్లెయిం కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. సాంకేతిక లోపంతో రైలును దారి మళ్లించారు.
వందే భారత్ రైలు గురించిన తాజా వార్తల కోసం మేము శోధించినప్పుడు, ముంబై డివిజన్, సెంట్రల్ రైల్వే విభాగం అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రచురించిన ఒక పోస్ట్ మాకు కనిపించింది. టెక్నీకల్ సమస్య కారణంగా రైలు దారి మళ్లించారని పేర్కొన్నారు. రైలు షెడ్యూల్డ్ స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై నుండి బయలుదేరింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్డ్ స్టేషన్ అంటే మడ్గావ్కు చేరుకుంది.
డెక్కన్ హెరాల్డ్ ప్రకారం, మహారాష్ట్రలోని థానే జిల్లాలోని దివా స్టేషన్లో సాంకేతిక లోపం కారణంగా CSMT-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు డిసెంబర్ 23, 2024న దాని సాధారణ మార్గం నుండి కాకుండా ఇతర మార్గంలో వెళ్ళింది. గోవాకు ప్రయాణం 90 నిమిషాలు ఆలస్యం అయింది. కొంకణ్ వెళ్లే రైళ్లు ఉపయోగించే దివా-పన్వేల్ రైల్వే లైన్లో పన్వెల్ స్టేషన్ వైపు వెళ్లడానికి బదులుగా, ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 6.10 గంటలకు కళ్యాణ్ మార్గంలో బయలుదేరింది.
సిఎస్ఎంటి-మడ్గావ్ రైలు ఉదయం 5.25 గంటలకు బయలుదేరి థానే స్టేషన్‌ను దాటి 6.10 గంటలకు దివా జంక్షన్లో సిగ్నల్ లోపం కారణంగా ఆగిందని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. వందే భారత్ వెనుక రెండు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైలు నిలిచిపోయాయి. "35 నిమిషాలు వేచి ఉన్నా, వందే భారత్ రైలు డౌన్ ఫాస్ట్ లైన్ (మూడవ లైన్) నుండి ఐదవ లైన్ ట్రాక్‌లను వెళ్లలేకపోయింది. అక్కడ నుండి కొంకణ్‌కు వెళ్లే రైళ్లు పన్వెల్ స్టేషన్‌కు వెళ్తాయి. కళ్యాణ్ మీదుగా మళ్లించటానికి రైలుకు అనుమతి ఇచ్చారు." అని సెంట్రల్ రైల్వే అధికారి తెలిపారు. అదనపు జాప్యాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరో అధికారి కూడా తెలిపారు.
గోవాకు వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దారి తప్పి కళ్యాణ్ జంక్షన్లో నిలిచిపోయిందనే వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. సాంకేతిక సమస్య కారణంగా రైలు దారి మళ్లించాల్సి వచ్చింది.

Claim : గోవాకు వెళ్లాల్సిన వందేభారత్ రైలు దారి తప్పి ముంబైలోని కళ్యాణ్ జంక్షన్‌కు చేరుకుంది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story