Thu Jan 09 2025 15:16:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కట్టలు కట్టలుగా భారత కరెన్సీ.. తప్పుడు కథనాలు వైరల్
భారత కరెన్సీని పోలిన రూ. 50, రూ. 200 నోట్లను కొంతమంది ముద్రిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. పాకిస్థాన్‌లో ఈ కరెన్సీ తయారు చేస్తూ ఉన్నారని.. ఆ దేశంలో చిన్న తరహా పరిశ్రమ ఇదని పేర్కొంటూ హిందీలో క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
భారత కరెన్సీని పోలిన రూ. 50, రూ. 200 నోట్లను కొంతమంది ముద్రిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. పాకిస్థాన్‌లో ఈ కరెన్సీ తయారు చేస్తూ ఉన్నారని.. ఆ దేశంలో చిన్న తరహా పరిశ్రమ ఇదని పేర్కొంటూ హిందీలో క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వీడియోలో ఉన్న వ్యక్తి నోట్లను కట్టలుగా పేర్చడం చూడవచ్చు. వీడియోలో ప్రింటింగ్ మెషీన్‌ను కూడా చూడవచ్చు. పాకిస్థాన్‌లో నకిలీ భారతీయ కరెన్సీని తయారు చేస్తున్నారని క్యాప్షన్ పేర్కొంది.
“Small-scale industry in Pakistan: इस वीडियो को सबको भेजो एक ने भी छोड़ दी तो वीडियो बनाने वाले का मिशन सार्थक न हुआ समझो ।“ అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఈ వీడియో 2018 లో కూడా అదే క్లెయిమ్‌తో వైరల్ అయినట్లు మేము కనుగొన్నాము.
వాట్సప్ లో కూడా ఈ వీడియో వైరల్ అయింది
ఫ్యాక్ట్ చెకింగ్:
పాకిస్థాన్‌లో నకిలీ కరెన్సీ తయారీకి సంబంధించిన వీడియో అంటూ వైరల్ అవుతున్న వాదన తప్పు. ఆ వీడియోలో తయారు చేసిన నోట్లను పిల్లలు ఆడుకోడానికి ఉపయోగిస్తారు.
జాగ్రత్తగా గమనించగా.. ఆ నోట్లపై హిందీలో “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” అని కాకుండా “భారతీయ చిల్డ్రన్స్ బ్యాంక్” అని ఉంది. అంతేకాకుండా ఇంగ్లీషులో “మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” అని కూడా ప్రింటింగ్ చేశారని మేము గమనించాము.

ఆ నోట్లపై ముద్రించిన అంకెలకు ముందు రూపాయి గుర్తు లేదు. అసలు నోట్లపై తప్పనిసరిగా రూపాయి గుర్తు ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్, డూప్లికేట్ కు మధ్య పోలిక ఉంది.. దాన్ని మీరు గమనించవచ్చు.
మేము ఢిల్లీ నుండి NDTV నివేదికను కనుగొన్నాము, అక్కడ ATM చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు మనోరంజన్ బ్యాంక్ ముద్రించిన రూ. 2,000 నోటును పంపిణీ చేసినట్లు గుర్తించాం.
టైమ్స్ ఆఫ్ ఇండియా మరొక నివేదికలో 2022 నవంబర్‌లో కోల్‌కతాలో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్ల గురించి నివేదించింది. ఈ నోట్లు గత ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
ఇలాంటి డమ్మీ నోట్లు Amazon వంటి ఇ-కామర్స్ సైట్లలో అమ్మకానికి ఉన్నాయి. పిల్లల ఆటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారని కూడా మేము కనుగొన్నాము.
అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ వీడియోపై తమ నివేదికలను ఇచ్చాయి.
https://newsmeter.in/does-the-video-really-belong-to-fake-indian-currency-producing-factory-from-pakistan/
https://hindi.boomlive.in/is-pakistan-printing-counterfeit-indian-currency-fact-check/?mibextid=Zxz2cZ
పాకిస్థాన్ లో నకిలీ భారత కరెన్సీని ప్రింటింగ్ చేస్తున్నారనే వాదనలో ఎటువంటి నిజం లేదు. ఇది పిల్లల ఆటల కోసం ఉపయోగించే డమ్మీ కరెన్సీ.
టైమ్స్ ఆఫ్ ఇండియా మరొక నివేదికలో 2022 నవంబర్‌లో కోల్‌కతాలో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్ల గురించి నివేదించింది. ఈ నోట్లు గత ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
ఇలాంటి డమ్మీ నోట్లు Amazon వంటి ఇ-కామర్స్ సైట్లలో అమ్మకానికి ఉన్నాయి. పిల్లల ఆటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారని కూడా మేము కనుగొన్నాము.
అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ వీడియోపై తమ నివేదికలను ఇచ్చాయి.
https://newsmeter.in/does-the-
https://hindi.boomlive.in/is-
పాకిస్థాన్ లో నకిలీ భారత కరెన్సీని ప్రింటింగ్ చేస్తున్నారనే వాదనలో ఎటువంటి నిజం లేదు. ఇది పిల్లల ఆటల కోసం ఉపయోగించే డమ్మీ కరెన్సీ.
Claim : Fake currency production in Pakistan
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story