Tue Jan 07 2025 06:53:05 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సంబల్ పూర్ కలెక్టర్ అనన్య దాస్ కు చెందిన డ్యాన్స్ వీడియో అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
"మేరే ఘర్ రామ్ ఆయే హై" అనే పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ ఒడిశాలోని సంబల్పూర్ కలెక్టర్- శ్రీమతి అనన్య దాస్ అనే వాదనతో వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
Claim :
సంబల్పూర్ కలెక్టర్ శ్రీమతి అనన్య దాస్ (IAS) కు సంబంధించిన డ్యాన్స్ వీడియోFact :
ఆ వీడియోలోని డ్యాన్సర్ మృదుల మహాజన్ అనే మహిళ. సంబల్పూర్ కలెక్టర్ అనన్య దాస్ కాదు.
"మేరే ఘర్ రామ్ ఆయే హై" అనే పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ ఒడిశాలోని సంబల్పూర్ కలెక్టర్- శ్రీమతి అనన్య దాస్ అనే వాదనతో వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది సంబల్పూర్ కలెక్టర్ కాదు.
“Sambalpur collector Mrs. Ananya Das dance video” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేశాం.
ఓ ఫేస్బుక్ పేజీలో “డ్యాన్స్ వీడియో: సంబల్పూర్ కలెక్టర్ శ్రీమతి అనన్య దాస్ (IAS) చేసిన అద్భుతమైన నృత్య ప్రదర్శన" అనే టైటిల్ తో అప్లోడ్ చేసిన వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ వీడియోపై సంబల్పూర్ కలెక్టర్ శ్రీమతి అనన్య దాస్ (IAS) స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ ట్వీట్ చేశారు. మంచి ప్రదర్శన చేశారు.. అయితే అందులో ఉన్నది నేను కాదు..జై శ్రీరామ్ అంటూ అనన్య దాస్ పోస్టుపెట్టారు.

మేము అనన్య దాస్ IAS ట్విట్టర్ ఖాతాను కూడా కనుగొన్నాము. తనది కాదనే క్యాప్షన్‌తో వైరల్ వీడియోను షేర్ చేశారు.
మేము వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఆ వీడియో మృదుల మహాజన్ అనే యూట్యూబ్ ఛానెల్‌కు చెందినదని మేము కనుగొన్నాము.
“Mere Ghar Ram easy dance Choreography #meregharramaayehain #easydancesteps #jubinnautiyal #ayodhya” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారని మేము గుర్తించాం. జనవరి 8, 2024న వీడియోను అప్లోడ్ చేశారు. మృదుల మహాజన్ డ్యాన్స్ చేశారనే వివరాలు అందులో మనం చూడొచ్చు.
అదే వీడియో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో కూడా అప్లోడ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సంబంధించిన చాలా విషయాలను, వీడియోలను పంచుకున్నారు. డ్యాన్స్ చేయడం, వంటలను వండడం తనకు ఇష్టమని తెలిపారు.

ఆమె అదే డ్రెస్‌లో మరో డ్యాన్స్ వీడియోను కూడా అప్లోడ్ చేశారు.
కాబట్టి, "మేరే ఘర్ రామ్ ఆయే హై" పాటకు సంబల్పూర్ కలెక్టర్ శ్రీమతి అనన్య దాస్ డ్యాన్స్ చేయలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : The video shows a dance performance by Sambalpur collector Mrs Ananya Das (IAS)
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story