ఫ్యాక్ట్ చెక్: తెలంగాణలో ముస్లింలకు మాత్రమే ఉచిత కార్ల పంపిణీ చేసారన్నది వాస్తవం కాదు
తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లింలను ప్రసన్నం చేసుకుని ఓట్లు దండుకునేందుకు రూ.12 వేల కోట్లు కొల్లగొట్టాడంటూ టీఎస్ఎంఎఫ్సీ
Claim :
తెలంగాణలో ముస్లిం మైనరిటీలకు మాత్రమే ఉచిత కార్ల పంపిణీ. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ముస్లిం సమాజానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది.Fact :
తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డ్రైవర్-కమ్-ఓనర్ పథకంలో భాగంగా అన్ని మైనారిటీ విభాగాల డ్రైవర్లకు కార్లను పంపిణీ చేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లింలను ప్రసన్నం చేసుకుని ఓట్లు దండుకునేందుకు రూ.12 వేల కోట్లు కొల్లగొట్టాడంటూ టీఎస్ఎంఎఫ్సీ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకొని కొత్త కార్ల పక్కన కొందరు వ్యక్తులు నిలబడి ఉన్న వీడియో విస్తృతంగా ప్రచారంలో ఉంది.
ఆంగ్లం లో క్లెయిం ఇలా ఉంది "Free Cars distribution only to Muslims? With taxpayers money? Less than 5% of Muslims pay any tax, property Tax, Electricity Bill, Water Bill. 80% Muslim shop owners don't even have GST Registration, no filing of GST returns, no payment of GST, and evasion of taxes. Telangana' CM KCR has plundered approx 12000 Cr to please Muslims for getting their votes. This is how Muslim vote bank politics is destroying our country. Some law should be in place to spend tax payers money only for development and NOT giving freebies"
అనువదించగా “ముస్లింలకు మాత్రమే ఉచిత కార్ల పంపిణీ? పన్ను చెల్లింపుదారుల సొమ్ముతోనా? ముస్లింలలో 5% కంటే తక్కువ మంది ఏదైనా పన్ను, ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లు లేదా నీటి బిల్లులను చెల్లిస్తారు. 80% ముస్లిం షాపు యజమానులకు జిఎసెట్ రిజిస్ట్రేషన్ కూడా లేదు, జిఎసెట్ రిటర్న్‌ల దాఖలు లేదు, జిఎసెట్ చెల్లింపు లేదు, పన్నుల ఎగవేత లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లింల ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు సుమారు 12000 కోట్లు దోచుకున్నారు. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు మన దేశాన్ని ఇలా నాశనం చేస్తున్నాయి.
పన్ను చెల్లింపుదారుల డబ్బును అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు చేయడానికి మరియు ఉచితాలు ఇవ్వకుండా ఉండటానికి కొన్ని చట్టం అమలులో ఉండాలి."
నిజ నిర్ధారణ:
వాదన తప్పుదారి పట్టించేది. తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేక మంది అర్హత కలిగిన మైనారిటీ డ్రైవర్లకు డ్రైవర్-కమ్-ఓనర్ పథకం కింద కార్లను పంపిణీ చేసింది.
వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అక్టోబర్ 5, 2023న నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ హైదరాబాద్‌లోని మైనారిటీలకు సబ్సిడీ కార్లను పంపిణీ చేసినట్లుగా కనుగొన్నాము.
సియాసత్.కాం ప్రకారం, ఆరామ్‌ఘర్‌లోని మెట్రో క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరియు ఇతర ప్రముఖులతో కలిసి వాహనాలను అందజేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఘంఛ్) డ్రైవర్‌గా జీవనోపాధి పొందాలనే ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఆరామ్గఢ్లోని మెట్రో క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, ఇతర ప్రముఖులతో కలిసి డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద ఎంపికైన 100 మంది లబ్ధిదారులకు కార్లను పంపిణీ చేసినట్టు తెలుపుతూ మంత్రి స్వయంగా X (ట్విట్టర్)లో చిత్రాలను షేర్ చేసారు
టిఎసెమెఫ్ సి వెబ్సైట్ ప్రకారం,ఉబర్ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన మారుతీ మోటార్స్ సహకారంతో మైనారిటీ డ్రైవర్లకు సాధికారత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం “డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మారుతీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా డ్రైవర్ల నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉబర్ ద్వారా ప్లేస్మెంట్ కోసం సహాయం మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాహనాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
దరఖాస్తులు ఆహ్వానించి, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు నాలుగు చక్రాల వాహనం కొనుగోలు కోసం ఆర్థిక సహాయం అందించేస్తారు అంటూ ఈ ప్రకటన తెలుపుతోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు సాయం అందిస్తామని వెబ్సైట్లో షేర్ చేసిన లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ టుడేలో ప్రచురించిన రిపోర్ట్ప్రకారం తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ () కార్యక్రమం కింద 106 మంది లబ్ధిదారులకు కార్లను అందించింది.
అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు మాత్రమే ఉచిత కార్లను అందించిందన్న వాదన తప్పుదారి పట్టించేది. వివిధ మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు.