ఫ్యాక్ట్ చెక్: వందలమంది భారీ ఫెన్స్ ను దాటుతున్న వీడియో అమెరికాకు చెందినది కాదు.. స్పెయిన్-మొరాకో సరిహద్దులోనిది..!
వందలమంది పెద్ద పెద్ద ఫెన్స్ లను దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
వందలమంది పెద్ద పెద్ద ఫెన్స్ లను దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
రెండు దేశాల మధ్య సరిహద్దుకు అవతలి వైపు నుండి వందలాది మంది ప్రజలు కంచె పైకి ఎక్కుతున్న వీడియో, ఇది యుఎస్ సరిహద్దులో చోటు చేసుకుందనే వాదనతో వైరల్‌గా షేర్ అవుతోంది. వీడియో క్లెయిమ్ చేస్తోంది: "US సరిహద్దు నుండి దూకుతున్నారని.. వాకింగ్ డెడ్ సిరీస్ లోని సన్నివేశం లాగా కనిపిస్తుంది." అని పోస్టులో చెప్పారు.
ఇటువైపు గార్డులు ఉండగానే ప్రజలు కంచె ఎక్కుతున్నట్లు వీడియోలో ఉంది.
ఈ వీడియో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమస్యను చూపుతుందని షేర్ చేస్తున్నారు. కారులో వెళుతున్న వ్యక్తులు అక్కడి పరిస్థితులను రికార్డు చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా ఈ ఘటన అమెరికా సరిహద్దులో చోటు చేసుకోలేదు. మొరాకో-స్పెయిన్ సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. మెలిలా నగరంలో ఈ వీడియోను రికార్డు చేశారు.
వీడియో నుండి సంగ్రహించబడిన కీ ఫ్రేమ్‌లను Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మార్చి 2022లో స్పానిష్ డిజిటల్ వార్తాపత్రిక La Gaceta de la iberosfera అనే ట్విట్టర్ హ్యాండిల్ లో అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. మెలిల్లాలోని కంచెపై నుండి 2,000 మందికి పైగా దూసుకుని వచ్చారు. వారి దాడిలో ముగ్గురు సివిల్ గార్డులు గాయపడ్డారని తెలిపారు. “At least three civil guards have been injured after the assault of more than 2,000 illegals on the fence of Melilla, the largest migratory avalanche of the year.” అంటూ పోస్టులో పరిశీలించారు.
క్యాప్షన్‌లో ఉంచిన లింక్ మార్చి 2, 2022న La Gaceta de la iberosfera ప్రచురించిన వార్తా కథనానికి దారితీసింది. 2000 కంటే ఎక్కువ మంది అక్రమ వలసదారులు మెలిల్లా కంచెపై దాడి చేశారని పేర్కొంది. భద్రతా దళాల ప్రకారం, 500 మందికి పైగా లోపలికి చొరబడగలిగారు.. ఈ ఘటనలో 16 మంది సివిల్ గార్డులు గాయపడ్డారు.
మూలాల ప్రకారం.. వలసదారులు హుక్స్, కర్రలు, స్క్రూలను ఉపయోగించి కంచె దాటడానికి ప్రయత్నించారు. అక్రమ వలసదారులను నిరోధించడానికి ప్రయత్నించిన మొరాకో భద్రతా దళాలపై రాళ్ళ దాడికి తెగబడ్డారు.
అల్‌జజీరా నివేదిక ప్రకారం, 2021 మే మధ్యలో, 10,000 మందికి పైగా ప్రజలు చిన్న చిన్న పడవలను ఉపయోగించి రావడమే కాకుండా, మరికొందరు ఏకంగా ఈదుకుంటూ వస్తూ స్పెయిన్ అధికారులకు చిక్కారు. ఈ వలసలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
జూన్ 2022లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది, వేలాది మంది వలసదారులు సరిహద్దును దాటడానికి ప్రయత్నించారు. ఈ వలసదారులను తిప్పికొట్టడానికి మొరాకో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఈ సంఘటనలో 23 మందికి పైగా వలసదారులు మరణించారు.
వైరల్ వీడియోలో ఉన్నది అమెరికా సరిహద్దు కాదు. మెలిల్లా నగరంలో మొరాకో-స్పెయిన్ మధ్య సరిహద్దును చూపుతుంది. ఇక్కడ వేలాది మంది ఆఫ్రికన్ వలసదారులు సంవత్సరాలుగా కంచెను దాటడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.