నిజ నిర్ధారణ: ఇటీవలి భూకంపం కారణంగా టర్కీలో భూమి పొరల్లో అగాధం ఏర్పడిందన్న వీడియో అబద్దం
దక్షిణ టర్కీ, వాయువ్య సిరియాలో 6.3 తీవ్రతతో సంభవించిన తాజా భూకంపం అనేక మందిని ఆశ్రయం లేకుండా చేసింది. సుమారు 40,000 మందికి పైగా మరణించారు.
దక్షిణ టర్కీ, వాయువ్య సిరియాలో 6.3 తీవ్రతతో సంభవించిన తాజా భూకంపం అనేక మందిని ఆశ్రయం లేకుండా చేసింది. సుమారు 40,000 మందికి పైగా మరణించారు.
ఫిబ్రవరి 20, 2023న హటే ప్రావిన్స్‌లో 6.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం డెఫ్నే పట్టణంలో, అంటాక్యా, అదానాలో సంభవించింది.
దీని తర్వాత, టర్కీలోని హటే ప్రావిన్స్‌లో భూమిలో అగాధం ఏర్పడినట్టు వీడియో చూపుతున్నారు. ఏరియల్ వ్యూ లో ఆధాన్ని చూపుతున్న ఈ వీడియో టర్కీలోని హాటే ప్రావిన్స్ ది అని ప్రచారం లో ఉంది.
నిజ నిర్ధారణ:
వైరల్ వీడియో టర్కీలోని హటేలో భూమిలో ఏర్పడిన అగాధాన్ని చూపుతుందనే వాదన అబద్దం. వీడియో చైనాది, టర్కీది కాదు.
మేము టర్కీలోని హటేలో భూకంపం కోసం వెతికినప్పుడు, వైరల్ వీడియోలోని విజువల్స్‌కు పూర్తి భిన్నమైన మరికొన్ని విజువల్స్ మాకు కనిపించాయి.
టర్కీలోని అంటక్యాలో విరిగిన భూమి క్రస్ట్ గురించి క్లెయిమ్ చేస్తూ వైరల్ వీడియో నుండి విజువల్స్ ఇక్కడ ఉన్నాయి.
వీడియో నుండి సంగ్రహించిన కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, అదే వీడియో జిహు, బిల్బిలి వంటి చైనీస్ వీడియో వెబ్సైట్లలో లభించింది.
వీడియో కూడా నవంబర్ 4, 2022న 亼亼影视 పేరుతో యూట్యూబ్ ఛానెల్లో "《平陆县大沟壑》
అనువదించబడినప్పుడు, ఇలా ఉంది: "పింగ్లూ కౌంటీలోని గ్రేట్ లోయ" మొత్తం మైదానంలో దాదాపు 10 కిలోమీటర్ల పొడవున్న అగాధం గీసారు. ఏ విధమైన శక్తి దానిని రెండు భాగాలుగా విభజిస్తుంది?"
గూగుల్ ఎర్త్‌లో పింగ్లూ కౌంటీ కోసం శోధించినప్పుడు, ఆ వీడియో చైనాకు చెందినదని తెలుస్తోంది. భూమి లో పగుళ్లు చాలా కాలంగా ఈ ప్రదేశంలో ఉన్నాయని, ఇది ఇటీవలి భూకంపం కారణంగా ఏర్పడలేదని మనం చూడవచ్చు.
అందువల్ల, ఇటీవలి భూకంపం కారణంగా టర్కీలోని హటేలో భూమి యొక్క క్రస్ట్ పగుళ్లను వీడియో చూపించలేదు. ఇది చైనాలోని పింగ్లూ కౌంటీకి చెందినది. క్లెయిం అవాస్తవం.