Mon Dec 23 2024 15:34:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఢిల్లీ విమానాశ్రయంలో జర్మనీ విదేశాంగ మంత్రికి అధికారికంగా స్వాగతం లభించలేదనేది నిజం కాదు
జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ 2 రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. ఆయన 2021లో ఛాన్సలర్ అయిన తర్వాత ఆయనకు మూడవ భారత
Claim :
2024లో జర్మనీ విదేశాంగ మంత్రి భారత్‌కు వచ్చినప్పుడు ఆమెకు అధికారిక స్వాగతం లభించలేదుFact :
వీడియోలో మంత్రి భారత్‌కు వచ్చినట్లు చూపించలేదు, అది మలేషియాలో చోటు చేసుకున్న ఘటన.
జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ 2 రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. ఆయన 2021లో ఛాన్సలర్ అయిన తర్వాత ఆయనకు మూడవ భారత పర్యటన. ఈ బృందంలో భాగంగా జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ కూడా భారతదేశాన్ని సందర్శించారు. అప్పుడు ఆమె గోథే-ఇన్స్టిట్యూట్ / మాక్స్ ముల్లర్ భవన్లో జర్మన్ విద్యార్ధులతో సమావేశమయ్యారు. జర్మనీలో నైపుణ్యం ఉన్న కార్మికుల అవసరం చాలా ఉందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు కలిసి పని చేసినప్పుడు అది యువతకు 'విన్-విన్-విన్' పరిస్థితిగా మారుతుందన్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్‌తో చర్చలు జరిపారు. చర్చలో వివిధ ప్రాంతీయ, ప్రపంచ విషయాలను చర్చించారు. జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ విమానం నుండి దిగి వచ్చాక, టార్మాక్‌పై ఆమెను స్వాగతించడానికి అధికారులు ఎవరూ లేకపోవడంతో ఆమె గందరగోళానికి గురవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ తర్వాత ఆమె వాహనాల వద్దకు వెళ్లారు.
ఆ వీడియో ఆమె భారతదేశానికి వచ్చినప్పుడు, టార్మాక్‌పై అధికారికంగా ఆమెను స్వాగతించడానికి ఎవరూ లేరనే వాదనతో షేర్ చేస్తున్నారు. "జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ భారతదేశానికి వచ్చినప్పుడు టార్మాక్‌పై అధికారిక స్వాగతం లభించకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు" అని వాదనలో ఉంది.
The same video is also in circulation on social media claiming that this incident happened in China.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. జనవరి 2024లో బేర్బాక్ మలేషియాకు వచ్చినప్పటి వీడియో ఇదని మేము గుర్తించాం.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, మలేషియాలో బేర్బాక్ రాకను వీడియో చూపుతుందని వివరిస్తూ జర్మన్ భాషలో X లో ఒక పోస్ట్ మాకు లభించింది. ప్రభుత్వ విమానం అనుకోకుండా విమానాశ్రయంలోని మరొక భాగంలో దిగవలసి వచ్చింది. స్వాగత ప్రతినిధి బృందానికి కనిపించలేదని, వారు కొన్ని మీటర్ల దూరంలో నిలబడి ఉన్నారని అందులో తెలిపారు.
జర్మనీ ఫెడరల్ ఫారిన్ ఆఫీస్ కు చెందిన పబ్లిక్ డిప్లమసీ ఇనిషియేటివ్ GIC ఆగ్నేయాసియా జనవరి 19, 2024న ప్రచురించిన సుదీర్ఘమైన వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియోలోని కొన్ని విజువల్స్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన వైరల్ వీడియోలోని విజువల్స్‌తో సరిపోలినట్లు మేము కనుగొన్నాము.
జనవరి 16, 2024న dw.com ప్రచురించిన కథనంలో మలేషియాలో విమానం దిగుతున్నప్పుడు బేర్బాక్ చిత్రాన్ని కూడా చూడొచ్చు.
రాయిటర్స్ ప్రచురించిన ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, వైరల్ వీడియో భారతదేశంలో లేదా చైనాలో తీసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవు. మలేషియాకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అని జర్మన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇమెయిల్‌లో తెలిపింది. "విమానాశ్రయంలో కమ్యూనికేషన్ లోపం కారణంగా, విమానం అనుకున్న చోటు కంటే భిన్నమైన పార్కింగ్ స్థానంలో నిలిపివేశారు, అయితే రిసీవింగ్ కమిటీ గతంలో షెడ్యూల్ చేసిన స్థలంలో ఉంది. అందువల్ల, రిసీవింగ్ కమిటీని కలవడానికి మంత్రి కొంత దూరం నడవాల్సి వచ్చింది." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి స్పష్టంగా చెప్పారు.
India today వైరల్ కథనంలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. కాబట్టి, భారతదేశంలో దిగిన తర్వాత జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ కు అధికారిక స్వాగతం లభించలేదనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో భారత్ కు చెందినది కాదు.
Claim : 2024లో జర్మనీ విదేశాంగ మంత్రి భారత్‌కు వచ్చినప్పుడు ఆమెకు అధికారిక స్వాగతం లభించలేదు
Claimed By : Twitter user
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story