Mon Dec 23 2024 11:38:32 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నడిరోడ్డుపై ఓ బాలుడు నమాజ్ చేస్తుండగా.. వాహనాలు ఆగిపోయిన ఘటన భారత్ లో చోటు చేసుకోలేదు
రోడ్డు మధ్యలో నమాజ్ చేస్తున్న ఓ బాలుడి వీడియో వైరల్ అవుతోంది. ఆ పిల్లాడు నమాజ్ చేస్తూ ఉండగా.. ట్రాఫిక్ నిలిచిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
రోడ్డు మధ్యలో నమాజ్ చేస్తున్న ఓ బాలుడి వీడియో వైరల్ అవుతోంది. ఆ పిల్లాడు నమాజ్ చేస్తూ ఉండగా.. ట్రాఫిక్ నిలిచిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. బాలుడు ప్రార్థన ముగిసే వరకు ఒక పోలీసు అతనికి కాపలాగా ఉండటం, ట్రాఫిక్‌ను ఆపడం వీడియోలో చూడవచ్చు. అతడు ప్రార్థనలు పూర్తి చేసిన తర్వాతే వాహనాలను ముందుకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు.“एक बच्चे के कारण पूरी ट्रैफिक का रूट बदल जाता है यह लोग संविधान को भी अपने तरीके से चलाते है बस कुछ टाइम और 30 से 40 % होने दो फिर देखो क्या क्या करते है अभी वक्त है हिंदुओ जागो छोटी छोटी चीजों पर धरना लगा कर बैठ जाते हो कभी आने वाली विकराल समस्या को भी जानने की कोशिश करो “ అంటూ హిందీలో పోస్టులు పెడుతున్నారు."కేవలం ఒక పిల్లాడి కారణంగా ట్రాఫిక్ ఉండే రూట్లను మార్చాల్సి వచ్చింది. ఇలాంటి వ్యక్తులు వారి స్వంత రాజ్యాంగాన్ని అమలు చేస్తారు. వారు 30-40% పెరిగితే వారు ఏమి చేస్తారో చూడండి. హిందువులను మేల్కొలపాల్సిన సమయం. రాబోయే పెద్ద సమస్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి" అని పోస్టుల ద్వారా తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ ఘటన భారత్ లో చోటు చేసుకుందంటూ వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు.. తారిఖ్ ఫతా అనే వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో “How does one country produce so many rectums? How does Pakistan do it?” అంటూ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియో నిడివి చాలా ఎక్కువగానే ఉంది. ఆ పిల్లాడు నమాజ్ పూర్తీ అయ్యేవరకూ కూడా ఎవరూ పక్క నుండి వెళ్లడానికి అనుమతులు ఇవ్వలేదు.ఈ వీడియోలో దుబాయ్ కి సంబంధించినదని.. భారతదేశానికి సంబంధించినది కాదని నిరూపించే కొన్ని ఆధారాలను మనం చూడవచ్చు.మేము సెక్యూరిటీ వ్యక్తి యూనిఫామ్‌ను గమనించాం. అతని చేతిపై ఒక బ్యాడ్జ్, షర్టు వెనుక అరబిక్ పదాలను మనం చూడవచ్చు- حراسة ఈ పదం అంటే గార్డు. మేము సారూప్య యూనిఫాంల కోసం శోధించగా.. దుబాయ్, UAE గురించిన కొన్ని వార్తా నివేదికలు చూశాం. అందులో వారు ఒకే రకమైన యూనిఫాం ధరించిన వ్యక్తుల చిత్రాలను చూపుతున్నట్లు మేము కనుగొన్నాము.
2015లో 'Arkan Security Solutions' అనే శీర్షికతో ఏజాదా అసెట్ మేనేజ్మెంట్ గ్రూప్ ప్రచురించిన YouTube వీడియోను మేము కనుగొన్నాము. ఇందులో ఒకే విధమైన యూనిఫాం ధరించిన వ్యక్తులు, వారి షర్టులపై ఒక బ్యాడ్జ్ ఉన్నట్లు చూపుతుంది.
మూడవది.. ఆ వీడియోలో వీధిలో ఒక డెలివరీ బాయ్ ను చూడవచ్చు. మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, తలాబత్ ఫుడ్ డెలివరీ పార్టనర్లను చూపుతున్న అలమీ స్టాక్ ఇమేజ్‌లను మేము కనుగొన్నాము.
నాల్గవది, వీడియో చివరలో, ఈ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసిన వ్యక్తి TikTok ఖాతా ని మేము కనుగొన్నాము. అది @ajom75uddin, మేము అదే IDతో అతని Facebook ఖాతాను కనుగొన్నాము. తన ప్రొఫైల్‌లో, అతను దుబాయ్ కు చెందిన వ్యక్తినని తెలిపాడు. ఈ సంఘటన వీడియో జనవరి 2023 లో అతను పోస్ట్ చేశాడు.
కాబట్టి, వైరల్ పోస్టుల్లో చెప్పినట్లుగా ఈ ఘటన భారత్ లో చోటు చేసుకోలేదు.
Claim : Boy performing namaz in middle of street in India
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story