Mon Dec 23 2024 02:08:31 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఒక హిందూ పూజారి ఒక మహిళను కొట్టిన వీడియో కుల, లింగ వివక్షకు సంబంధించినది కాదు
లింగం, కుల వివక్ష కారణంగా మహిళకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారనే వాదనతో హిందూ పూజారి ఒక మహిళ జుట్టు పట్టుకుని కొట్టడాన్ని చూపించే వీడియో ట్విట్టర్, ఫేస్బుక్లో షేర్ చేస్తున్నారు.
Claim :
తక్కువ కులానికి చెందిన మహిళ అని పూజారి కొడుతున్నాడుFact :
కోవిడ్ ఆంక్షల కారణంగా ఆలయాన్ని మూసివేయడంపై పూజారి, మహిళ మధ్య చోటు చేసుకున్న గొడవ ఇది.
లింగ, కుల వివక్ష కారణంగా హిందూ పూజారి హరిజన మహిళను కొట్టారని చెబుతూ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆ వాదనలో నిజం లేదు.
లింగం, కుల వివక్ష కారణంగా మహిళకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారనే వాదనతో హిందూ పూజారి ఒక మహిళ జుట్టు పట్టుకుని కొట్టడాన్ని చూపించే వీడియో ట్విట్టర్, ఫేస్బుక్లో షేర్ చేస్తున్నారు.
“Bolo #jaishriram. A Harijan woman who tried to enter a Hindu Temple was beaten up mercilessly by the head priest for being a woman of lower caste.” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆలయంలోకి మహిళను రానివ్వకుండా ఈ గొడవ చేశారని పోస్టులో చెబుతున్నారు.
ట్విట్టర్ లో కూడా ఇదే తరహా వాదనతో పోస్టులు పెడుతున్నారు. “A woman who tried to enter a Hindu Temple was beaten up mercilessly by the head priest for being: 1. A woman. 2. A woman of lower caste. Poor Hindus get a different kind of Parshad (Grace) from Hindu Temples… Sad. Very Sad.” అంటూ పోస్టు పెట్టారు. ఆ మహిళను కొట్టడానికి కారణాలు రెండు ఉన్నాయి.. ఒకటి ఆమె మహిళ అని.. రెండు ఆమె తక్కువ కులానికి చెందినది అని ఆ పోస్టుల్లో అర్థం ఉంది.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేసిన వీడియోలో మహిళ ముఖం అస్పష్టంగా ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు. ఈ వీడియో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నది కాదు. 2021 సంవత్సరంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2021లో ప్రచురించబడిన కొన్ని కథనాలలో వైరల్ వీడియో ఉందని మేము కనుగొన్నాము.
Bhaskar.com లో హిందీ క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను పోస్టు చేశారు. “दरभंगा में श्माया माई के मंदिर में महिला को पीटा:स्त्री ने कहा- मुझ पर देवी आती हैं, मंदिर का दरवाजा खोल; पुजारी ने पिटाई की- 'सारा माता आना छुड़ा दूंगा, माई तो अपने गांव गयीं'” అని అందులో ఉంది.
అనువదించినప్పుడు.. దర్భంగాలోని శ్యామా మయి ఆలయంలో స్త్రీని కొట్టారు. "నేను దేవతని, నాకు గుడి తెరవండి" అంటూ ఆమె చెబుతూ ఉండగా.. పూజారి ఆమెను కొట్టాడని ఉంది.
www.divyabhaskar.co.in లో కూడా వీడియోను పోస్టు చేశారు.
నవభారత్ టైమ్స్ ప్రకారం, దర్భంగాలో ఉన్న ప్రసిద్ధ మా శ్యామా ఆలయ ప్రవేశద్వారం వద్ద, ఆలయ పూజారి జుట్టు పట్టుకుని ఒక మహిళా భక్తురాలిని కొట్టారు. ఈ ఘటనను ఎవరో వీడియో రికార్డ్ చేయగా ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూజారి చర్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆలయ నిర్వాహకులు వెంటనే అతనిని ఉద్యోగం నుండి తొలగించారు.
కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా ఆలయం మూసివేసిన సమయంలో, బాధితురాలు ఆలయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. మహిళ బలవంతంగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పూజారి కోపంతో ఆమెను జుట్టు పట్టుకుని లాగాడు, ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.
పూజారి ఒక మహిళ జుట్టును పట్టుకుని కొట్టిన వీడియో పాతది. కుల, లింగ వివక్ష కారణంగా మహిళను గుడిలోకి అనుమతించకుండా కొట్టారని తప్పుడు వాదనతో వీడియో వైరల్ అవుతోంది. అందులో ఎటువంటి నిజం లేదు.

Claim : Hindu priest beats a Harijan (lower caste) woman because she belongs to a lower caste
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : Misleading
Next Story