Mon Dec 23 2024 11:23:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారత జెండా తలకిందులుగా ఉన్న బ్యానర్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినది కాదు
లోక్సభ ఎన్నికల రెండో దశ ఏప్రిల్ 26, 2024న జరగనుంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కర్ణాటకలోని చిత్రదుర్గ, బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లలో బహిరంగ సభలకు హాజరయ్యారు
Claim :
ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్ బ్యానర్లలో ప్రియాంక గాంధీ పాదాల దగ్గర తిరగబడ్డ భారత జెండాను చూపిస్తున్నాయి.Fact :
జబల్పూర్లో 2022లో ఈ బ్యానర్లను వేశారు, 2024 ఎన్నికలకు, బెంగళూరు నగరానికి ఎలాంటి సంబంధం లేదు.
లోక్సభ ఎన్నికల రెండో దశ ఏప్రిల్ 26, 2024న జరగనుంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కర్ణాటకలోని చిత్రదుర్గ, బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లలో బహిరంగ సభలకు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి పలు ర్యాలీలలో ప్రసంగించారు.
ప్రియాంక గాంధీ ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను చూపించే వీడియోను చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. ఆ బ్యానర్లలో ప్రియాంక గాంధీ పాదాల వద్ద తిరగబడ్డ భారత జాతీయ జెండాను చూపుతాయి. ప్రియాంక గాంధీ ర్యాలీకి ముందు బెంగళూరులో ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారని కన్నడ భాషలో ఒక ఆడియోను మనం వినవచ్చు. ఆ ఆడియోలో “ప్రియాంక గాంధీ బ్యానర్లో భారత జెండా తలకిందులుగా ఉంది. భారత జెండాను ఎలా చిత్రించాలో తెలియని వారు మన దేశాన్ని ఎలా పాలించగలరు?" అని చెబుతుండడం మనం వినవచ్చు.
“Upcoming Congress leader Priyanka Gandhi Vadra rally posters in Bengaluru show Indian flag upside down, with green on top, video goes viral” అనే క్యాప్షన్ తో వీడియోను వైరల్ చేస్తున్నారు. బెంగళూరులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ర్యాలీకి సంబంధించి ఏర్పాటు చేసిన పోస్టర్లలో భారత జాతీయ జెండాను తలకిందులుగా.. పైన ఆకుపచ్చ రంగు.. కింద కాషాయం ఉంది. ఈ వీడియో వైరల్గా మారిందనే వాదనతో పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఈ వీడియో 2023 సంవత్సరానికి చెందినది. 2023లో మధ్యప్రదేశ్లో ఈ బ్యానర్లు కనిపించాయి. ఈ వీడియోకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించినది కాదు.
మేము Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, జూన్ 2023లో పలువురు X (Twitter) యూజర్లు షేర్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము.
@kakar_harsha అనే అకౌంట్ లో ఇదే వీడియోను హిందీ ఆడియోతో షేర్ చేశారని మేము గుర్తించాం. హిందీ ఆడియోతో కూడిన వైరల్ వీడియోను జూన్ 12, 2023న పోస్టు చేశారు. గ్వారిఘాట్ రోడ్లోని బ్యానర్ల గురించి మాట్లాడుకోవడం అందులో మనం వినవచ్చు, “There are no comments from me. These are from a common Indian. @INCIndia @RahulGandhi @priyankagandhi please listen and act. There has to be legal action taken for this intentional error.” అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అందులో కోరారు.
@sukeshNakhua అంటూ మరో యూజర్ కాంగ్రెస్ పార్టీ కావాలనే త్రివర్ణ పతాకాన్ని అవమానించింది అంటూ పోస్టులు పెట్టారు. “Congress in Madhya Pradesh deliberately places the #Tiranga upside down in its poster !!! Whose order can it be to insult #Tiranga ??? Any guesses ???”. ఎవరు ఆర్డర్ ఇస్తే ఇలా చేశారు అంటూ విమర్శలు గుప్పించారు ఆ నెటిజన్.
దీన్ని క్యూగా తీసుకుని మేము కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. firstport.com లో ఇందుకు సంబంధించిన కథనాన్ని మేము గుర్తించాం. ‘In Madhya Pradesh, Congress insults national flag as posters of Priyanka Gandhi show tricolor upside down’ అంటూ ఓ కథనాన్ని అందులో ప్రచురించారు. కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ పతాకాన్ని అవమానించిందంటూ అందులో తెలిపారు. ఆ ఆర్టికల్ లో వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను మనం గుర్తించవచ్చు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని అమరవీరుల స్మారక స్థూపం గోల్బజార్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ జాతీయ జెండాను అవమానించారని Nai dunia.comలో హిందీ వార్తా కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. జెండా తిరగబడి కనిపించడంతో ఆ పార్టీ సీనియర్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వైరల్ వీడియో, పాత కథనాలలో కనిపించే స్క్రీన్షాట్ల మధ్య పోలిక ఇక్కడ ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వైరల్ వీడియో పాతది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల బెంగళూరులో చేసిన ప్రచారానికి సంబంధించినది కాదు. 2023లో జబల్పూర్ రోడ్లపై ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్ బ్యానర్లలో ప్రియాంక గాంధీ పాదాల దగ్గర తిరగబడ్డ భారత జెండాను చూపిస్తున్నాయి.
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story