Tue Dec 24 2024 13:06:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నిరసనకారులు ఇజ్రాయెల్ సరిహద్దులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఇప్పటిది కాదు.. 2021 సంవత్సరం నాటిది
ఇజ్రాయెల్, లెబనాన్ 81-కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటాయి. దక్షిణ భాగంలో ఇజ్రాయెల్ కమ్యూనిటీలను రక్షించడానికి 2018లో ఇజ్రాయెల్ తమ సరిహద్దు వద్ద 11 కిలోమీటర్ల
Claim :
ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో కంచె దూకి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు.Fact :
ఇది పాత వీడియో.. లెబనీస్ నిరాసనకారులు 2021లో బోర్డర్ ను దాటుతున్న వీడియో ఇది
ఇజ్రాయెల్, లెబనాన్ 81-కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటాయి. దక్షిణ భాగంలో ఇజ్రాయెల్ కమ్యూనిటీలను రక్షించడానికి 2018లో ఇజ్రాయెల్ తమ సరిహద్దు వద్ద 11 కిలోమీటర్ల కాంక్రీట్ గోడను నిర్మించింది. ఆ బోర్డర్ ను ఇజ్రాయెల్ భూభాగంలో నిర్మించారు.
గత కొన్ని రోజులుగా.. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చాలా మంది సాధారణ ప్రజల ప్రాణాలు పోయాయి. ఎంతో మంది ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఇటీవల.. వేలాది మంది నిరసనకారులు కంచె దాటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హమాస్ మద్దతుదారులు బోర్డర్ దాటినట్లు చూపిస్తుంది.
“आतंकी और उनके समर्थक बाड़ फांदकर इजरायली क्षेत्र में घुसने की कोशिश कर रहे हैं. #Israel - #Lebanon सीमा का दृश्य” అంటూ హిందీలో పోస్టులు పెడుతున్నారు.
తీవ్రవాదులు, వారి అనుచరులు.. బోర్డర్ ను దాటి ఇజ్రాయెల్ లోకి ప్రవేశించాలని భావిస్తూ ఉన్నారన్నది వైరల్ పోస్టుల సారాంశం.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో 2021 నాటిది.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను సెర్చ్ చేశాం. మే 16, 2021న ట్విట్టర్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోని మేము కనుగొన్నాము. వీడియోలో టైటిల్ “Attack on Titan Attack on Israel. Lebanon at the Palestinian border" అని ఉంది. ఈ టైటిల్ ద్వారా పాలస్తీనా- లెబనాన్ సరిహద్దు అని స్పష్టంగా తెలుస్తుంది.
మే 20, 2021న ఒక ఛానెల్లో ప్రచురించిన మరో YouTube వీడియోని కూడా మేము కనుగొన్నాము. వీడియో టైటిల్ “4 days ago, they reached the border of Palestine and wanted to fight with the Jews” అని ఉంది. నాలుగు రోజుల కిందట సరిహద్దుకు చేరుకున్నారని.. యూదులతో పోరాడడానికి సిద్ధమయ్యారని అందులో చెప్పారు.
తదుపరి కీవర్డ్ సెర్చ్‌లో, మే 2021లో ప్రచురించిన కొన్ని కథనాలను కూడా మేము కనుగొన్నాము. ఇజ్రాయెల్- లెబనీస్ సరిహద్దులో వేలాది మంది పాలస్తీనియన్, లెబనీస్ నిరసనకారులు ఒకరి మీద మరొకరు రాళ్ళు విసురుకున్నారు. ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్, స్మోక్ బాంబులను వేయడం ద్వారా సిమెంట్ గోడపైకి ఎక్కిన వాళ్ళను కిందకు దించేరాలు.
arabnews.com ప్రకారం, పాలస్తీనియన్లకు సంఘీభావంగా దక్షిణ లెబనాన్ సరిహద్దులో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలలో లెబనాన్ ప్రజలకు రాజకీయ నాయకులు, అధికారులు సూచించారు.
అనేక మంది లెబనీస్ ఫ్యూచర్ మూవ్మెంట్ మద్దతుదారులు పాలస్తీనియన్లకు తమ సంఘీభావాన్ని ప్రకటించడానికి సరిహద్దు పట్టణమైన మార్వాహిన్కు వెళ్లారని నివేదికలో తెలిపారు.
అందువల్ల, నిరసనకారులు ఇజ్రాయెల్ - లెబనాన్ కంచె పైకి ఎక్కుతున్నట్లు చూపించే వైరల్ వీడియో ఇటీవలి ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం సమయంలో గాజాలో జరిగింది కాదు. ఇది 2021 సంవత్సరం లోనిది.
Claim : Terrorists and supporters are trying to enter Israel by jumping the fence at the Israel- Lebanon boundary in support of Palestine.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story