Sun Dec 22 2024 15:20:03 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పేద ప్రజలు అట్టలపై అన్నం తింటున్న ఘటన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినది.. భారతీయ జనతా పార్టీకి సంబంధించినది కాదు
పేద ప్రజలు అట్టలపై అన్నం తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలో చోటు చేసుకుందని చెబుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
పేద ప్రజలు అట్టలపై అన్నం తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలో చోటు చేసుకుందని చెబుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పేదలకు అన్నాన్ని అట్టలపై పెట్టారని.. ఇది దారుణమైన విషయమని పలువురు పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
బీజేపీ ఈవెంట్ లో ప్రజలు అట్టలపై అన్నం తింటున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకుని సెర్చ్ చేయగా ఇది తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుందని తెలిసింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో ఒక జర్నలిస్ట్ చేసిన ట్వీట్లో ఈ విజువల్స్తో కూడిన వీడియో ఉంది. ఇది అక్టోబర్ 27, 2022న ట్వీట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన గొల్ల-కురుమ కులాల సమావేశానికి సంబంధించిన వీడియో అని జర్నలిస్టులు తెలిపారు. బీఎస్పీ తెలంగాణ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా ఇదే వీడియోను ట్వీట్ చేశారు.
"ఈ రోజు TRS ఆధ్వర్యంలో మన్నెగూడ ఫంక్షన్ హాల్లో జరిగిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో మా యాదవుల ఆత్మగౌరవాన్ని ఎట్ల దెబ్బతీసిండ్రో చూడండి! అన్న తిననీకె ప్లేట్లు కూడా ఇవ్వరా? అందుకే BSP ఈ సారి మునుగోడుల ఈ దొరలకు కర్రు కాల్చి వాత పెట్టాలంటున్నది." అంటూ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ ను కూడా చూడవచ్చు.
ఈనాడు న్యూస్ పేపర్ లో అక్టోబర్ 27, 2022న కథనాన్ని చూడవచ్చు. వార్తా కథనం ప్రకారం, ఈ సంఘటన తెలంగాణలోని మన్నెగూడలోని ఒక ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ గొల్ల-కురుమ ఆత్మీయ సమ్మేళనంలో జరిగింది. సమావేశానికి పెద్దఎత్తున జనం రావడంతో నిర్వాహకులు వారిని అదుపు చేయలేకపోయారు. ప్లేట్లు లేకపోవడంతో కొందరు ప్రజలు అట్ట పెట్టెలకు ఉపయోగించే కార్టన్ లపై ఆహారాన్ని తిన్నారు.
పలు మీడియా సంస్థలు కూడా ఇందుకు సంబంధించిన కథనాలను పబ్లిష్ చేశాయి.
https://www.v6velugu.com/
https://www.thequint.com/
కాబట్టి, ఈ ఘటనకు బీజేపీని ఆపాదిస్తూ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Claim : A video of people eating food on carton straps is from a meeting organised by the BJP
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story