Mon Dec 23 2024 15:33:38 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 2015 లో సోనియా గాంధీకి చెందిన వీడియో మరోసారి వైరల్..!
నేను ఇందిరా గాంధీ కోడలిని.. అంత తేలికగా భయపడేదాన్ని కాదని ఇటీవల సోనియా గాంధీ అన్నారా..?
క్లెయిమ్: నేను ఇందిరా గాంధీ కోడలిని.. అంత తేలికగా భయపడేదాన్ని కాదని ఇటీవల సోనియా గాంధీ అన్నారా..?
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
'నేను ఇందిరా గాంధీ కోడలిని.. అంత తేలికగా భయపడేదాన్ని కాదు.' అంటూ సోనియా గాంధీ మీడియా ప్రతినిధులతో 2015 సంవత్సరంలో చెప్పిన వీడియోను మరోసారి వైరల్ చేస్తూ ఉన్నారు. నాటి వీడియోను ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనగా వైరల్ చేస్తూ ఉన్నారు.
అప్పట్లో పార్లమెంట్ లాబీల్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ''ఎవరికైనా ఎందుకు భయపడాలి. నేను ఇందిర కోడలిని ఎవరికీ భయపడను''అన్నారు. కేంద్రం మీపై కక్ష కట్టిందా అని అడగగా అది తనకంటే మీడియాకే బాగా తెలుసన్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు చెందిన మనీలాండరింగ్ మరియు ఆస్తుల దుర్వినియోగానికి సంబంధించి ఆరు నెలల క్రితం దాఖలు చేసిన కేసు కోసం INC అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు ఆమె కుమారుడు లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీకి ED సమన్లు పంపింది. వీరిద్దరూ జూన్ 8న ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది
ఆరు సెకన్ల వీడియోలో సోనియా గాంధీ హిందీలో, "నేను ఇందిరా జీకి కోడలు, నేను ఎవరికీ భయపడను" అని చెప్పడం వినవచ్చు. "गली का कोई लफ़ंडर चोरी करता हैं, पुलिस पकड़ने आए तो बोलता हैं मेरे मामा विधायक हैं-ताऊ मंत्री हैं, ऐसे ही जब ED ने सोनिया को सरकारी खजाने से चोरी करने पर पूछताछ को बुलाया तो सोनिया बोली मैं इंद्रा की बहू हूँ") అంటూ కొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మా బృందం 'Sonia Gandhi I am Indira Gandhi daughter in-law' అనే కీవర్డ్లను ఉపయోగించి వెతికగా.. డిసెంబర్ 8, 2015న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన 23 సెకన్ల వీడియో కనుగొనబడింది. "Not Scared Of Anyone, I Am Indira Gandhi's Daughter-In-Law: Sonia Gandhi" అనే హెడ్ లైన్ పెట్టి వీడియోను పోస్టు చేశారు.టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన నివేదిక ప్రకారం, 2015లో ఢిల్లీలోని ట్రయల్ కోర్టు సోనియా గాంధీ, ఆమె కుమారుడు ఎంపీ రాహుల్‌తో పాటు మరో ఐదుగురు నిందితులను ఆ ఏడాది డిసెంబర్ 19న తమ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. దాని గురించి అప్పట్లో పలు మీడియా సంస్థలు నివేదికలను జారీ చేశాయి.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, 2013లో, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కొనుగోలు చేయడంలో మోసం చేశారని మరియు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
తాజాగా జూన్ 8న ఈడీ ఎదుట సోనియా గాంధీ హాజరుకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా హాజరవ్వలేదు. సోనియా గాంధీ కొన్నిరోజుల కిందట కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి సోనియా ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఆమె ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరు కావాల్సి ఉంది. జూన్ 8న విచారణకు రావాలంటూ ఇటీవలే ఈడీ సమన్లు పంపింది. తనకు ఇంకా కరోనా నెగెటివ్ రాలేదని, తాను విచారణకు హాజరుకాలేనని సోనియా ఈడీకి స్పష్టం చేశారు. తనకు కొంత సమయం కావాలని, విచారణను మరో తేదీకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోనియా కార్యాలయం ఈడీకి లిఖితపూర్వకంగా తెలియజేసింది. సోనియా తనయుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. రాహుల్ ఈ నెల 13న ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులు ఇప్పటివి కావు.
క్లెయిమ్: నేను ఇందిరా గాంధీ కోడలిని.. అంత తేలికగా భయపడేదాన్ని కాదని ఇటీవల సోనియా గాంధీ అన్నారా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Sonia Gandhi said, I am daughter in-law of Indira ji, I am not afraid of anyone.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story